ఆ విషయంలో ప్రపంచం అంతా ఒక వైపు, నేనొక్కదాన్నే మరోవైపు .. దివ్వెల మాధురి ఆవేదన..

Divvela Madhuri: దివ్వెల మాధురి.. గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9లో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో గుర్తింపు పొందిన దివ్వెల మాధురి. తక్కువ కాలంలోనే తన దూకుడు స్వభావంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ను వివాహం చేసుకున్న ఆమె, రాజకీయాలు, సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తోంది. బిగ్‌బాస్ హౌస్‌లో కేవలం మూడు వారాలు మాత్రమే ఉన్నప్పటికీ,ఆటతీరు, మాటతీరుతో 'ఫైర్ బ్రాండ్'గా పేరు తెచ్చుకుంది. తాజాగా ఓ టాక్ షోలో పాల్గొన్న మాధురి.. తన జీవితంలో ఎదుర్కొన్న అవమానాలు, కష్టాలను వెల్లడిస్తూ 'ప్రపంచంతోనే పోరాడాను' అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇంతకీ ఏం జరిగింది?

ఫైర్ బ్రాండ్ దివ్వెల మాధురి తాజాగా (Kissik Talks)పాడ్ క్యాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో ఆమె తన వ్యక్తిగత జీవితం, వ్యాపారం, రాజకీయాల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా 'మీరు ఇలా ధైర్యంగా ఉండటానికి కారణమేంటీ? అని ప్రశ్నించగా.. 'నేను ధైర్యం పక్కన నిలబడతాను, నా ధైర్యం మా ఆయన దువ్వాడ శ్రీనివాస్. ఆయన పక్కన నిలబడతాను కాబట్టే నాకు ఇంత ధైర్యం. ఆయన ప్రేమ కోసం ప్రపంచంతోనే ఫైట్ చేశా. ప్రపంచం అంతా ఒక వైపు, నేనొక్కదాన్నే ఒకవైపు నిలబడి పోరాటం చేశా, అలా ఫైట్ చేసుకుంటూ చేసుకుంటూ.. ఈ రోజు ఈ స్టేజ్‌కి వచ్చాను' అంటూ ఎమోషనల్ అయ్యారు.

Bigg Boss Divvela Madhuri Emotional Comments Go Viral I Fought Against the Whole World for Love

ఈ పోరాటంలో సమాజం గురించి ఎపుడు ఆలోచించలేదా? ఈ సమాజం ఏమనుకుంటుంది? నేను చేస్తుంది కరెక్టేనా? అని మీకు ఎప్పుడు అనిపించలేదా? అని యాంకర్ ప్రశ్నించగా మాధురి బదులిస్తూ.. ' నాకెప్పుడూ అనిపించలేదు. మనం కష్టంలో ఉన్నామంటే ఎవరూ వచ్చి పోషించరు. ఇంకా రెండు రాళ్లు వేసి చంపేస్తారే తప్ప.. మనకోసం నిలబడే వారు ఎవరూ ఉండరు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

ట్రోల్స్ ను ఎలా ఎదుర్కొన్నారు? అని వర్ష ప్రశ్నించగా మాధురి ఆసక్తికరంగా బదులిచ్చింది. 'ఆ సమయంలో చాలా బాధగా అనిపించేది. నాకే కాదు, సమాజంలోని ప్రతి మహిళకు ఇలాంటి ఇలాంటి ఇబ్బందులుంటాయి.నచ్చిన డ్రస్ వేసుకుంటే.. అలాంటి డ్రస్ వేసుకుందని, గట్టిగా మాట్లాడితే.. గట్టిగా మాట్లాడుతుందని, గట్టిగా నవ్వితే.. గట్టిగా నవ్విందని, ఏమీ చేయకుండా కూర్చుంటే.. దీనికి ఏమీ రాదని.. ఇలా ప్రతి విషయంలో ఏదోకటి అంటునే ఉంటారు. అలాంటి సమాజం గురించి ఆలోచించాలని నాకెప్పుడూ అనిపించలేదు' అని దువ్వాడ మాధురి తన ఆవేదనని వ్యక్తం చేశారు.

ఇక తన వ్యాపారంపై మాట్లాడుతూ మాధురి ఆసక్తికర వివరాలు వెల్లడించింది. 'నా బిజినెస్‌లో దాదాపు రూ.50 కోట్లు పెట్టుబడి పెట్టాను. నా దగ్గర పని చేసే వారికి నెలకు సుమారు రూ. 25 లక్షల వరకు జీతాలు ఇస్తాను' అంటూ తన ఆర్థిక స్థితిని వివరించింది. గోల్డ్‌పై తనకు ఉన్న ఇష్టాన్ని కూడా వెల్లడిస్తూ..'నాకు బంగారం అంటే చాలా ఇష్టం. మా ఆయన శ్రీనివాస్ రోజుకు లక్ష రూపాయలు ఇస్తారు గోల్డ్ కొనడానికి. నెలరోజులు సేవ్ చేసి, నా డబ్బులతో కలిపి దాదాపు రూ. 50 లక్షల విలువైన గోల్డ్ కొనుగోలు చేస్తాను'అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మాధురి చేసిన ఈ బోల్డ్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X