‘బిగ్ బాస్’లో వాళ్ల రొమాన్స్ కొనసాగుతుంది.. మరో జంట విడిపోయినట్లే.!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్'.. రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటి రెండు వారాలే పూర్తయినప్పటికీ.. క్లైమాక్స్‌కు చేరినప్పటి పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవానికి మొదటి వారం నుంచే కంటెస్టెంట్ల మధ్య వాగ్వాదాలు, ఏడ్పులు, రాజకీయాలు స్టార్ట్ అవడంతో ఈ రియాలిటీ షో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంటోంది. మొదటి వారం హేమ ఎలిమినేట్ అయ్యారు. ఇక, ఈ వారంలో ఎవరు బయటకు వెళ్తారనేది ఆసక్తికరంగా మారింది. గత వారం జరిగిన ఓటింగ్‌ను బట్టి చూస్తే ఒక జంట విడిపోక తప్పదన్న టాక్ వినిపిస్తోంది.

 ఎనిమిది మంది నామినేట్

ఎనిమిది మంది నామినేట్

నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యే సరికి గత వారం ఎలిమినేషన్ జోన్‌లోకి వచ్చే కంటెస్టెంట్లుగా శ్రీముఖి, హిమజ, జాఫర్, మహేష్, వరుణ్, వితిక, పునర్నవి, రాహుల్‌లు నామినేట్ అయ్యారు. ఒకేసారి ఎనిమిది మంది నామినేట్ కావడం షో చరిత్రలోనే మొదటిసారి కావడం విశేషం. గతంలో ఇలాంటి పరిస్థితులు తలెత్తకపోవడంతో ఏమౌతుందా అన్న ఆసక్తి కనిపించింది.

నలుగురు సేఫ్

నలుగురు సేఫ్

నామినేట్ అయిన ఎనిమిది మందిలో నలుగురు సేఫ్ అయ్యారు. చాలా మంది నామినేషన్‌లో ఉండడంతో సేఫ్ అయిన కంటెస్టెంట్లను త్వరగానే ప్రకటించారు నాగ్. తొలి సేఫ్ కంటెస్టెంట్ మహేష్ విట్టా కాగా.. ఆ తరువాత హిమజ, రాహుల్‌లుసేఫ్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. నాలుగో సేఫ్ కంటెస్టెంట్‌గా శ్రీముఖి గట్టెక్కడంతో ఊపిరి పీల్చుకుని కన్నీళ్లు పెట్టుకుంది.

మరో నలుగురు మిగిలారు

మరో నలుగురు మిగిలారు

ఎనిమిది మందిలో నలుగురు కంటెస్టెంట్లు సేఫ్ అవడంతో, మిగిలిన వితికా, వరుణ్, జాఫర్, పునర్నవిలలో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారన్నది సస్పెన్స్‌గా ఉంచుతూ ఎలిమినేషన్‌ను ఆదివారంకు వాయిదా వేశారు నాగార్జున. దీంతో ఎవరి అంచనాలను వాళ్లు వేసుకుంటున్నారు. పలానా వ్యక్తి ఎలిమినేట్ అవుతారని చెప్పుకుంటున్నారు.

జంటలకే ప్రమాదం

జంటలకే ప్రమాదం

‘బిగ్ బాస్' హౌస్‌లో వరుణ్ సందేశ్, వితిక షేరు కొంచెం స్పెషలనే చెప్పాలి. దీనికి కారణం వీరిద్దరూ భార్యభర్తలు కావడమే. వీరిలో ఒకరు (వితిక) ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని మూడు నాలుగు రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే ఈ జంట విడిపోవాల్సిందే. వీళ్లు దూరమైతే రొమాన్స్ ఉండే అవకాశం ఉండదు కాబట్టి వీరిద్దరూ విడిపోకుండా చేసినా ఆశ్చర్యం లేదు.

మరో జంట కూడా..

మరో జంట కూడా..

హౌస్‌లో మరో జంట అంటే బాబా భాస్కర్ - జాఫర్ అనే చెప్పాలి. వీళ్లిద్దరూ అంత క్లోజ్ అయిపోయారు. అందుకే నాగార్జున కూడా వీళ్లిద్దరిని బ్రొమాన్స్ చేస్తున్నారని ఆట పట్టించాడు. వీరిలో జాఫర్ కూడా ఎలిమినేషన్ జోన్‌లోనే ఉండడంతో ఆయన వెళ్లిపోయే అవకాశాలు కూడా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. మరి ఎవరు వెళ్తారో తెలియాలంటే సాయంత్రం వరకు ఆగాల్సిందే.

జాఫర్ వెళ్లిపోయాడంటూ ప్రచారం

జాఫర్ వెళ్లిపోయాడంటూ ప్రచారం

మిగిలిన నలుగురు కంటెస్టెంట్లలో జాఫర్ ఎలిమినేట్ అయ్యాడంటూ ప్రచారం మొదలైంది. దీనికి కారణం ప్రముఖ నిర్మాత సురేష్ కొండేటి చేసిన ట్వీటే. ఆయన తన ట్విట్టర్ ఖాతాలో జాఫర్ ఎలిమినేట్ అయ్యాడంటూ ట్వీట్ చేశాడు. ఇదే జరిగితే.. వరుణ్ - వితిక రొమాన్స్ కంటిన్యూ అవుతుంది. జాఫర్ ఇంటికి వెళ్తాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X