దొంగతనం కేసులో బిగ్‌బాస్ కంటెస్టెంట్ అరెస్ట్ .. దుబాయ్ పోలీసుల అదుపులో టాప్ సింగర్

ఇండియాలో మెగా రియాలిటీ షోగా గుర్తింపు తెచ్చుకున్న బిగ్‌బాస్ కార్యక్రమం హిందీ సహా దేశంలోని పలు ప్రాంతీయ భాషల్లో స్ట్రీమింగ్‌ అవ్వడానికి సిద్ధమైంది. హిందీలో తొలుత ఈ కార్యక్రమం ప్రసారం అవుతుండగా.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా ప్రసారమవుతున్న హిందీ బిగ్‌బాస్‌కు దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఆ షోలో కంటెస్టెంట్‌గా పాలు పంచుకోవడానికి పలువురు ఉత్సాహం చూపిస్తున్నారు. గతంలో ఈ షోలో పాల్గొన్నవారు కెరీర్ పరంగా బిజీ కావడం దీనికి కారణం. అయితే ఓ బిగ్‌బాస్ కంటెస్టెంట్ దొంగతనం ఆరోపణలపై అరెస్ట్ కావడం కలకలం రేపుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

దొంగతనం ఆరోపణలపై అరెస్ట్
గాయకుడు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ అబ్దు రోజిక్‌ను శనివారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. మాంటెనెగ్రో నుంచి దుబాయ్‌లో దిగిన కాసేపటికే శనివారం తెల్లవారుజామున 5 గంటలకు అధికారులు అతనిని అరెస్ట్ చేశారు. ఏ కారణం వల్లన అబ్దు రోజిక్‌ను అరెస్ట్ చేశారన్నది తెలియరాలేదు.. అయితే జాతీయ మీడియాలో వస్తున్న కథనాలను బట్టి అబ్దు రోజిక్‌ను దొంగతనం ఆరోపణలపై అతనిని అదుపులోకి తీసుకున్నట్లుగా చెబుతున్నారు.

Bigg Boss Fame Abdu Rozik Arrested At Dubai Airport over alleged theft charges

అంగవైకల్యాన్ని జయించి సెలబ్రెటీగా
తజకిస్థాన్‌కు చెందిన అబ్ధు రోజిక్‌కు యూఏఈ గోల్డెన్ వీసా ఉంది. దీంతో ఇతను చాలా ఏళ్లుగా దుబాయ్‌లోనే నివసిస్తున్నాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోనే అత్యంత పాపులరైన యువ సెలబ్రెటీలలో ఒకరైన అబ్ధుకు చిన్నతనంలోనే అరుదైన జన్యుపరమైన వ్యాధి కారణంగా మరుగుజ్జుత్వం ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో 21 సంవత్సరాల వయసులోనూ అతని ఎత్తు కేవలం 3 అడుగుల 1 అంగుళం మాత్రమే. తన శారీరక వైకల్యాన్ని జయించి సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా, రాపర్‌గా సత్తా చాటి ఎందరికో ఆదర్శంగా నిలిచారు అబ్ధు రోజక్.

ఐఫా అవార్డ్స్‌లో సందడి
తజకిస్తానీ రాపర్, బ్లాగర్ అయిన బారన్ (బెహ్రూజ్) మార్గదర్శకత్వంలో అబ్ధు రోజిక్ రాటుదేలాడు. అన్ని రకాల మెళకువలు నేర్చుకుని 2019 నుంచి ప్రొఫెషనల్ రాపర్‌గా ప్రస్థానం ప్రారంభించారు అబ్ధు. ఓహి దిలి జోర్, చాకి చాకి బోరాన్, మోదర్ తదితర పాటలకు ఆయన తన గాత్రాన్ని అందించారు. 2021లో అర్జిత్ సింగ్ ఆలపించిన ఎన్నా సోనా అనే హిందీ పాటను పాడి దానికి సంబంధించిన వీడియోను అప్‌లోడ్ చేశారు. ఇది ఏడాది తర్వాత అబుదాబిలో జరిగిన 22వ ఐఫా అవార్డు వేడుకలకు అబ్ధుకు ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా 1942: ఏ లవ్ స్టోరీ మూవీలోని ఏక్ లడ్కీ కో దేఖాతో ఐసా లగా పాటను ఆలపించారు.

బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్‌గా ఛాన్స్
ఈ క్రమంలో అబ్ధు రోజిక్‌కు బిగ్‌బాస్ హిందీ 16లో కంటెస్టెంట్‌గా అవకాశం దక్కింది. బిగ్‌బాస్‌ షో కారణంగా అతనికి ఇండియాలోనూ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఇటీవల లాఫర్ చెఫ్స్ సీజన్ 2 అనే కుకింగ్ రియాలిటీ షోలో అబ్ధు రోజిక్ సందడి చేశాడు. ఈ షోలో ప్రముఖ యూట్యూబర్ ఎల్విష్ యాదవ్‌తో జోడీ కట్టాడు. అయితే అబ్ధు రోజక్ పలు వివాదాల్లోనూ చిక్కుకున్నారు. ఓ హాస్పిటాలిటీ సంస్థకు చెందిన మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అబ్ధు రోజిక్‌ను ప్రశ్నించింది. అయితే ఈ కేసులో అతనిని నిందితుడిగా చేర్చలేదు. తాజాగా దుబాయ్ పోలీసులు అబ్ధు రోజిక్‌ను అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది. అయితే అరెస్ట్ వార్తలను అబ్ధు రోజిక్ టీమ్ ఖండించింది. ఆయనను కొద్దిసేపు విచారించి బెయిల్‌పై విడిచిపెట్టారని పేర్కొన్నట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

More from Filmibeat

Read more about: bigg boss salman khan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X