అందుకే సమంతకు హెస్ట్ బాధ్యత అప్పగించా.. నాగ్.. మాటల తూటాలను పేల్చిన హైపర్ ఆది
బిగ్‌బాస్ ఇంటిలో హైపర్ ఆది హంగామా టాప్ రేంజ్‌లో సాగింది. సహజంగా మాటలు తూటాలను పేల్చాడు. ఇంటి సభ్యులతో కలిసి ఫన్ క్రియేట్ చేశాడు. వేదికపైకి వచ్చిన అతిథులను కూడా ఆటపట్టిస్తూ.. డిటెక్టివ్‌గా అదరగొట్టాడు. హైపర్ ఆది హంగామా ఎలా కొనసాగిందంటే..

హోస్ట్‌గా సమంత గురించి నాగార్జున
బిగ్‌బాస్ షో ప్రారంభానికి ముందు... దసరా పండుగ సందర్భంగా మహా ఎపిసోడ్ జరగబోతుందంటూ నాగార్జున కులు మనాలి నుంచి చెప్పారు. ఎవరైనా ఇంటి నుంచి దూరంగా వెళ్తే ఇంటిని కోడలుకు అప్పగిస్తారు. నేను వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం కులు మనాలి వచ్చాను. కాబట్టి సమంతకు బిగ్‌బాస్ ఇంటిని అప్పగించాను అంటూ నాగార్జున చెప్పారు.

స్వాతిముత్యం బాబులా సోహైల్
సోహైల్ సయ్యద్‌ను హైపర్ ఆటాడేసుకొన్నాడు. ఫస్ట్‌లో అర్జున్ రెడ్డిలా ఉన్న వాడివి. ఆ తర్వాత స్వాతిముత్యంలా మారిపోయావేంటి అంటూ కామెంట్ విసిరాడు. ప్రతీ అర్ధగంటకు ఓసారి పాత పాత్రలోకి వెళ్లిపోవాలని అనిపిస్తుంది కదా అంటూ హైపర్ ఆది ప్రశ్నించాడు.
Recommended Video

లేకపోతే ఇంట్లో టీవీ చూస్తుండేవాడివి
సోహైల్ గురించి మాట్లాడుతూ.. నీవు స్వాతిముత్యంలా ఉన్నావు కాబట్టి టీవీలో ఉన్నావు. లేకపోతే ఇంట్లో టీవీ చూస్తు ఉండేవాడివి అంటూ హైపర్ ఆది ప్రశంసలు వ్యక్తం చేశాడు. చాలా బాగా ఆడుతున్నావు అంటూ అప్రిషియేట్ చేశాడు. ఇలానే ఆడితే మంచి ఫలితం రాబట్టే అవకాశం ఉంది అంటూ తెలిపారు.
పాయల్ రాజ్‌పుత్‌పై సెటైర్లు
వేదికపైకి వచ్చిన పాయల్ రాజ్‌పుత్‌ను కూడా హైపర్ ఆది వదల్లేదు. ఆమె తెలుగు మాట్లాడటంలో ఇంట్లో మోనాల్.. బయట పాయల్ రాజ్‌పుత్ అంటూ సెటైర్ వేశాడు. అలా వేదికపైన తనదైన శైలిలో వినోదాన్ని పంచాడు. ఎపిసోడ్‌లో ఆయన వేసిన పంచులు మరో లెవెల్‌కు వెళ్లేలా కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











