Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ లోకి గీతూ రాయల్ వైల్డ్ కార్డు ఎంట్రీ.. మాజీ కంటెస్టెంట్ అలా లీక్

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ .. బిగ్ బాస్.. ఏ నోటా విన్న.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన బిగ్ బాస్ గురించే చర్చ. నిజంగా గతంలో ఎన్నాడూ చూడని విధంగా సరికొత్త కాన్సెప్టులు, టాస్కులతో ముందుకు సాగుతోంది బిగ్ బాస్ తెలుగు సీజన్ 8. ముందుగా అన్నట్టుగానే బీబీ లవర్స్ కు అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ను అందిస్తుంది. ఎంతో ఇగర్ గా వెయిట్ చేసిన బిగ్ బాస్ చూస్తు చూస్తుండగానే రెండు వారాలు పూర్తి చేసుకోబోతుంది. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ లో ప్రారంభమైన ఈ సీజన్.. ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తూ.. తొలివారం ఎలిమినేషన్ లో బేబక్క బయటకు పంపగా.. (నేడు) రెండవ ఎలిమినేషన్స్ లో ఎవరూ ఊహించని విధంగా శేఖర్ బాషా ఎలిమినేట్ చేసి ఇంటికి పంపించారు. దీంతో హౌస్ లో 12మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. ఈ క్రమంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వైల్డ్ కార్డు ద్వారా ఓ హాట్ అండ్ ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్ ను హౌస్ లోకి పంపునున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ హాట్ బ్యూటీ ఎవరో మీరు కూడా ఓ లూక్కేయండి.

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభానికి ముందు వైల్డ్ కార్డు ఏంట్రీ పై పలు ఇంట్రెస్టింగ్ వార్తలు వైరల్ అయ్యాయి. పలువురు పేర్లు తెరమీదికి వచ్చాయి. అందులో జ్యోతిరాయ్‌ అలియస్ జగతి మేడం పేరు బాగా వినిపించింది. కానీ బ్యూటీ అటు సీరియల్స్.. ఇటు సినిమాల్లో బిజీగా ఉండడంతో తాను హౌస్ లోకి రాలేనని చెప్పారని టాక్. దీంతో ఆమె వైల్డ్ కార్డు ఎంట్రీపై రూమర్స్ కు చెక్ పడింది. అయితే ఈ క్రమంలో ఓ హాట్ బ్యూటీ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్నారని నెట్టింట వార్తలు వస్తున్నాయి.

Bigg boss ex contestant geetu royal wild card entry into the Bigg Boss 8 Telugu house Geetu Royal photos viral

ఆ బ్యూటీ ఎవరో కాదు.. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ గీతూ రాయల్ పేరు. అందులో సోషల్ మీడియా ద్వారా విపరీతంగా ఫాలోయింగ్ సంపాదించుకున్న గీతూ రాయల్ పేరు గట్టిగా వినిపిస్తోంది. సీమ యాసలో మాట్లాడుతూ ఫుల్ క్రేజ్ దక్కించుకున్న ఈ అమ్మడు బిగ్ బాస్ 6వ సీజన్‌‌‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన తన ఆట, మాట తీరుతో బిగ్ బాస్ ప్రేక్షకులకు పుల్ ఎంటర్టైన్ మెంట్ అందించి.. పాజిటీవ్ ఓపినియన్ తెచ్చుకుంది.

నాగార్జున కూడా ఈ అమ్మడు తన ఆట తీరును మెచ్చుకునేవాడు. ఆ తరువాత వారాల్లో గీతూ రాయల్‌ తన మాటలను కంట్రోల్ తప్పడంతో 9వ వారం ఎలిమినేట్ అయింది. ఈ క్రమంలో తనని ఎలిమినేట్ చేయొద్దంటూ నాగార్జునను రిక్వెస్ట్ చేసింది. కానీ బీబీ రూల్స్ బ్రేక్ చేయలేనంటూ.. గీతూను ఇంటికి పంపించేశాడు నాగార్జున. అయితే.. ఎవరూ ఊహించని విధంగా గీతూ రాయల్ బిగ్ బాస్ బజ్ షోకు హోస్ట్‌గా వ్యవహరించింది. తనంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సీజన్ పై రివ్యూలు చేస్తూ..కంటెసెంట్లను ఏకీ పారేస్తుంది.

ఇదెలా ఉంటే.. రీతూ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా 'బిగ్‌బాస్‌పై నా ప్రేమ శాశ్వతమైనది'.. అంటూ రాసుకొచ్చింది. అలాగే పలు ఫోటోలను షేర్ చేసింది. దీంతో ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చుతుంది. ఇలా అమ్మడు హౌస్‌లోకి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇస్తే రచ్చ రచ్చే అంటూ కామెంట్స్ చేస్తున్నారు బీబీ లవర్స్. అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే క్రమంలో బిగ్ బాస్ టీం పెద్ద ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. రీతూతో పాటు ముక్కు అవినాశ్, శోభా శెట్టి, రోహిణీ, హరితేజ, నయని పావని లను వైల్డ్ కార్డ్ తో హౌస్‌లోకి తీసుకరాబోతున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్లాన్ వర్కట్ అయితే.. మాత్రం బీబీ హౌస్ లో పుల్ ఎంటర్టైన్ మెంట్ ఖాయమని బీబీ లవర్స్ భావిస్తున్నారు. మరీ బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఎలాంటి ప్లాన్స్ వేస్తోంది వేచిచూడాలి మరీ. వీరిలో ఎవరు వస్తారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X