Bigg Boss Episode 64 Highlights: గద్దలకొండ గణేష్ ప్రకటన.. కన్నీరు పెట్టుకున్న హిమజ
Recommended Video
బుల్లితెర రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 3' రసవత్తరంగా రన్ అవుతోంది. నాగార్జున హోస్ట్‌గా కొనసాగుతున్న ఈ షోలో ఆయన ఇస్తున్న టాస్క్‌లు స్పెషల్ కిక్ ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో తొమ్మిదో వారం ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా నామినేషన్స్ కోసం ఒకరికోసం ఒకరు చేసిన త్యాగాలు అబ్బో అనిపించాయి. అయితే చివరకు ఈ వారం నేరుగా హిమజ ఎలిమినేట్ అయింది. పూర్తి వివరాలు చూస్తే..

క్రేజీ టాస్క్‌లతో షో మరింత ఆసక్తికరం
బిగ్ బాస్ ఇస్తున్న క్రేజీ టాస్క్‌లతో షో మరింత ఆసక్తికరంగా మారుతోంది. రోజు రోజుకూ సరికొత్తగా ట్రెండ్‌ని క్యాచ్ చేస్తూ టాస్క్‌లు ఇస్తున్నారు బిగ్ బాస్. ఇక వీటిపై కంటిస్టెంట్స్ చేస్తున్న పర్‌ఫార్‌మెన్స్ బుల్లితెర ఆడియన్స్‌కి వినోదాల విందు ఇస్తోంది. దీంతో ఈ మరింత ఆసక్తికరంగా మారింది.

ఎలిమినేషన్ లిస్టులో ఆ ముగ్గురూ.. చివరకు
ఇదిలా ఉంటే తొమ్మిదో వారం ఎలిమినేషన్ లిస్టులో ముగ్గురి పేర్లు ఉన్నాయి. మహేష్, రాహుల్, హిమజ ముగ్గురూ నామినేట్ కాగా.. ఆ ముగ్గురిలో హిమజ ఎలిమినేట్ అయింది. ఇక మరో వ్యక్తి రాహుల్‌ని సీక్రెట్ రూమ్‌లో పెట్టేశారు.

ఆదివారం ఎపిసోడ్ మరింత రసవత్తరం
గత ఎపిసోడ్స్ తో పోల్చితే ఆదివారం జరిగిన ఈ 64వ ఎపిసోడ్ మరింత రసవత్తరంగా మారింది. బిగ్‌బాస్ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడంలో భాగంగా ఫన్ టాస్క్ అంటూ హౌస్‌మేట్స్‌తో డ్యాన్సులు చేయించాడు బిగ్ బాస్. ఇక ఈ ఎపిసోడ్ లో గద్దలకొండ గణేష్ (వరుణ్ తేజ్) ఎంట్రీ ఇవ్వడం మరింత ఆసక్తి రేకెత్తించింది.

గద్దలకొండ గణేష్ ప్రకటన
అయితే బిగ్ బాస్ కంటిస్టెంట్స్ హిమజ, మహేష్ విట్టాలలో హిమజ ఎలిమినేట్ అయినట్టుగా గద్దలకొండ గణేష్ ప్రకటించారు. తన సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వరుణ్ తేజ్ ఆదివారం రోజు బిగ్ బాస్ ఎపిసోడ్‌కి గెస్ట్‌గా వచ్చారు. దీంతో హిమజ ఎలిమినేషన్ అయినట్టుగా ఆయనే ప్రకటించారు.

కన్నీరు పెట్టుకున్న హిమజ
దీంతో బిగ్ బాస్ నుంచి బయటకొచ్చిన హిమజ బిగ్‌బాస్ హౌస్‌లో తాను చేసిన జర్నీ వీడియో చూసి కాస్త ఎమోషనల్‌గా ఫీల్ అయింది. బయట తాను ఎవ్వరితోనూ అంత ఈజీగా కలవలేనని, బిగ్ బాస్ హౌస్‌లో కూడా తాను అలాగే ఉండే సరికి తనకెవ్వరూ పెద్దగా సపోర్ట్ చేయలేదంటూ కన్నీరు పెట్టుకుంది హిమజ.

అది వన్ టైమ్ డ్రీమ్
ఇక ఎలిమినేషన్ తర్వాత మళ్లీ బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లే అవకాశం ఇస్తే వెళ్తావా? అని నాగార్జున అందరినీ అడిగినట్టే హిమజనూ అడిగారు. దీంతో ఆమె.. నేను వెళ్లును సార్. ఒకసారి ఎలిమినేట్ అయిన తరువాత మళ్లీ వెళ్లడం అనేది ఫెయిర్ కాదు. అది వన్ టైమ్ డ్రీమ్ మాత్రమే అని చెప్పింది హిమజ.


Click it and Unblock the Notifications











