నా ప్రేమను కించపరిస్తే తట్టుకోలేను.. బిగ్‌బాస్ లవ్‌బర్డ్‌పై ఇమ్మూ ఫైర్..
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని కమెడియన్.. 'జబర్దస్త్' ఫేమ్ ఇమ్మాన్యుయేల్. తన కామెడీ టైమింగ్ తో బిగ్ బాస్ తెలుగు 9 సీజన్‌లోనూ తనదైన ముద్ర వేశారు. ఫిజికల్ టాస్కుల్లో సత్తా చాటాడు. తన ఆట, మాట తీరుతో ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేశాడు. ఒకానొకదశలో ఇమ్మూనే బిగ్ బాస్ విన్నర్ అనుకున్నారు. కానీ చివరకు టాప్ 4 లో నిలిచారు. హౌస్ నుంచి బయటకు వచ్చిన ఇమ్మాన్యుయేల్ ఇప్పుడు మళ్లీ టీవీ షోలు, సినిమాలతో బిజీ అవుతున్నారు. తాజాగా ఓ స్పెషల్ షోలో ఇమ్మాన్యుయేల్ చేసిన కామెంట్స్ నెట్టింట్లో తెగ వైరలవుతున్నాయి.ఇంతకీ ఏం జరిగిందంటే?
ఇటీవల ఆదివారం విత్ స్టార్ మా పరివారం ప్రోగ్రామ్ లో వాలెంటైన్స్ డే సందర్భంగా స్పెషల్ ఎపిసోడ్ నిర్వహించారు. ఈ స్పెషల్ ఎపిసోడ్ షోకు యాంకర్‌గా శ్రీ ముఖి వ్యవహరించగా, కో-యాంకర్లుగా ముక్కు అవినాష్, హరి కనిపించారు. ఈ కార్యక్రమానికి పలువురు బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్లు హాజరయ్యారు. షోలో భాగంగా ముందుగా బిగ్‌బాస్ సీజన్ 9 లో లవ్‌బర్డ్స్‌గా పేరు తెచ్చుకున్న రీతు చౌదరి- డిమాన్ పవన్ జంట ప్రత్యేక టాస్క్‌లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రీతు తన ప్రేమను పవన్‌కు ఎక్స్‌ప్రెస్ చేస్తూ, 'నా ప్లెయిన్ లైఫ్‌ని కలర్‌ఫుల్‌గా మార్చేశావు'అంటూ భావోద్వేగంగా మాట్లాడింది. స్పెషల్ టీషర్ట్స్ గిఫ్ట్ చేయడం, ఇద్దరి డాన్స్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలాగే మరో సెగ్మెంట్‌లో జబర్థస్త్ కామెడియన్ రోహిణి, గుప్పెడంతా మనసు సీరియల్ హీరో ముకేశ్ గౌడకు లవ్ ప్రపోజ్ చేయడం కూడా హైలైట్‌గా నిలిచింది.
ఇక అసలు ట్విస్ట్ వచ్చిందే ఇమ్మాన్యుయేల్ స్కిట్ సమయంలో. వాలెంటైన్స్ డే స్పెషల్ స్కిట్‌లో భాగంగా ఇమ్ము, బిగ్‌బాస్ కంటెస్టెంట్, డ్యాన్సర్ నైనికతో కలిసి స్టేజ్‌పై ప్రపోజల్ సీన్ చేశారు. నైనిక డాన్సర్ కావడంతో, ఆమెకు 'నీ మోకాళ్లకు పనికొస్తుంది' అంటూ ఓ హ్యాండ్ బ్యాండేజ్ చూపిస్తూ వెరైటీ గిఫ్ట్ ఇవ్వబోయాడు. దీనిపై శ్రీముఖి 'అది నీ క్యాప్ కాదు రా' అంటూ సరదాగా కామెంట్ చేయగా, ఇమ్ము వెంటనే కవర్ చేస్తూ 'ఓ... ఇది హ్యాండ్ కప్ కదా' అంటూ నవ్వించాడు.
ఈ సమయంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ విష్ణు ప్రియ జోక్యం చేసుకుని, 'ఇది కామెడీ కదా' అని అనడంతో ఇమ్మాన్యుయేల్ ఒక్కసారిగా సీరియస్ అయ్యాడు. 'నేను చేసే ప్రపోజల్‌ని కామెడీ అంటారా?' అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, శ్రీముఖి చేతిలో ఉన్న గిఫ్ట్ బాక్స్‌ను నేలకేసి కొట్టేశాడు. ఈ హఠాత్ పరిణామంతో అక్కడున్నవాళ్లంతా షాక్ అయ్యారు. దీనిపై విష్ణుప్రియ లవర్ పృథ్వి శెట్టి కూడా రియాక్ట్ అవుతూ 'ఏం మాట్లాడుతున్నావ్?' అంటూ వార్నింగ్ ఇచ్చాడు. కానీ ఇమ్ము అక్కడితో ఆగకుండా, 'నా ప్రేమను ఎవరు కించపరిచినా నేను తట్టుకోలేను' అంటూ ఎమోషనల్ ఫేస్ పెట్టాడు.
అప్పుడే ఉన్న కో యాంకర్ హరి ఎంట్రీ ఇచ్చి, 'నీ ప్రేమను ఎవడూ కించపరచలేదు... నువ్వే కింద పడేశావ్' అంటూ పంచ్ వేయడంతో స్టేజ్ మొత్తం నవ్వులతో మార్మోగింది. ఇలా బిగ్ బాస్ లవ్ బర్డ్స్ విష్ణుప్రియ, పృథ్వి శెట్టి పై ఇమ్మూ చేసిన కామెంట్స్ తెగవైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
కొందరు ఇమ్మాన్యుయేల్ యాక్టింగ్‌ను మెచ్చుకుంటుంటే, మరికొందరు 'ఇది స్కిట్‌లో భాగమే' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బిగ్‌బాస్ తర్వాత కూడా తన యూనిక్ కామెడీ స్టైల్‌తో ఇమ్మాన్యుయేల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుండగా, ఇలాంటి వైరల్ మూమెంట్స్ అతని క్రేజ్‌ను మరింత పెంచుతున్నాయి. ఇక రాబోయే రోజుల్లో అతను ఎలాంటి ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రాబోతాడో చూడాలి.


Click it and Unblock the Notifications











