రాహుల్ ఎలిమినేట్ అవుతాడనుకుంటే వేరేగా జరుగుతోంది.. ఈ వారం వాళ్లిద్దరిలో ఒకరు ఔట్.!

Recommended Video

Bigg Boss Telugu 3 : Shiva Jyothi Or Rohini Will Be Eliminated In This Week || Filmibeat Telugu

ఉత్తరాది నుంచి అరువు తెచ్చుకున్నప్పటికీ దక్షిణాదిలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్'. రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో.. మూడోది కూడా అదే స్థాయి రేటింగులతో దూసుకుపోతోంది. పేరున్న కంటెస్టెంట్లు లేకున్నా.. హౌసులో జరిగే సంఘటనల వల్ల ఈ ఫలితం కనిపిస్తోంది. అయితే, బిగ్ బాస్ షోలో ఎవరు ఎలిమినేట్ అవుతారు.? ఎవరు అవ్వరు అనేది అంతా అంచనా వేయగలుగుతున్నారు. కానీ, ఈ వారం మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఈ సారి ఊహించని కంటెస్టెంట్ బయటకు వెళ్లడం ఖాయమట.

ఊహించినట్లే వాళ్లిద్దరూ..

ఊహించినట్లే వాళ్లిద్దరూ..

మొదటి వారం ఎలిమినేషన్‌కు నామినేట్ అయిన వారిలో ఎవరు బయటకు వెళ్తారు అన్న దానిపై అందరిలో క్లారిటీ కనిపించింది. అందరూ అనుకున్నట్లు ఆ వారం హేమ ఎలిమినేట్ అయిపోయారు. మళ్లీ మూడో వారం తమన్నా విషయంలోనూ అదే జరిగింది. ఈ ఇద్దరు కంటెస్టెంట్లు హౌసులో చేసిన రచ్చకు బిగ్ బాస్ ప్రేక్షకులు వాళ్లపై ఆఇష్టత ప్రదర్శించారు. దీంతో ఇద్దరూ ఇంటి ముఖం పట్టారు.

జాఫర్ ఎలిమినేషన్ మాత్రం...

జాఫర్ ఎలిమినేషన్ మాత్రం...

రెండో వారం ఏకంగా ఎనిమిది మంది నామినేట్ అయ్యారు. వీరిలో శనివారం నలుగురు కంటెస్టెంట్లు సేఫ్ అవడంతో, మిగిలిన వితికా, వరుణ్, జాఫర్, పునర్నవిలలో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారన్నది సస్పెన్స్‌గా మారింది. వితికా షెరు ఎలిమినేట్ కావడం ఖాయమని చాలా మంది భావించారు. సోషల్ మీడియాలో కూడా వితికాకు వ్యతిరేకంగా బోలెడంత ప్రచారం జరిగింది. అయితే, ఆమె సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోయింది. జాఫర్ ఎలిమినేట్ అయిపోయాడు.

ఈ వారం లీకులు రాలేదు

ఈ వారం లీకులు రాలేదు


గత మూడు వారాలు ఎవరు ఎలిమినేట్ అవుతారన్న దానిపై కొన్ని లీకులు బయటకు వచ్చాయి. కానీ, ఈ వారం అలా జరగలేదు. దీంతో ఈ వారం ఎలిమినేషన్‌కు రాహుల్, శివజ్యోతి, శ్రీముఖి, రవి, రోహిణి, వరుణ్, బాబా భాస్కర్‌లలో ఎవరు ఇంటి నుంచి బయటకు వెళ్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే, సోషల్ మీడియాలో విచిత్రమైన ప్రచారం జరుగుతోంది.

రాహుల్‌ హాట్ టాపిక్ అయ్యాడు

రాహుల్‌ హాట్ టాపిక్ అయ్యాడు

ఈ వారం ఎలిమినేషన్ జోన్‌లో ఉన్న వారిలో రాహుల్ సింప్లీగంజ్ ఒక్కడే హాట్ టాపిక్ అయ్యాడు. శ్రీముఖితో గొడవ పడిన తీరు, కెప్టెన్సీ టాస్క్‌లో అవతలి టీమ్‌కు సహాయం చేయడం, బజర్ మోగిన సమయంలో సింహాసనంపై కూర్చోకుండా సిగరెట్ కాల్చుతూ కనిపించడం, పునర్నవితో పులిహోర కలపడం వంటి వాటితో ఈ సారి బయటకు వెళ్లేంది రాహుల్ అని ప్రచారం జరుగుతోంది. అతడిపై చాలా మంది గుర్రుగా ఉన్నారు కూడా.

వాళ్లిద్దరూ డేంజర్ జోన్‌లో ఉన్నారు

వాళ్లిద్దరూ డేంజర్ జోన్‌లో ఉన్నారు

రాహుల్ బయటకు వెళ్తాడని చాలా మంది అనుకుంటున్నారు కానీ, శివజ్యోతి, రోహిణి డేంజర్ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. గూగుల్‌లో కొన్ని సైట్లు పెట్టిన పోలింగ్‌లో ఇదే విషయం తేలింది. వీటిలో రాహుల్ మాత్రం ఊహించని విధంగా ఓట్లు సంపాదించుకున్నాడు. అయితే, ఇవి అధికారికమైనవి కాకపోయినా.. జనాల నాడి ఈ విధంగానే ఉంటుందని అంచనా వేయొచ్చంటున్నారు కొందరు విశ్లేషకులు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X