అలీ దగ్గర అదో రకమైన వాసన.. ఒంటరిగా రాహుల్, పునర్నవి.. నెరవేరిన శ్రీముఖి కల
Recommended Video
బుల్లితెర రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 3' రసవత్తరంగా సాగుతోంది. నాగార్జున హోస్ట్‌గా కొనసాగుతున్న ఈ షో బుల్లితెర ప్రేక్షకులకు స్పెషల్ కిక్ ఇస్తోంది. విజయవంతంగా పదో వారంలోకి ఎంటరైన బిగ్ బాస్ పార్టిసిపెంట్స్ హౌస్ లో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఎపిసోడ్ 69లో కొన్ని ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఆ వివరాలు మీ కోసం..

సల్మాన్ ఖాన్ బిల్డప్.. గ్రాండ్ ఎంట్రీ
అందరూ ఊహించినట్టుగానే 69వ ఎపిసోడ్‌లో అలీ రజా హౌస్ లోకి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చాడు. సల్మాన్ ఖాన్ రేంజ్ బిల్డప్ ఇస్తూ రష్యన్ భామలతో చిందులేస్తూ వచ్చేశాడు. బిగ్ బాస్ హౌస్‌లోకి అలీ రజా రీ ఎంట్రీ ఇవ్వడం వల్ల తమ ఎనర్జీ డబుల్ అయ్యిందని శివజ్యోతి, రవిలు తెగ సంబర పడ్డారు.

అలీ దగ్గర అదో రకమైన వాసన
మాస్క్ తో అలీ బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చాడు. అతని ముఖం కనిపించక పోవడంతో అలీ కాదేమో అనుకున్నానని శివజ్యోతి చెప్పింది. అయితే వితిక మాత్రం తాను అలీని గుర్తుపట్టానని చెప్పింది. ఒక్కొక్కరి దగ్గర ఒక్కో వాసన వస్తుంటుంది. అలీ దగ్గర కూడా అదో రకమైన వాసన వస్తుంది. ఈ వాసనను బట్టే అతను అలీ అని గుర్తు పట్టేశానని చెప్పింది వితిక.

ఒంటరిగా రాహుల్, పునర్నవి.. అలీ సీక్రెట్
ఇక ఒంటరిగా రాహుల్, పునర్నవి ముచ్చటలాడుకోవడం, హౌస్ నుండి బయటకు వచ్చిన అలీ రజా.. తిరిగి హౌస్ లోకి ఎంటరై బయట టాక్ ఎలా ఉందో శివజ్యోతి, రవిలకు వివరించడం తాలూకు సీన్స్ హైలైట్ అయ్యాయి. పునర్నవి, వితికా, వరుణ్, రాహుల్ ఈ నాలుగురిదే ఆట అని బయట చెప్పుకుంటున్నారని అలీ చెప్పాడు.

కలర్‌ఫుల్ కెప్టెన్ టాస్క్
ఇక ఈ వారం బిగ్ బాస్ కలర్‌ఫుల్ కెప్టెన్ అనే టాస్క్ ఇవ్వడం.. దాని కోసం పార్టిసిపెంట్స్ పాకులాడటం కనిపించాయి. ఈ టాస్క్‌లో శ్రీముఖి, బాబా భాస్కర్, రవి, శివజ్యోతిలు కెప్టెన్ కోసం పోటీ పడ్డారు. అయితే ఈ వారం రవి ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉండటంతో అతనికి కెప్టెన్ అయ్యే అవకాశం ఇద్దాం అని అలీ, వరుణ్‌లు అతనికి సపోర్ట్ చేశారు.

నెరవేరిన శ్రీముఖి కల
దీంతో శ్రీముఖి, రవిల మధ్య పోటీ ఆసక్తికరంగా సాగింది. అయితే చివర్లో రాహుల్, వితికా, పునర్నవి, అలీలు సపోర్ట్ చేయడంతో శ్రీముఖి ఈ టాస్క్ విన్నర్ అయి తన కల నెరవేర్చుకుంది. ఇలా శ్రీముఖి పదోవారంలో బిగ్ బాస్ హౌస్‌కి కెప్టెన్ అయింది.


Click it and Unblock the Notifications











