twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అందులో పాల్గొంటున్నానని ఎలా రాస్తారు: మీడియాపై శ్రద్దా దాస్ ఫైర్

    |

    బిగ్గెస్ట్ తెలుగు రియాలిటీ షో 'బిగ్ బాస్'.. మూడు గొడవలు.. నాలుగు ఫైటింగులుగా సాగుతోంది. గత రెండు సీజన్లతో పోల్చుకుంటే ఇందులో కంటెస్టెంట్ల మధ్య సమన్వయం కుదరడం లేదు. దీంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో సీజన్ -3లో ఎన్నో కొత్త కొత్త సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అదే సమయంలో రొమాన్స్, లవ్, ఏడుపులు సహా పలు ఎమోషన్స్ కూడా కనిపిస్తున్నాయి. దీంతో బిగ్ బాస్ షో ఆసక్తికరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో శ్రద్దా దాస్ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంటరవుతుందని ప్రచారం జరిగింది. దీనిపై తాజాగా ఆమె స్పందించింది.

    వైల్డ్ కార్డ్ ఎంట్రీ

    వైల్డ్ కార్డ్ ఎంట్రీ

    బిగ్ బాస్ హౌస్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనే విధానం ఉంటుందన్న విషయం తెలిసిందే. గత రెండు సీజన్లలో ఇద్దరేసి సభ్యులు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా షో మధ్యలో ఇంటిలోకి ప్రవేశించారు. ఈ సీజన్‌లో కూడా మొదటి వారం పూర్తయిన తర్వాతనే వైల్డ్ కార్డ్ ఎంట్రీ జరిగింది. ఫస్ట్ వీక్‌లో సీనియర్ నటి హేమ ఎలిమినేట్ అవగా.. అదే రోజు ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి ఇంటిలోకి ఎంటర్ అయిన విషయం తెలిసిందే. ఇక, తాజాగా శిల్పా చక్రవర్తి ఇంట్లోకి ప్రవేశించింది.

    అంతకు ముందు చాలా పేర్లు

    అంతకు ముందు చాలా పేర్లు

    బిగ్ బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందని చాలా రోజుల పాటు ప్రచారం జరిగింది. ఇందుకోసం ఎప్పటి నుంచో శ్రద్దా దాస్, ఇషా రెబ్బా, హెబ్బా పటేల్, యాంకర్ మంజూష సహా ఎంతో మంది పేర్లు వినిపించిన విషయం తెలిసిందే. అయితే, వీళ్లెవరూ బిగ్ బాస్‌లోకి ఎంటరవుతున్నట్లు ప్రకటించలేదు. దీంతో ఈ వార్తలకు పుల్‌స్టాప్ పడిపోయింది. దీనికి తోడు శిల్పా ఎంటర్ అవడంతో ఈ వార్తలు ఆగిపోయాయి.

    ఆమె పేరే ఎక్కువగా

    ఆమె పేరే ఎక్కువగా

    వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించే వారి గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. వారిలో అందరి కంటే ఎక్కువగా శ్రద్దా దాస్‌ పైనే వచ్చాయి. ఆమె ఈ వారం ఇంట్లోకి వెళ్తుందని కొందరు అంటే.. కాదు కాదు వచ్చే వారం వెళ్తుంది అని మరికొందరు రాశారు. దీంతో శ్రద్దా దాస్ పేరు హాట్ టాపిక్ అయిపోయింది. దీనికి తోడు ఆమె గతంలో వరుణ్ సందేశ్‌లో ప్రేమాయణం సాగించిందని కూడా ప్రచారం జరగడంతో ఇవి రెట్టింపు అయ్యాయి.

    మీడియాపై ఫైర్

    మీడియాపై ఫైర్

    తాను బిగ్ బాస్‌లో పాల్గొంటున్నానని వస్తున్న వార్తలపై శ్రద్దా దాస్ స్పందించింది. ‘నేను ప్రస్తుతం అన్ని భాషల్లో కలిపి ఐదారు సినిమాల్లో నటిస్తున్నాను. ఆ షూటింగులతో బిజీగా గడుపుతున్నాను. ఇలాంటి సమయంలో అసలు నన్ను సంప్రదించకుండానే బిగ్ బాస్‌లో పాల్గొంటానని ఎలా రాస్తారు..? నన్ను అడిగితే నేను క్లారిటీ ఇచ్చేదాన్ని కదా' అంటూ ఆమె మీడియాపై ఫైర్ అయింది.

    English summary
    Big boss reality show Full success in Telugu Television History. Two seasons succesfully completed. And season 3 Started 21st july. This season Was Host By Akkineni Nagarjuna.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X