బిగ్‌బాస్‌లో డబుల్ ఎలిమినేషన్.. ఒకరు పూజా రాంచంద్రన్.. మరోకరు ఎవరంటే!

By Rajababu

Recommended Video

Bigg Boss Season 2 Telugu : Episode 77 Highlights

బిగ్‌బాస్‌ రియాలిటీ షోలో ఆదివారం ప్రసారమైన 76వ రోజు ఎపిసోడ్ సందర్భంగా హోస్ట్ నాని ఇంట్లోకి ప్రవేశించి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించాడు. రాఖీ సందర్భంగా ఇంట్లో వారికి పండుగ వాతావరణాన్ని కల్పించాడు. నాని వచ్చి దీప్తి నల్లమోతుకు సంతోషకరమైన వార్తను అందించాడు. పండుగ సందర్బంగా నాని అందరికీ వారి ఇంటి నుంచి రాఖీలు తెచ్చి ఇచ్చాడు. చివర్లో ఎలిమినేషన్ ప్రక్రియలో పూజాను ఎలిమినేట్ చేయడంతో ఈ వారం ముగిసింది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన రెండో వ్యక్తి ఎవరంటే..

దీప్తి నల్లమోతుకు మళ్లీ కెప్టెన్సీ

దీప్తి నల్లమోతుకు మళ్లీ కెప్టెన్సీ

ఇంటి నిబంధనలు పాటించకపోవడంతో దీప్తి నుంచి కెప్టెన్సీని లాగేసుకొన్న సంగతి తెలిసిందే. నాని చేసిన రిక్వెస్ట్‌కు స్పందించిన బిగ్‌బాస్.. మళ్లీ దీప్తికి కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించాడు. దాంతో ఇంటి సభ్యుల్లో సంతోషం నెలకొన్నది. దీప్తి ఆనందంతో గంతులేసింది.

నానికి రాఖీలు కట్టిన దీప్తి, శ్యామల

నానికి రాఖీలు కట్టిన దీప్తి, శ్యామల

ఇంట్లోకి వెళ్లిన వెంటనే రాఖీలు అందరికీ ఇచ్చాడు. దీప్తి నల్లమోతు, శ్యామల నానికి రాఖీలు కట్టారు. ఇంటి సభ్యులకు వచ్చిన రాఖీలు, లేఖలను చదివి వినిపించారు. దాంతో ఇంటి సభ్యులు పండుగను ఘనంగా జరుపుకొన్నారు.

కేరళ వరదల గురించి నాని

కేరళ వరదల గురించి నాని

కేరళను ముంచేసిన వరదల గురించి నాని వివరించాడు. గతంలో ఎన్నడూ లేనంతగా వరదలు రావడంతో కేరళలో చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయని చెప్పారు. ఇటీవల ఓ టాస్క్‌లో గెలుచుకొన్న రూ.1 లక్షను సామ్రాట్ ఇంటి సభ్యులు కేరళకు సహాయంగా అందించారనే విషయాన్ని నాని చెప్పాడు.

ప్రత్యేకంగా నాని వంటలు

ప్రత్యేకంగా నాని వంటలు

ఇంటి సభ్యుల కోసం నాని తన ఇంటి నుంచి పండుగ సందర్భంగా ప్రత్యేకంగా కొన్ని వంటలను వండించి తీసుకొచ్చారు. స్వయంగా వారికి వడ్డించి వారితో పాటు భోజనం చేశారు. అనంతరం ఇంటి సభ్యుల గురించి ఇంటర్నెట్‌లో వస్తున్న కామెంట్లను టెలివిజన్‌లో వారికి చూపించారు.

రోల్‌ రైడా స్వీట్ హార్ట్

రోల్‌ రైడా స్వీట్ హార్ట్

బిగ్‌బాస్ కంటెస్టెంట్ రోల్ రైడా రూపొందించిన అరుపు ఆల్బమ్‌ విడుదల గురించి వివరించాడు. అరుపు ఆల్బమ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది అని చెప్పాడు. వీడియో షూట్ అద్బుతంగా ఉందని చెప్పాడు. ఇంట్లో స్వీట్ హార్ట్ అని నాని అన్నారు.

తనీష్ ఇంటి నుంచి వెళ్లిపోతే

తనీష్ ఇంటి నుంచి వెళ్లిపోతే

బిగ్‌బాస్‌లో ఇంటి సభ్యుల గురించి బయట ప్రజలు ఏమని అనుకొంటున్నారు? తన అభిప్రాయం ఏమిటో చెప్పారు. ఒక్కొక్కరి గురించి ప్లస్, మైనస్‌లు చెప్పారు. తనీష్ వెళ్లిపోతే నాకు కొంత రిలీఫ్ ఉంటుంది. తానేదో తనీష్‌కు ఫేవర్‌గా ఉంటున్నారని అందరు అనుకొంటున్నారు. ఒకవేళ తనీష్ బయటకు వెళితే నా షోను నేను హ్యాపీగా నడిపించుకొంటాను అని అన్నారు.

కౌశల్ ఆటతీరు భేష్

కౌశల్ ఆటతీరు భేష్

కౌశల్ గురించి మాట్లాడుతూ అతడిపై ప్రశంసల వర్షం కురిపించారు. కౌశల్ ఆటతీరు ప్రతీ వారం అద్భుతంగా ఉంది. ఇంట్లో ఒకే ఒక వ్యక్తి గ్రాఫ్ బాగుందని అనుకొంటే అది కౌశల్‌దే అని అన్నారు. కౌశల్ గేమ్ ప్లాన్ బాగుంది. ఆటడంలో కూడా క్లారిటీ ఉందని చెప్పాడు.

పూజా రామచంద్రన్ ఎలిమినేషన్

పూజా రామచంద్రన్ ఎలిమినేషన్

చివర్లో ఇంటి నుంచి బయటకు వెళ్లే ప్రక్రియ ఎలిమినేషన్‌ను ప్రారంభించారు. తొలుత కౌశల్‌ను ప్రొటెక్టెడ్ జోన్‌లోకి, ఆ తర్వాత కౌశల్ ‌ను ప్రొటెక్టెడ్ జోన్‌లోకి పంపించాడు. అనంతరం పూజా ప్యాక్ యువర్ బ్యాగ్ అంటూ నాని అనడంతో ఆమె ఎలిమినేషన్ ఖారరైంది. ప్రొటెక్టెడ్ జోన్‌లోకి వెళ్లిన దీప్తిని అభినందించాడు.

డబుల్ ఎలిమినేషన్.. గీతాపై బాంబు

డబుల్ ఎలిమినేషన్.. గీతాపై బాంబు

ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు ఇంట్లో పూజా లైఫ్ జర్నీని చూపించాడు. అనంతరం బిగ్‌బాస్ గేమ్‌ను ఆడారు. బిగ్‌బాంబును గీతా మాధురిపై విసిరాడు. ఈ సారి బిగ్‌బాస్ నుంచి డబుల్ ఎలిమినేషన్ అంటూ నాని షాకిచ్చాడు. ఒకరు పూజా రాంచంద్రన్ కాగా, మరోకరు నేను అంటూ చమత్కరించాడు. అలా బిగ్‌బాస్ హౌస్ నుంచి ఈ వారం పూజా, నాని ఎలిమినేట్ అయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X