Bigg Boss Episode 67 Highlights: బిగ్ బాస్ పార్టిసిపెంట్స్ మధ్య గొడవ.. ఇంతలో సర్దేసిన శ్రీముఖి!

Recommended Video

Bigg Boss Telugu Season 3 : Episode 67 Highlights

బుల్లితెర రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 3' రసవత్తరంగా సాగుతోంది. నాగార్జున హోస్ట్‌గా కొనసాగుతున్న ఈ షోలో ఆయన ఇస్తున్న టాస్క్‌లు స్పెషల్ కిక్ ఇస్తున్నాయి. విజయవంతంగా పదో వారంలోకి ఎంటరైనా కూడా బిగ్ బాస్ పార్టిసిపెంట్స్ మధ్య గొడవలు, దూషించుకోవడాలు మాత్రం సద్దుమనగడం లేదు. తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో రాహుల్, వరుణ్ మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాట చూస్తూ మిగిలిన బిగ్ బాస్ పార్టిసిపెంట్స్ ఏం చేశారు? అసలెందుకీ తోపులాట? వివరాల్లోకి పోతే..

అత్తరాజ్యంలో కోడళ్ల కష్టాలు

అత్తరాజ్యంలో కోడళ్ల కష్టాలు

ఈ వారం 'అత్తరాజ్యంలో కోడళ్ల కష్టాలు' అనే పేరుతో జరుగుతున్న కెప్టెన్సీ టాస్క్ యమ రంజుగా ఉంది. ఇందులో భాగంగా అత్తగా శివజ్యోతి ఉండగా.. వరుణ్, రాహుల్, రవిక్రిష్ణలు ఆమె కొడుకులుగా.. వితికా, పునర్నవి, శ్రీముఖి కోడల్లుగా ఉన్నారు. బాబా భాస్కర్, మహేష్ విట్టా శివజ్యోతికి అసిస్టెంట్ గా ఉన్నారు.

అక్కడే మొదలైంది అసలు కథ

అక్కడే మొదలైంది అసలు కథ

అన్నదమ్ములంతా కలిసి మెలిసి ఉండాలి అనే ఉద్దేశంతో తన కొడుకులకు ఓ టాస్క్ ఇచ్చింది శివజ్యోతి. మీలో ఉన్న యూనిటీ నిరూపించుకోవాలంటే.. ఒక గోడ కట్టండని, ఇదిగో మీకు కొన్ని ఇటుకలు ఇస్తున్నా. వాటితో మీరు గోడ కట్టండి. ఎక్కువ ఇటుకలతో ఎవరు ముందుగా గోడ కడతారో వాళ్ళే విజేత. వాళ్ళకే నా ఆస్థి ఇస్తా అని శివజ్యోతి చెప్పడంతో అసలు కథ మొదలైంది. టాస్క్ మరింత రంజుగా సాగింది.

 ఇటుకలను పట్టుకెళ్ళే క్రమంలో తోపులాట

ఇటుకలను పట్టుకెళ్ళే క్రమంలో తోపులాట

ఈ క్రమంలో టాస్క్‌లో లీనమయ్యారు ముగ్గురు కొడుకులు. అయితే ఈ టాస్క్‌లో భాగంగా ఎక్కువ ఇటుకలను పట్టుకెళ్ళడం కోసం తోపులాట జరిగింది. వరుణ్ ఇటుకలు పట్టుకెళ్తుండగా.. రాహుల్ అడ్డుపడటంతో ఇద్దరి మధ్య మాటల యుధం నడిచింది. దీంతో ఆ ఇద్దరి మధ్య ఎంటరైన వితిక.. గొడవను కూల్ చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో చివరకు రాహుల్‌ని గిల్లింది వితిక.

సర్దేసిన శ్రీముఖి -రవి

సర్దేసిన శ్రీముఖి -రవి

ఓ పక్క వరుణ్, రాహుల్, వితిక, పునర్నవిలు మధ్య గొడవ జరుగుతుంటే.. శ్రీముఖి- రవి ఇటుకలు పట్టుకెళ్తు తమ పని తాము చేసుకున్నారు. గోడ కట్టేసి రియల్ గేమ్ ఆడారు. రాహుల్, వరుణ్‌ భలే కొట్టుకుంటున్నారే అన్నట్లుగా చూస్తూ చీరలో ఇటుకలు సర్దేసింది శ్రీముఖి. ఇక నేటి నుండి అసలు గేమ్ స్టార్ట్ అయ్యిందని రాహుల్ శపథం చేశాడు. ఆడవాళ్లను ముందు పెట్టి గేమ్ ఆడటం మగతనం కాదు అని వార్ మొదలు పెట్టాడు. చూడాలి మరి ఈ టాస్క్ ఫినిష్ అయ్యే సరికి ఎవరు విజేతలవుతారో!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X