Bigg Boss Sarayu Arrest: పోలీసుల అదుపులో సరయు.. ఆమెతో పాటు ఆ నటులు కూడా!

సామాజిక మాధ్యమాల వాడకం పెరిగిన తర్వాత ఆంధ్రా, తెలంగాణకు చెందిన చాలా మంది అమ్మాయిలు భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకుని సెలెబ్రిటీలుగా మారిపోయారు. తద్వారా గుర్తింపును అందుకోవడంతో పాటు ఆఫర్లను కూడా దక్కించుకుంటున్నారు. అలాంటి వారిలో ప్రముఖ యూట్యూబర్ సరయు రాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సెవెన్ ఆర్ట్స్ అనే చానెల్ ద్వారా నెటిజన్లకు పరిచయమైన ఈ బ్యూటీ.. చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును అందుకుంది. ఈ క్రమంలోనే ఇటీవలే బిగ్ బాస్ ఆఫర్ కూడా పొందింది. దీంతో కెరీర్ పరంగా ఫుల్ బిజీగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో సరయు రాయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అసలేం జరిగింది. ఆ వివరాలు మీకోసం!

 ఎక్కువగా అలాంటి వీడియోలే

ఎక్కువగా అలాంటి వీడియోలే

తెలుగు బోల్డు బ్యూటీ సరయు రాయ్ యూట్యూబ్‌లో సెవెన్ ఆర్ట్స్ అనే ఛానెల్‌లో పని చేస్తుంది. ఇందులో ఎన్నో సున్నితమైన అంశాలను ప్రస్తావిస్తూ పదుల సంఖ్యలో వీడియోలు చేసింది. అన్నింటిలోనూ అడల్ట్ కంటెంట్ ఉంటుంది. అంతలా ఈ బ్యూటీ పచ్చి బూతులు మాట్లాడుతూ ఉంటుంది. అందుకే ఆమె చేసే వీడియోలకు నెటిజన్ల నుంచి భారీ స్పందన దక్కుతోంది.

 గొడవలు జరిగిన తగ్గడం లేదు

గొడవలు జరిగిన తగ్గడం లేదు

యూట్యూబ్‌లో సరయు టీమ్ చేసే వీడియోలు వివాదాస్పదం అవుతుంటాయి. మరీ ముఖ్యంగా అప్పట్లో సీత అనే పేరుతో చేసిన ఓ వీడియోపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో అప్పట్లో ఇది పెద్ద వివాదంగా మారింది. ఆ తర్వాత అలాంటివే చాలా వీడియోలపై పెద్ద ఎత్తున గొడవలు కూడా జరిగాయి. అయినప్పటికీ ఆమె మాత్రం అస్సలు తగ్గకుండా వీడియోలు చేస్తూనే ఉంది.

బిగ్ బాస్ ఛాన్స్... నిరాశపరిచి

బిగ్ బాస్ ఛాన్స్... నిరాశపరిచి

కొద్ది రోజుల క్రితం ముగిసిన బిగ్ బాస్ ఐదో సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన వారిలో బోల్డు బ్యూటీ సరయు కూడా ఉంది. సెవెన్ ఆర్ట్స్ అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా అడల్ట్ కామెడీతో వీడియోలు రూపొందించే ఈ బ్యూటీ.. బూతులతో రచ్చ రచ్చ చేస్తుంటుంది. అందుకే భారీ అంచనాల నడుమ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చేసింది. కానీ, ఊహించని విధంగా ఫస్ట్ వీకే ఎలిమినేట్ అయింది.

 సరయుపై పోలీసు కేసు ఫైల్

సరయుపై పోలీసు కేసు ఫైల్

సున్నితమైన అంశాలతో వీడియోలు చేసే సరయు రాయ్ కొన్ని రోజుల క్రితం మరో వివాదంలో చిక్కుకుంది. గతేడాది 7ఆర్ట్స్‌ ఫ్యామిలీ రెస్టారెంట్‌ కోసం యూట్యూబ్‌ ఛానల్‌లో ఓ వీడియో రిలీజ్‌ చేసింది. ఇందులో హిందువుల మనోభావాలు దెబ్బతీసే సన్నివేశాలు ఉన్నాయని రాజన్న సిరిసిల్ల జిల్లా విశ్వహిందూ పరిషత్‌ జిల్లా అధ్యక్షుడు అశోక్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

 ఆ వీడియోలో ఏముందంటే

ఆ వీడియోలో ఏముందంటే

ఓ హోటల్ ప్రమోషన్ కోసం తీసుకున్న వీడియోలో సరయు రాయ్‌తో పాటు కొందరు నటులు ‘గణపతిబప్పా మోరియా' అని ఉన్న బ్యాండ్‌ను తలకు ధరించారని.. దీనితో కొన్ని అసభ్యకరమైన సన్నివేశాలు చేయడంతో పాటు బోల్డు డైలాగులను వాడారని అశోక్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో సరయు రాయ్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

పోలీసుల అదుపులో సరయు

విశ్వహిందూ పరిషత్‌ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు అశోక్‌ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిపిన పోలీసులు.. అది హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పరిధిలో చేసిన వీడియోగా గుర్తించారని తెలుస్తోంది. దీంతో అక్కడి పోలీసులు ఆమెను సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారని తెలిసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Recommended Video

Bigg Boss Sarayu Hilarious Interview With Sudarshan | Manchi Rojulochaie
గంట పాటు.. ఆ నటులు కూడా

గంట పాటు.. ఆ నటులు కూడా


సోమవారం రాత్రి బంజారాహిల్స్ పోలీసులు బిగ్ బాస్ సరయుతో పాటు ఆమె వీడియో టీం సభ్యులు శ్రీకాంత్ రెడ్డి, నటులు కార్తిక్‌, కృష్ణమోహన్‌లను అరెస్ట్‌ చేశారు. అంతేకాదు, వీళ్లను సుమారు గంటన్నర పాటు పలు రకాలుగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అనంతరం వాళ్లను పంపేశారని అంటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X