Bigg Boss: దమ్ము శ్రీజపై జడ్జి ఆగ్రహం.. షర్ట్ విసిరికొడుతూ ఆ షో నుంచి వాకౌట్‌

రియాలిటీ షోలలో జరిగే పరిణామాలు ఊహాకు అందని విధంగా ఉంటాయి. యాంకర్లు, కంటెస్టెంట్స్, జడ్జిల చేతలు, మాటలతో చూసే జనాలకు పిచ్చెక్కిపోతుంది. ఇది నిజమా? లేక స్క్రిప్ట్‌లో భాగమా? అనేది మాత్రం సస్పెన్స్. తోటి కంటెస్టెంట్స్‌తో గొడవలు.. మార్కులు సరిగా ఇవ్వలేదని న్యాయ నిర్ణేతల్ని ఇబ్బంది పెట్టడం ఇలాంటి పనులతో రియాలిటీ షోలు రచ్చ చేస్తున్నాయి. అయినప్పటికీ ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. తాజాగా బిగ్‌బాస్ నటిపై జడ్జి ఒకరు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

స్టార్ మాలో ప్రసారమయ్యే ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతోంది. స్టార్ యాంకర్ శ్రీముఖి దీనికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. వారం వారం బుల్లితెర సెలబ్రిటీలతో గేమ్స్ ఆడిస్తూ, వాళ్లని నవ్విస్తూ వినోదాన్ని రాబడుతోంది శ్రీముఖి. ప్రతివారం ఏదో ఒక థీమ్‌తో సరదాలు పంచుతోంది ఆదివారం విత్ స్టార్ మా పరివారం. తాజాగా ఈ వారానికి సంబంధించి వరుస ప్రోమోలు వదలుతోంది స్టార్ మా.

Bigg Boss Emmanuel Gets Angry on Dammu Srija at Aadivaram With Star Maa Parivaaram show

ఈ వారం బిగ్‌బాస్ తెలుగు 9 కంటెస్టెంట్స్‌ అంతా గెస్టులుగా వచ్చారు. వారితో బీబీ కామనర్స్ vs బీబీ సెలబ్రిటీస్ అనే థీమ్‌తో గేమ్స్ ఆడించింది శ్రీముఖి. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో యాంకర్ శ్రీముఖి, అవినాష్, ఇమ్మాన్యుయేల్‌లు స్టేజ్ మీదకి రెడ్ కార్పెట్ తీసుకుని వస్తారు. బిగ్‌బాస్ సీజన్ 10లో మీ టాలెంట్‌ని పరీక్షించడానికి ఇక్కడికి ముగ్గురు వండర్‌ఫుల్ జడ్జిలు రాబోతున్నారని ఎక్స్‌ప్రెస్ హరి చెబుతాడు. వెంటనే ఇమ్మాన్యుయేల్, శ్రీముఖి, అవినాష్‌లు రెడ్ కార్పెట్‌పై ఎంట్రీ ఇస్తారు. వివాహాది శుభకార్యములకు, పెళ్లి కొడుకు, పెళ్లికూతురు ఈవెంట్స్‌కు రెడ్ కార్పెట్ సప్లయ్ చేయబడును అని అవినాష్, ఇమ్మాన్యుయేల్ చెప్పడంతో అంతా నవ్వేస్తారు.

ఆ వెంటనే రీతూ చౌదరి కోసం డిమోన్ పవన్ డ్యాన్స్ చేస్తాడు. ఈ పర్ఫార్మెన్స్ ఎలా ఉందని ఎక్స్‌ప్రెస్ హరి అడగ్గా.. నాకు ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ ఎక్స్‌లెంట్‌గా నచ్చింది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎనర్జీ ఇంత కూడా డ్రాప్ అవ్వలేదు ఆ అమ్మాయిది అని ఇమ్మాన్యుయేల్ చెబుతాడు. దాంతో ఆమె అసలు ఏం చేసిందిరా? నిల్చోనే ఉంది కదా అని శ్రీముఖి సెటైర్లు వేస్తుంది. ఆ వెంటనే దమ్ముశ్రీజ, ప్రియాశెట్టి, రమ్య మోక్షలు స్టేజ్ మీదకు వస్తారు. అయితే దమ్ము శ్రీజ కళ్లజోడు పెట్టుకుని ఫోజులు కొట్టడంతో ఇమ్మాన్యుయేల్ సీరియస్ అవుతాడు. వెంటనే టీ షర్ట్ విసిరి నేలకేసి కొట్టి.. జడ్జిలం మనమే కళ్లజోడు పెట్టలేదు.. అది పెట్టింది అంటూ శ్రీముఖికి కంప్లయంట్ చేస్తాడు.

ఆ తర్వాత హరితో కలిసి మోక్ష, ప్రియ, దమ్ముశ్రీజలు డ్యాన్స్ చేస్తారు. నా మీద ఈగలు వాలినయి తప్ప అమ్మాయిలు వాల్లేదని హరి అంటాడు. ఇప్పుడు వాలింది కూడా ఈగలేనంటూ ఇమ్మాన్యుయేల్ పంచ్ విసురుతాడు. తర్వాత గౌరవ్ గుప్తా, కళ్యాణ్‌ పడాలను స్టేజ్ మీదకి పిలిచి వీరిద్దరిలో ముందు ఎవరి టాలెంట్ పరీక్షించాలని అనుకుంటున్నారని అడుగుతాడు హరి. ముందు నాకు ఛాయ్ చెప్పండి, చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నామని ఇమ్మాన్యుయేల్ అనడంతో అంతా నవ్వేస్తారు. కళ్యాణ్ ఏం చేస్తాడని శ్రీముఖి అడగ్గా.. ఆయన కెమెరాకు ఫోజులిస్తాడని రీతూ చౌదరి అంటుంది. మా యాంకర్ ఒకసారి చేసి చూపిస్తాడు.. ఆ ఫోజు చేయాలని శ్రీముఖి చెబుతుంది. దాంతో హరి కోతిలా ఫోజులు పెడతాడు. దాంతో అంతా షాక్ అవుతారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతోంది. మరి జడ్జిలు పెట్టిన పరీక్షలో ఎవరు గెలిచారు? ఎలాంటి వినోదం పండించారు? అనేది తెలియాలంటే ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమయ్యే ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో చూడాల్సిందే.

More from Filmibeat

Read more about: bigg boss emmanuel sreemukhi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X