ఆ కంటెస్టెంట్ లేకపోతే పునర్నవి ఇంటికే.. ఈ బ్యూటీని ఎలిమినేట్ కాకుండా కాపాడుతున్నది ఎవరు?
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్'.. మూడు గొడవలు.. నాలుగు ఫైటింగులుగా సాగుతోంది. గత రెండు సీజన్లతో పోల్చుకుంటే ఇందులో కంటెస్టెంట్ల మధ్య సమన్వయం కుదరడం లేదు. దీంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో సీజన్ -3లో ఎన్నో కొత్త కొత్త సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అదే సమయంలో రొమాన్స్, లవ్, ఏడుపులు సహా పలు ఎమోషన్స్ కూడా కనిపిస్తున్నాయి. దీంతో బిగ్ బాస్ షో ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పుడు వీకెండ్ దగ్గరకు రావడంతో ఈ సారి ఎవరు ఎలిమినేట్ అవుతారన్న ఆసక్తి సర్వత్రా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఓ వాదన తెరపైకి వచ్చింది. ఇంతకీ ఏంటా వాదన?

ఈ వారం ఆ ఐదుగురే
ఈ వారం జరిగిన నామినేషన్ ప్రక్రియలో మొత్తం ఆరుగురు నామినేట్ కాగా.. ఒక్కర్ని సేవ్ చేసే అధికారం బాబా భాస్కర్‌కి లభించింది. హౌస్‌కి కెప్టెన్‌గా ఉన్న బాబా భాస్కర్‌కి ప్రత్యేక అధికారం ఇచ్చారు బిగ్ బాస్. నామినేషన్‌లో ఉన్న శిల్ప చక్రవర్తి, పునర్నవి, మహేష్, హిమజ, రవి, శ్రీముఖి ఆరుగురిలో ఒకర్ని సేవ్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించడంతో రవిని సేవ్ చేశారు బాబా భాస్కర్.

ఎవరు వెళ్లిపోతారు?
ఈ మధ్యనే హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన శిల్ప చక్రవర్తితో పాటు మరో నలుగురు కంటెస్టెంట్లు ఎలిమినేషన్ జోన్‌లో ఉండడంతో ఈ సారి ఇంట్లో నుంచి ఎవరు వెళ్లిపోతారు అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈ నేపథ్యంలో ఏ వార్త బయటకు వచ్చినా కొద్దిసేపట్లోనే హాట్ టాపిక్ అయిపోతోంది.

డేంజర్ జోన్‌లో ఉన్నదెవరంటే
ఈ వారం ఎలిమినేషన్ జోన్‌లో ఉన్న వారందరిలో ఇటీవల ఇంటిలోకి వచ్చిన శిల్ప చక్రవర్తికి తక్కువ ఓట్లు పోలవుతున్నాయని తెలుస్తోంది. ప్రైవేటు సంస్థలు నిర్వహించే ఓటింగ్ ప్రక్రియలో ఆమెకు చాలా తక్కువ శాతం ఓట్లు వచ్చాయి. దీంతో స్టార్ మా అధికారిక పోలింగ్‌లో కూడా ఆమెనే అట్టడుగున ఉండే అవకాశాలు ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది.

పునర్నవి వెళ్లిపోయేదే
ఎలిమినేషన్ జోన్‌లో ఉన్న ఐదుగురిలో శిల్ప వెళ్లిపోవడం ఖాయమన్న టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో సరికొత్త వాదన తెరపైకి వచ్చింది. ఒకవేళ శిల్ప ఈ వారం ఎలిమినేషన్ జోన్‌లో లేకుంటే పునర్నవి కచ్చితంగా వెళ్లిపోయేదే అన్న టాక్ వినిపిస్తోంది. దీనికి కారణం ఆమె బిగ్ బాస్ పైనే యుద్ధం ప్రకటించడం అని అంటున్నారు. మరి ఈ వీకెండ్‌లో ఏం జరుగుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











