Bigg Boss: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది సన్నీనే.. ఎవిక్షన్ పాస్ వచ్చినా నో యూజ్.. ఇదెక్కడి లాజిక్కో!

తెలుగు బుల్లితెరపై పెట్టుకున్న సరిహద్దులను చెరిపేయడంతో పాటు సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలుస్తూ నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. ఏమాత్రం అంచనాలు లేకుండానే పరిచయం అయిన దీనికి ప్రేక్షకుల నుంచి ఊహించని రీతిలో స్పందన వచ్చింది. ఫలితంగా సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో నిర్వహకులు సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.

Recommended Video

Bigg Boss Telugu 5 : VJ Sunny Elimination | అనీ మాస్టర్‌ ఎలిమినేట్ పక్కా || Filmibeat Telugu

ఈ క్రమంలోనే ఇప్పుడు ఐదో సీజన్‌ను కూడా ఎంతో రసవత్తరంగా నడుపుతున్నారు. ఇక, ఈ సీజన్ చివరి దశకు చేరుకోవడంతో బిగ్ బాస్ సరికొత్త టాస్కులు ఇస్తున్నాడు. దీంతో కంటెస్టెంట్లు కూడా పోటీపోటీగా ఆడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో పలువురి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఆ వివరాలు మీకోసం!

ఐదో సీజన్‌కు అదే రేంజ్ రెస్పాన్స్

ఐదో సీజన్‌కు అదే రేంజ్ రెస్పాన్స్

తెలుగులో ఇప్పటి వరకూ నాలుగు సీజన్లు ప్రసారం కాగా.. అన్నింటికీ భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఐదో సీజన్ వాటికి మించిన రేటింగ్‌తో దూసుకుపోతోంది. ప్రీమియర్ ఎపిసోడ్‌ నుంచే రికార్డు స్థాయి స్పందనను అందుకుంటోన్న ఈ సీజన్ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో నిర్వహకులు కూడా ప్రేక్షకులకు నచ్చే అంశాలనే ఎక్కువగా ఫోకస్ చేసి చూపిస్తున్నారు. మరీ ముఖ్యంగా గొడవలు, లవ్ ట్రాకులు, రొమాంటిక్ సన్నివేశాలతో పాటు ఊహించని కంటెంట్‌ను ప్రసారం చేస్తున్నారు. దీంతో వారం రోజులతో పాటు వారంతాల్లోనూ మంచి రేటింగ్ వస్తోంది.

బిగ్ బాస్ కెప్టెన్‌గా ఎంపికైన మానస్

బిగ్ బాస్ కెప్టెన్‌గా ఎంపికైన మానస్

హౌస్‌లో కంటెస్టెంట్లలో ప్రతివారం ఇంటి కెప్టెన్‌ను ఎన్నుకునేందుకు బిగ్ బాస్ ఓ టాస్క్ ఇస్తుంటాడు. ఈ వారానికి కెప్టెన్సీ కోసం పోటీ పడే కంటెస్టెంట్లను సెలెక్ట్ చేసేందుకు గానూ 'మీ ఇల్లు బంగారం కాను' అనే టాస్క్ ఇచ్చాడు. ఎన్నో మలుపులతో సరదాగా సాగిన ఈ టాస్కులో అందరూ మంచిగానే ఆడారు. అయితే, మాన‌స్‌, ప్రియాంక‌, సిరి, ఆనీ మాత్రమే కెప్టెన్సీ కోసం పోటీ పడ్డారు. కెప్టెన్సీ కోసం 'రింగ్ ఈజ్ కింగ్' టాస్క్ పెట్టగా.. ఇందులో మానస్ విజయం సాధించాడు. తద్వారా ఇంటికి కొత్త కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. దీంతో రవి అతడికి బ్యాండ్ ఇచ్చాడు.

ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ ఇచ్చారుగా

ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ ఇచ్చారుగా

బిగ్ బాస్ ఐదో సీజన్ కీలక దశకు చేరుకుంటోన్న సమయంలో నిర్వహకులు సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో 'ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌' టాస్కును తీసుకుని వచ్చారు. ఇందులో గెలిచిన సభ్యుడు లేదా సభ్యురాలికి ఒకవారం ఎలిమినేషన్ తప్పించుకునే అవకాశం ఉంటుంది. దాన్ని వాళ్లు ఎప్పుడైనా వాడుకోవచ్చు. అంటే నామినేషన్‌లో ఉన్నప్పుడు ఎలిమినేట్ అవుతామన్న సందేహం ఉంటే వీకెండ్ ఎపిసోడ్‌లో దీన్ని వాడుకుంటారు. గత సీజన్‌లో జబర్ధస్త్ అవినాష్ ఇలాగే పాస్‌ను వాడుకుని ఓ వారం సేఫ్ అయ్యాడు.

‘నిప్పులే శ్వాసగా.. గుండెలో ఆశగా'

‘నిప్పులే శ్వాసగా.. గుండెలో ఆశగా'

తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో ఇంట్లో ఉన్న సభ్యులందరికీ 'ఎవిక్షన్ ఫ్రీ పాస్' టాస్కును ఇచ్చాడు బిగ్ బాస్. దీనికి 'నిప్పులే శ్వాసగా.. గుండెలో ఆశగా' అనే పేరు పెట్టారు. దీని ప్రకారం.. బజర్‌ మోగిన వెంటనే ఎవరైనా ఇద్దరు ఇంటి సభ్యులు వెళ్లి.. ఫైర్‌ ఇంజిన్‌ వ్యాన్‌లో కూర్చోవాలి. వాళ్లకు ఎదురుగా ఇద్దరు కంటెస్టెంట్ల ఫొటోలు ఉంటాయి. అందులో నుంచి ఒక దాన్ని నిప్పుల్లో కాల్చేయాలి. ఇందుకోసం వ్యాన్‌లో కూర్చున్న ఇద్దరు సభ్యులు ఏకాభిప్రాయానికి రావాల్సి ఉంటుంది. అలా చివరి వరకూ ఎవరి ఫొటో కాలకుండా ఉంటుందో వాళ్లకే పాస్ సొంతం అవుతుంది.

వాళ్లు ఎక్కారు... వీళ్లను కాల్చేశారు

వాళ్లు ఎక్కారు... వీళ్లను కాల్చేశారు

టాస్కులో భాగంగా మొదట ఫైర్ ఇంజ‌న్ అలార‌మ్ మోగ‌గా ర‌వి, ష‌ణ్ముఖ్ వ్యాన్ ఎక్కారు. వీరికి మాన‌స్‌, శ్రీరామ్‌ ఫొటోలు వ‌చ్చాయి. వీళ్లిద్దరూ కలిసి మాన‌స్ ఫొటోను మంట‌ల్లో కాల్చేశారు. తర్వాతి రౌండ్‌లో స‌న్నీ, మాన‌స్ వ్యాన్ ఎక్కారు. వీరికి ర‌వి, ఆనీ మాస్ట‌ర్ ఫొటోలు రాగా.. ఏకాభిప్రాయంతో ర‌వి ఫొటోను కాల్చేశారు. తర్వాత సిరి హన్మంత్, షణ్ముఖ్ జస్వంత్ వంతు వచ్చింది. వీళ్లిద్దరూ కలిసి సన్నీని సేవ్ చేసి పింకీ ఫొటోను కాల్చేశారు. అనంతరం ఆనీ, శ్రీరామ్ వ్యాన్ ఎక్కారు. వీళ్లకు సిరి, షన్నూ ఫొటోలు వచ్చాయి. వీళ్లిద్దరిలో సిరిని మాత్రమే సేఫ్ చేసి షన్నూ ఫొటో కాల్చారు.

 చివరికి మిగిలింది వాళ్లు ముగ్గురే

చివరికి మిగిలింది వాళ్లు ముగ్గురే

ఈ టాస్కులో భాగంగా తర్వాతి రౌండ్‌లో కాజల్, పింకీ వ్యాన్ ఎక్కారు. అప్పుడు సిరి, శ్రీరామ్ ఫొటోలు రాగా.. లేడీ కంటెస్టెంట్‌కే ఓటు వేశారు. తర్వాత పింకీ, ఆనీకి సన్నీ, కాజల్ ఫొటోలు వచ్చాయి. వీళ్లిద్దరూ చాలా చర్చల అనంతరం కాజల్ ఫొటోను కాల్చేశారు. చివర్లో మానస్, కాజల్ వ్యాన్ ఎక్కగా.. సిరి, ఆనీ ఫొటోలు వచ్చాయి. కానీ, ఇద్దరికీ ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ టాస్కును తర్వాతి ఎపిసోడ్‌కు వాయిదా వేశారు. దీంతో సిరి, ఆనీ, సన్నీ ఫొటోలు మాత్రమే మిగిలాయి. ఈ ముగ్గురిలో ఎవరు ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను అందుకుంటారో అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.

ఈ వారం సన్నీనే ఎలిమినేట్ అని

ఈ వారం సన్నీనే ఎలిమినేట్ అని

బిగ్ బాస్ హౌస్‌లో స్ట్రాటజీలకు పెట్టింది పేరుగా నిలుస్తున్నాడు యాంకర్ రవి. ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ సమయంలో అతడు ఈ వారం సన్నీనే ఎలిమినేట్ అవుతాడని షాకింగ్ కామెంట్స్ చేశాడు. 'నాకు తెలిసి ఈ వారం సన్నీ ఎలిమినేట్ అవుతాడు. ఒక‌వేళ‌ ఎవిక్ష‌న్ పాస్ గెలిచినా కూడా స‌న్నీ దాన్ని వాడుకోడ‌ు' అని లాజిక్కులు లేని లెక్కలు మాట్లాడాడు. దీంతో అతడిపై సన్నీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇదిలా ఉండగా.. ఈ వారం మానస్, కాజల్, సిరి, ఆనీ, షణ్ముఖ్, వీజే సన్నీ, ప్రియాంక సింగ్, శ్రీరామ చంద్రలు నామినేట్ అయిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X