బాత్ రూమ్ లో కెమెరాలు.. వాళ్లతో వేధింపులు.. కన్నీళ్లు పెట్టించిన ఫైమా
జబర్దస్త్ కామెడీ షోతో ఫైమా బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ద్వారా హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చి మరింతగా పాపులర్ అయ్యింది. సెలబ్రెటీగా మారిపోయింది. హౌజ్ లో తన ఆడిన టాస్క్ లకు, ఆమె ప్రవర్తనకు ఆడియెన్స్ ఫుల్ ఫిదా అయ్యారు. హౌజ్ నుంచి బయటికి వచ్చాక ఫైమాకు మరింత క్రేజ్ పెరిగింది. ఇక ప్రస్తుతం జబర్దస్త్ తో పాటు మరిన్ని షోల్లోనూ మెరుస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. ఇక తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీలో తన స్కిట్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఈటీవీలో ప్రాసరమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రేక్షకుల్లో మంచి ఆదరణను పొందింది. ఈ షోకు జడ్జీగా టాలీవుడ్ సీనియర్ నటి ఇంద్రజ వ్యవహరిస్తోంది. యాంకర్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ రష్మీ గౌతమ్ వ్యవహరిస్తోంది. అదే విధంగా బుల్లితెర కామెడీ స్టార్ హైపర్ ఆది కూడా ఈషోను మరింత జోష్ గా నడిపిస్తున్నారు. ఇలా ప్రతి ఎపిసోడ్ ను ఎంతో ఇంట్రెస్టింగ్ గా ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ క్రమంలో తాజా ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా మారింది. ఎప్పుడూ సెలబ్రెటీల మధ్య పంచులు, జోక్ లతో నవ్వించే ప్రయత్నం చేశారు. కానీ ఈ సారి మాత్రం స్టూడెంట్స్ కు ప్రత్యేకంగా ఓ స్పెషల్ ఎపిసోడ్ ను రూపొందించారు.

కాగా, మే4న ఈటీవీలో ప్రసారం కాబోతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ఎపిసోడ్ కు సంబంధించిన షూట్ పూర్తైంది. టెలికాస్ట్ కు సిద్ధంగా ఉంచారు. కాగా తాజాగా ఆ ఎపిసోడ్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ ప్రోమోను కొద్దిసేపటి కిందనే విడుదల చేశారు. అయితే ఈ ఎపిసోడ్ విద్యార్థులకు ప్రత్యేకంగా షూట్ చేశారు. ఇందులోకి ఇంటర్ పరీక్షలు పూర్తి చేసుకున్న స్టూడెంట్స్ ను గెస్ట్ లుగా ఆహ్వానించారు. వారితో సరదాగా జోక్ లు వేయిస్తూ, సరదా ముచ్చట్లతో శ్రీదేవి డ్రామా కంపెనీ టీమ్ గడిపింది.
ఈ క్రమంలోనే విద్యార్థులు తమ జీవితంలో ఎలాంటి ఒత్తిడికి గురవుతున్నారు. తమ స్కూల్స్, హాస్టల్స్, కాలేజీల్లో ఏ తరహా వేధింపులను ఎదుర్కొంటున్నారనే విషయాలను ప్రతిబింబించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా జబర్దస్త్ ఆర్టిస్ట్, బిగ్ బాస్ ఫేమ్ ఫైమా విద్యార్థుల సమస్యలకు ఓ ఆసక్తికరమైన స్కిట్ ను చేసింది. కొందరు కుర్రాళ్లతో కలిసి కాలేజీ వాతావరణంలో ఎలాంటి పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయో ఓ భావోద్వేగమైన స్కిట్ లో నటించింది.
ఆ స్కిట్ లో కొందరు కుర్రాళ్లు అమ్మాయిలను ర్యాగింగ్ పేరుతో ఏడిపించడం. బాత్ రూమ్ లో కెమెరాలను పెట్టి ఎలా ఇబ్బందులకు గురి చేస్తున్నారనే విషయాలను కళ్లకు కట్టినట్టుగా చూపించారు. గుండె తరుక్కుపోయే సన్నివేశాలను తమ స్కిట్ లో ప్రదర్శించారు. ఫైమా అద్భుతంగా ఆ విషయాలను ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేసింది. దీంతో శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ఎపిసోడ్ పై మరింత ఆసక్తి నెలకొంది. ఏప్రిల్ 4న ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు ఈటీవీలో ప్రసారం కానుంది.


Click it and Unblock the Notifications











