దమ్ముంటే ఇప్పుడు రారా.. మెహబూబ్ పై అఖిల్ ఆగ్రహం.. కెప్టెన్సీ పోటీలో ఆ ఇద్దరు

బిగ్ బాస్ 46వ ఎపిసోడ్ లో కొంటె రాక్షసులు ముగ్గురు కూడా మంచి మనుషులకు నిజంగానే చుక్కలు చూపించారు. గడిచిన ఎపిసోడ్స్ కంటే కూడా ఈ ఎపిసోడ్స్ లో కొట్లాటలు బాగానే జరిగాయి. ఇక టాస్క్ లలో మెహబూబ్ మంచి మనుషులకు చాలా ఆవేశాన్ని తెప్పించాడు. ఇక చివరికి ఈ ఎపిసోడ్ లో అందరూ మంచి మనుషులుగా మారగా చివరికి కెప్టెన్ అవ్వడానికి అరియానా, అవినాష్ అర్హత సాధించారు.

చుక్కలు చూపించిన రాక్షసులు

చుక్కలు చూపించిన రాక్షసులు

మంచి మనుషులు కొంటె రాక్షసులు టాస్క్ లో భాగంగా రక్షసులుగా మిగిలిన ముగ్గురిని కూడా ( అవినాష్, మెహబూబ్, అరియానా) మంచి మనుషులుగా మార్చేశారు. అయితే అంతకంటే ముందే రాక్షసులు వారికి చుక్కలు చూపించారు. ఇంట్లో ఉన్న బట్టలు షూస్ కూడా బయటకు పడేశారు. ఎక్కడ తగ్గలేదు. ముఖ్యంగా అరియానా అఖిల్ షూస్ ని చిందర వందరగా పడేసింది.

మొదటి టాస్క్ లో రాక్షసుల విజయం

మొదటి టాస్క్ లో రాక్షసుల విజయం

ఈ రోజు ఎపిసోడ్ లో మొదట బిగ్ బాస్ ఒక వినూత్నమైన టాస్క్ ఇవ్వగా మంచి మనుషులు వారి పొరపాటు కారణంగా టాస్క్ లో సక్సెస్ కాలేకపోయారు. సర్కిల్ లో మంచి మనుషులు సంచులను లను బయటకు విసిరేయ్యాల్సి ఉంటుంది. అయితే వాటిని కొంటె రాక్షసులు లోపలకి పడేస్తూ ఉండాలి. ఈ టాస్క్ లో మూడు బ్యాగ్ లను స్వమ్మింగ్ ఫూల్ లో పడేసిన మంచి మనుషులు చివరలో ఒకదాన్ని బయటకు విసరగా రాక్షసులు దాన్ని బయటే ఉంచుకొని లోపల వేయడానికి వెయిట్ చేస్తున్నారు. ఈ సమయంలో సోహైల్, మెహబూబ్ నుంచి లాక్కోవడంతో అప్పటికే బజర్ మోగింది. దీంతో మంచి మనుషులు ఓడిపోయారు.

మనం ముగ్గురం ఒక టీమ్.. సోహైల్ ప్లాన్

మనం ముగ్గురం ఒక టీమ్.. సోహైల్ ప్లాన్

లాస్య, హారిక, సోహైల్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని మనం ముగ్గురం ఒక టీమ్ గా ఆడుదామని సోహైల్ ఇచ్చిన ఐడియాకు నవ్వేశారు. ఎందుకంటే మిగతా వారంతా సీక్రెట్ గా ప్లాన్ వేసుకొని మరి ఒకటిగా ఆడుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఇక అమ్మా రాజశేఖర్ తో అరియానా మరోసారి తన మాటలతో భయానికి గురి చేసింది. కింద మిరపకాయలు పెడతాను అంటూ బెదిరించింది.

దమ్ముంటే ఇప్పుడు రారా.. అఖిల్ ఫైర్

దమ్ముంటే ఇప్పుడు రారా.. అఖిల్ ఫైర్

కుండలతో డ్రమ్ములు నింపాలని మంచి మనుషులకు ఒక టాస్క్ ఇచ్చిన బిగ్ బాస్ ఆ డ్రమ్ములను నింపకుండా చేయాలని రాక్షసులకు చెప్పారు. అయితే ఈ టాస్క్ లో మెహబూబ్ ఫిజికల్ గా ఒక్కొక్కరిపైకి వెళుతూ నెట్టి వేశాడు. డ్రమ్ములను నెత్తివేస్తూ కుండలను కూడా పగలకొట్టాడు. ఈ క్రమంలో అఖిల్, మెహబూబ్ మధ్యలో మాటకు మాట పెరిగింది. దమ్ముంటే రారా అంటూ అఖిల్ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు.

విజయం సాధించిన మంచి మనుషులు

విజయం సాధించిన మంచి మనుషులు

ఇక చివరికి నీళ్లు నింపాలనే టాస్క్ లో మంచి మనుషులు విజయం సాధించగా అవినాష్ ని మంచి మనిషిగా మార్చాలని సెలెక్ట్ చేసుకొని రాక్షసుని తలను పగలకొట్టారు. ఇక చివరికి మెహబూబ్, అరియానా మాత్రమే మిగలగా మరో టాస్క్ ఇచ్చిన బిగ్ బాస్ వారిని ఎత్తుకోవలని చెప్పడంతో అరియానాను టార్గెట్ చేసి మంచి మనుషులు విజయం సాధించారు. ఇక అందరు మంచివారిగా మారిపోయారు.

కెప్టెన్ గా పోటీలో.. అవినాష్, అరియానా

కెప్టెన్ గా పోటీలో.. అవినాష్, అరియానా

ఇక ఫైనల్ గా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ని మెచ్చుకొని టీమ్ సభ్యులలో బెస్ట్ కంటెస్టెంట్స్, వరస్ట్ కంటెస్టెంట్స్ ని మీరే ఎంచుకోవాలని చెప్పగా ఎవరు చెప్పలేదు. ఇక ఫైనల్ గా బిగ్ బాస్ కోరిక మేరకు కెప్టెన్ గా ఉన్న నోయల్ చుక్కలు చూపించిన అవినాష్, అరియానా బెస్ట్ కంటెస్టెంట్స్ అని చెప్పాడు. ఇక బిగ్ బాస్ వారిద్దరిని కూడా కెప్టెన్ స్థానానికి పోటీలో ఉంచారు. ఇక వారిద్దరిలో కెప్టెన్ గా అవినాష్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X