గుర్తుపట్టలేనంతగా మారిపోయిన అషు రెడ్డి .. మోడ్రన్ ముసలమ్మ అంటూ నెటిజన్ల టీజింగ్
సినిమాల్లో నటీనటులు తమ పాత్రల కోసం ట్రాన్స్‌ఫార్మ్ అవుతారు. కథ డిమాండ్ చేసిన మేరకు ఏమైనా చేయడానికి సిద్దంగా ఉంటారు. పాతికేళ్ల వయసులో 70 ఏళ్ల వృద్ధుడిగా నటించడానికి కూడా వెనుకాడరు. సినిమాపై వారికున్న అంకిత భావం అలాంటిది. కానీ ఇది అనుకున్నంత తేలిక కాదు. తాజాగా బిగ్‌బాస్ బ్యూటీ , సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ అషు రెడ్డి పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..
సోషల్ మీడియా రాకతో ఎంతో మంది ప్రతిభావంతుల గురించి ప్రపంచానికి తెలిసింది. వీరిలో అషు రెడ్డి కూడా ఒకరు. లుక్స్, పర్సనాలిటీ, ఫిగర్ పరంగా అచ్చుగుద్దినట్లు స్టార్ హీరోయిన్ సమంతలా కనిపించే అషు రెడ్డి డబ్‌స్మాష్ వీడియోలతో యువతలో క్రేజ్ సంపాదించుకున్నారు. దీంతో ఆమెను అంతా జూనియర్ సమంత అని ముద్దుగా పిలుచుకునేవారు. ఈ ఫేమ్‌తో చాలా కాలం పాటు బుల్లితెరపై పలు రకాల షోలతో పాటు కొన్ని సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంది.

సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటో షూట్లతో దుమ్మురేపిన అషు రెడ్డి.. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మతో ఇంటర్వ్యూ చేసి సెన్సేషన్‌గా మారిపోయింది. స్వయంగా వర్మ నేలపై కూర్చొని అషురెడ్డి పాదాలకు ముద్దుపెట్టిన ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3లోనూ అవకాశం దక్కించుకుంది. తన హాట్ హాట్ డ్యాన్స్‌లు, అందాల ప్రదర్శనతో బిగ్‌బాస్ హౌస్‌కి గ్లామర్ డోస్ అద్దింది. టైటిల్ రేసులో వెనుకబడిన అషురెడ్డి.. ఐదు వారాల పాటు కొనసాగి ఎలిమినేట్ అయ్యింది. అనంతరం తెలుగులో తొలిసారిగా ప్రారంభమైన బిగ్‌బాస్ ఓటీటీలోనూ ఛాన్స్ దక్కించుకుని ఏకంగా పది వారాల పాటు కొనసాగింది.
తన అంద చందాలు, చలాకీతనంతో అషు రెడ్డి సినీ ప్రముఖుల దృష్టిలోనూ పడ్డారు అషురెడ్డి. తొలుత 'ఛల్ మోహనరంగ' అనే సినిమాతో నటిగా టాలీవుడ్‌లో ఎంటరైంది. కానీ, తర్వాత ఎందుకో గ్యాప్ తీసుకుంది. ఇటీవలే అషు రెడ్డి 'ఏవమ్' సహా పలు సినిమాల్లో నటించి మెప్పించింది. మహిళా హక్కులు , సమాజంలో ఆడవాళ్లు ఎదుర్కొంటున్న ఇబ్బందుల చుట్టూ తిరిగే ఈ సినిమాలో అషు అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నారు.
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ బోల్డు బ్యూటీ హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ కుర్రాళ్లకు గిలిగింతలు పెడుతున్నారు. మొన్నామధ్య లోపల ఏమీ వేసుకోకుండా క్లీవేజ్ షో చేసి కుర్రకారును రెచ్చగొట్టింది అషు రెడ్డి. ఎవరు ఏమనుకున్నా సరే, ఎలాంటి అంశంపై అయినా కుండ బద్ధలు కొట్టినట్లుగా మాట్లాడతారు అషురెడ్డి. తాజాగా బామ్మ గెటప్‌లో ఉన్న ఫోటోలను షేర్ చేసి ఆమె షాకిచ్చారు. నెరిసిన జుట్టు, కొప్పుకు కనకాంబరాల మాల చుట్టి అషురెడ్డి బామ్మలా అదిరిపోయారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. క్యూట్ బామ్మ, అషు బామ్మ, నమస్తే బామ్మగారు, మోడ్రన్ ముసల్ది అంటూ నెటిజన్లు ఆమెను సరదాగా టీజ్ చేస్తున్నారు. ఇంకేందుకు ఆలస్యం .. బామ్మ గెటప్‌లోని అషురెడ్డి ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications











