Bigg Boss Official Voting: లీకైన అఫీషియల్ ఓటింగ్.. ప్రమాదంలో మంచోళ్లు.. ఈ వారంలో వాళ్లిద్దరే ఔట్!

ఎప్పటికప్పుడు సరికొత్త టాస్కులు.. ఊహించని సంఘటనలు.. టెన్షన్ పెంచే ఎలిమినేషన్స్.. వీటితో పాటు కంటెస్టెంట్ల మధ్య గొడవలు ఇలా ఎన్నో ఆసక్తికరమైన సన్నివేశాలతో సాగుతోన్న రియాలిటీ షోనే బిగ్ బాస్. ఎన్నో అనుమానాల నడుమ తెలుగు బుల్లితెరపైకి వచ్చిన ఇది.. భారీ రెస్పాన్స్‌తో సూపర్ హిట్ అయింది. దీంతో సీజన్లను వరుసగా జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు సాగుతోన్న ఆరో సీజన్‌ చివరికి చేరవడంత ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో 13వ వారంలో ఓటింగ్ ఎలా జరుగుతుంది? డేంజర్ జోన్‌లో ఎవరున్నారు? చూద్దాం పదండి!

ఫినాలేకు ముందు ఆసక్తిగా

ఫినాలేకు ముందు ఆసక్తిగా

ఎన్నో అంచనాల నడుమ ప్రారంభం అయిన బిగ్ బాస్ ఆరో సీజన్ ఆశించిన రీతిలో స్పందనను అందుకోలేదు. దీంతో నిర్వహకులు ప్రేక్షకుల మనసులు దోచుకోడానికి ఎన్నో కొత్త టాస్కులు ఇచ్చారు. దీనికితోడు ఇప్పుడిది ఫినాలేకు చేరువ అవుతుండడంతో మరింత రంజుగా మారుతోంది. దీంతో రెస్పాన్స్ పెరగడంతో పాటు రేటింగ్ కూడా గణనీయంగా పుంజుకుంటూ సాగుతోంది.

ఇద్దరు తప్ప వాళ్లందరూ

ఇద్దరు తప్ప వాళ్లందరూ


బిగ్ బాస్ ఆరో సీజన్‌లో కూడా గతంలో మాదిరిగానే నామినేషన్స్ టాస్కులు రచ్చగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే 13వ వారంలో కూడా ఎన్నో గొడవలు ఉంటున్నాయి. ఇక, ఇందులో రేవంత్, ఆది రెడ్డి, కీర్తి భట్, జబర్ధస్త్ ఫైమా, రోహిత్ సాహ్నీ, శ్రీ సత్యలు నామినేట్ అయ్యారు. ఇక, ఈ వారం కెప్టెన్ అవడం వల్ల ఇనాయా.. ఓట్లు పడని కారణంగా శ్రీహాన్ సేఫ్ అయిపోయారు.

ఈ వారం షాకింగ్ ఓటింగ్‌

ఈ వారం షాకింగ్ ఓటింగ్‌

బిగ్ బాస్ ఆరో సీజన్‌లో ఇప్పటి వరకూ జరిగిన ఎలిమినేషన్స్ అన్నీ ఊహించని విధంగానే జరిగాయి. దీంతో ఎంతో మంది స్ట్రాంగ్ ప్లేయర్లు ఎలిమినేట్ అయ్యారు. ఇదే 13వ వారంలోనూ కంటిన్యూ అయ్యేలా కనిపిస్తోంది. దీనికి కారణం ఈ వారంలో కూడా ఓటింగ్ షాకింగ్‌గానే జరుగుతోంది. దీంతో కంటెస్టెంట్ల స్థానాల్లో చాలా రకాల మార్పులు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.

టాప్‌లో అతడు.. తర్వాత

టాప్‌లో అతడు.. తర్వాత

బిగ్ బాస్ ఆరో సీజన్‌లోకి రేవంత్ టైటిల్ ఫేవరెట్‌గా వచ్చాడు. అందుకే అతడు ఎప్పుడు నామినేషన్స్‌లో ఉన్నా అత్యధిక ఓట్లతో టాప్‌ ప్లేస్‌లో ఉంటూ సేఫ్ అవుతున్నాడు. 13వ వారంలో కూడా అతడికే ప్రేక్షకులు పట్టం కడుతున్నట్లు తెలిసింది. దీంతో రేవంత్ మొదటి స్థానంలో ఉన్నాడు. కానీ, రెండో స్థానంలో మాత్రం పలు మార్పులు కనిపిస్తున్నట్లు బిగ్ బాస్ వర్గాల సమాచారం.

మిగిలిన స్థానాల్లో ఎవరు?

మిగిలిన స్థానాల్లో ఎవరు?

బిగ్ బాస్ ఆరో సీజన్ పదమూడో వారానికి జరుగుతున్న ఓటింగ్‌లో మొదటి రెండు రోజులు రోహిత్ సెకెండ్ ప్లేస్‌లో ఉన్నాడు. కానీ, ఇప్పుడు ఆది రెడ్డి ఆ స్థానంలోకి వచ్చాడని తెలిసింది. దీంతో అతడు మూడో స్థానానికి పడిపోయాడని అంటున్నారు. వీళ్ల తర్వాత నాలుగో స్థానంలో కీర్తి భట్, ఐదో స్థానంలో శ్రీ సత్య, ఆరో స్థానంలో ఫైమాలు ఉన్నారని అఫీషియల్ ఓటింగ్ లీక్ అయింది.

మిస్‌డ్ కాల్స్‌లో అతడు

మిస్‌డ్ కాల్స్‌లో అతడు

బిగ్ బాస్ షోలో నామినేషన్స్‌లో ఉన్న వాళ్లను సేఫ్ చేసేందుకు హాట్‌స్టార్‌తో పాటు మిస్‌డ్ కాల్స్ ద్వారా ఓట్లు వేయొచ్చన్న విషయం తెలిసిందే. ఇక, 13వ వారంలో ఈ రెండింటిలోనూ రేవంత్‌ టాప్‌లో కొనసాగుతున్నాడని తెలిసింది. కానీ, రెండో స్థానంలో మాత్రం మిస్‌డ్ కాల్స్ ఓట్లతో రోహిత్‌కు ఉన్నాడట. మంచోడిగా పేరొందిన అతడు హాట్‌స్టార్ ఓట్లలో 3వ ప్లేస్‌లో ఉన్నాడని టాక్.

డబుల్ అయితే ఇ ఇద్దరే

డబుల్ అయితే ఇ ఇద్దరే


13వ వారంలో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని ఇప్పటికే ఓ న్యూస్ లీకైనట్లు చెప్పుకున్నాం. అంటే.. ఈ వారంలో టాప్ 2లో ఉన్న రేవంత్, ఆది రెడ్డి తప్ప మిగిలిన వాళ్లంతా డేంజర్ జోన్‌లోనే ఉన్నారని అంటున్నారు. ఫలితంగా వీళ్లలో ఎవరైనా వెళ్లిపోవచ్చు. ముఖ్యంగా ఫైమా, శ్రీ సత్య వెళ్లే ఛాన్స్ ఉంది. సింగిల్ ఎలిమినేషన్ అయితే ఫైమానే ఎలిమినేట్ అవుతుందని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X