ప్రముఖ రచయితతో బిగ్ బాస్ బ్యూటీ.. అతనితో కలిసి గోవాలో ఎంజాయ్ చేస్తూ వీడియో!

సినీ ఇండస్ట్రీలో ఎవరి లక్కు ఎలా ఉంటుందో ఎప్పుడు చెప్పలేం. అనేక సినిమాల్లో ఎంతగా నటించినప్పటికీ రానీ పేరు కేవలం ఒక్క షో, ఒక్క పోగ్రామ్ లేదా కాంట్రవర్సీ ద్వారా వస్తుంది. సినిమాల్లో హీరోయిన్ గా రాని పాపులారిటీ బిగ్ బాస్ వల్ల తెచ్చుకున్న బ్యూటిఫుల్ ముద్దుగుమ్మ దివి వాద్యా. సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాలో నటించిన ఈ అమ్మడికి పెద్దగా కలిసి రాలేకపోయినా.. బిగ్ బాస్ ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఫలితంగా వరుస సినిమాలతో దూసుకుపోతోంది. అలాగే హాట్ పిక్స్ షేర్ చేస్తూ మెస్మరైజ్ చేసే ఈ బ్యూటి తాజాగా ఒక పాపులర్ రైటర్ తో గోవాలో దర్శనం ఇచ్చింది.

అందంతో ఆకర్షించి : అత్యధిక పాపులారిటీ సంపాదించుకున్న బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా సూపర్ పాపులర్ అయిన వాళ్లలో బ్యూటిఫుల్ తెలుగు అమ్మాయిల్లో దివి వాద్యా ఒకరు. అయితే బిగ్ బాస్ కు ముందు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అంతకుముందు మోడలింగ్ రంంగలోకి అడుగుపెట్టింది. మోడలింగ్ రంగంలో తన అందచందాలతో ఆకర్షించింది ఈ ముద్దుగుమ్మ దివి వాద్యా.

Bigg Boss Divi Vadthya

ఒక సన్నివేశంలోనే : మోడలింగ్ తర్వాత 'లెట్స్ గో' అనే సినిమాతో నటిగా సినీ ఇండస్ట్రీలోకి ఇంట్రడ్యూస్ అయింది గ్లామరస్ భామ దివి వాద్యా. అనంతరం 'సీన్ నెంబర్ 72' సహా ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. వరుసగా పలు సినిమాలు చేస్తున్న క్రమంలోనే ఈ సొట్ట బుగ్గల సుందరి దివి వాద్యాకు సూపర్ స్టార్ మహేశ్ బాబు చిత్రం 'మహర్షి'లో ఓ సన్నివేశంలో నటించే అవకాశం లభించింది.

రాని గుర్తింపు : అయితే బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించిన మహర్షి మూవీతో దివి వాద్యాకు మాత్రం పెద్దగా కలిసొచ్చింది ఏం లేదు. ఇలా ఎప్పుడో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన గ్లామరస్ బ్యూటి దివి వాద్యా హీరోయిన్‌గా, సపోర్టింగ్ ఆర్టిస్టుగా అనేక సినిమాలు చేసింది. అందులో కొన్ని సినిమాలు విజయం సాధించినప్పటికి దివికి మాత్రం సరైనా గుర్తింపు దక్కలేదు.

షాక్ ఇచ్చిన బ్యూటి : ఇక సినిమాల సంగతి అటు ఉంచితే అందాల తార దివి వాద్యాకు బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశం లభించింది. ఈ సీజన్ లోకి సాదాసీదాగానే ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తన అందంతో పాటు ఆటతీరుతో ఆకట్టుకుంది. నిజాయితీగా ఉంటూ అనేకమందికి ఫేవరేట్ గా నిలిచింది. కానీ ఆమె ఆట తీరు పెద్దగా ప్రభావం చూపిచకపోవడంతో మధ్యలోనే ఎలిమినేట్ అయి షాక్ ఇచ్చింది.

Bigg Boss Divi Vadthya

జాజిమొగులాలి పాటతో : బిగ్ బాస్ తర్వాత ముద్దుగుమ్మ దివి వాద్యా 'నయీం డైరీస్', లంబసింగి, గాడ్ ఫాదర్ వంటి సినిమాలు చేసింది. అలాగే క్యాబ్ స్టోరీస్, మానీళ్ల ట్యాంక్, పరంపర 2, ఏటీఎమ్ వంటి వెబ్ సిరీస్ ల్లోనూ ఆకట్టుకుంది దివి వాద్యా. తాజాగా జగపతి బాబు మెయిన లీడ్ రోల్ చేస్తున్న రుద్రంగి సినిమాలో ఐటమ్ సాంగ్ చేసి కూడా అలరించింది. జాజిమొగులాలి అనే ఫోక్ సాంగ్ ను రీక్రియేట్ చేసిన ఈ మూవీ త్వరలో రానుంది.

పర్సనల్ విషయాలు : సోషల్ మీడియాలో ఎంతో కాలంగా సందడి చేస్తున్న బిగ్ బాస్ ముద్దుగుమ్మ దివి వాద్యా అప్పుడప్పుడు హాట్ ఫొటోలతో యూత్ ను తనవైపు ఆకర్షిస్తోంది. ఇలా హాట్ ఫొటోలు, వీడియోలు వదులుతూ నిత్యం హాట్ టాపిక్ గా మారుతోంది. తన కెరీర్, పర్సనల్ కు సంబంధించిన సినీ విశేషాలు, ఈవెంట్స్ వివరాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ అభిమానులకు మరింత దగ్గరవుతోంది ఈ బ్యూటి.

గేయ రచయితో కలిసి : ప్రస్తుతం గోవా వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది బ్యూటిఫుల్ దివి వాద్యా. మొన్నటివరకు మసాజ్ చేసుకుంటూ, హాట్ పిక్స్ వదిలిన ఈ బ్యూటి తాజాగా ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ తో గోవాలో దర్శనం ఇచ్చింది. మిస్టర్ పర్ఫెక్ట్ లోని చలి చలిగా అనే పాటను ఆలపించారు శ్రీరామ్. దివి కూడా పాటను ట్యూన్ చేస్తూ సెల్ఫీ వీడియో తీసింది. మసాజ్ లు, రెస్టారెంట్స్ లో స్పెండ్ చేస్తూ ఫ్రెండ్స్ తో కలిసి దివి గోవాలో గట్టిగా ఎంజాయ్ చేస్తోందని ఆమె పోస్టులకు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X