డబ్బు కోసం బట్టలు విప్పను... బిగ్‌బాస్ నటి స్ట్రాంగ్ వార్నింగ్

సోషల్ మీడియా రాకతో ప్రముఖులపై ట్రోలింగ్ పెరిగిపోయింది. నిత్యం ఎవరో ఒకరు దీని బారినపడుతూ వేధింపులను బయటపెడుతున్నారు. కొందరు వీటిని చూసి చూడనట్లుగా వదిలేస్తుంటే.. మరికొందరు పోలీసులకు ఫిర్యాదు చేస్తూ ఎక్కడి వరకైనా వెళ్లేందుకు రెడీ అంటున్నారు. తాజాగా తనపై ట్రోలింగ్‌కు దిగిన వారికి బిగ్‌బాస్ నటి ఇచ్చిపడేసింది. ఈ వివరాల్లోకి వెళితే..

సోషల్ మీడియాలో అభిప్రాయాలను పంచుకునేవారు కొందరైతే.. అదే సోషల్ మీడియా ద్వారా డబ్బు సంపాదించేవారు, పాపులర్ అయ్యేవారు మరికొందరు. సెలబ్రెటీలు ఈ విషయంలో ముందుంటున్నారు. వారికున్న ఫాలోయింగ్ దృష్ట్యా చిన్న పోస్ట్ పెడితే చాలు.. కోట్లలో పారితోషికం కింద చెల్లించేవారు ఎందరో. అయితే డబ్బు సంపాదనలో పడి కొందరు స్టార్స్ విచక్షణ మరిచిపోతున్నారు. చట్ట వ్యతిరేకమైన అంశాలను ప్రమోట్ చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోట్ చేసి అమాయకుల జీవితాలను నాశనం చేసినందుకు గాను కొందరు జైలు పాలయ్యారు.

Bigg Boss fame Abhirami Venkatachalam Slams Trolls Over subscribers Demands on Social Media

అయితే ఇలాంటి ప్రమోషన్స్‌కు దూరంగా కొందరు ఎక్స్‌క్లూజిక్ కంటెంట్, సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ పేరుతో కొందరు సెలబ్రిటీలు లక్షల్లో సంపాదిస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫాంస్ తీసుకొచ్చిన సబ్‌స్క్రైబర్స్ ప్లాన్‌ను కొందరు హీరోయిన్లు, లేడీ ఇన్‌ఫ్లూయెన్సర్లు తమ స్కిన్ షోకి వేదికగా మార్చుకున్నారు. బోల్డ్ ఫోటోలు, అశ్లీలమైన వీడియోలను వదులుతున్నారు. ఒకరిని చూసి మరొకరు ఈ వికృత ట్రెండ్‌లోకి దిగుతున్నారు. సగటున ఒక్కో ఇన్‌ఫ్లూయెన్సర్ నెలకు 10 లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు. ఎక్స్‌క్లూజివ్‌గా కొందరికే ఇలాంటి కంటెంట్ ఇస్తున్నామని సెలబ్రిటీలు కవర్ చేసుకుంటున్నా.. కొందరు వీటిని స్క్రీన్ రికార్డింగ్, స్క్రీన్ షాట్లతో పేరుతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

అయితే ఇలా సబ్‌‌స్క్రిప్షన్ తీసుకున్న వారి ఆగడాలు నానాటికీ పెరుగుతున్నాయి. వందలు, వేలు ఖర్చు పెట్టినందున తమకు నచ్చిన ఫోటోలు పెట్టాలని, ఇలాంటి వీడియోలు కావాలంటూ సెలబ్రిటీలను కొందరు వేధిస్తున్నారు. అలాంటి వేధింపుల బారినపడ్డారు తమిళ నటి, బిగ్‌బాస్ ఫేమ్ అభిరామి వెంకటాచలం. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన నోటాలో నటించిన ఈ ముద్దుగుమ్మకు తమిళంలో మంచి క్రేజ్ ఉంది. సినిమాలతో పాటు వెబ్‌సిరీస్‌లతో తన హవా సాగిస్తోంది. బిగ్‌బాస్ తమిళ్ సీజన్ 3తో పాటు బిగ్‌బాస్ అల్టీమేట్ సీజన్ 1లో 5వ రన్నరప్‌గా నిలిచి సత్తా చాటింది.

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే అభిరామి.. తన సినిమాలు, షూటింగ్స్, ఇతర వ్యక్తిగత వివరాలను పంచుకుంటూ ఉంటారు. అలాగే బోల్డ్ ఫోటోషూట్స్‌తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంటారు. ఈ క్రమంలోనే తన ఇన్‌స్టాగ్రామ్‌లో సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ తీసుకొచ్చిన ఆమె.. ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ షేర్ చేస్తున్నారు. ఇందుకోసం నెలకు రూ.399 ప్లాన్ తీసుకొచ్చారు. అయితే ఆమె సబ్‌స్క్రైబర్లు వింత డిమాండ్లు చేస్తూ వేధింపులకు గురిచేస్తున్నారు. తమకు నగ్నంగా ఉన్న ఫోటోలు, రొమాంటిక్ కంటెంట్ కావాలంటూ కోరుతున్నారు.

కొన్నాళ్లు చూసిచూడనట్లు వ్యవహరించిన అభిరామి.. వేధింపులు శృతిమించడంతో సీరియస్ అయ్యారు. ప్రియమైన సబ్‌స్క్రైబర్‌లారా, నన్ను ప్రేమతో ఆదరిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పటి వరకు ఎవరితోనూ పంచుకోని లేదా ప్రయోగాలు చేయని నా ఎక్స్‌క్లూజివ్ ఫోటోలను పోస్ట్ చేయడానికి ఈ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించాను. కేవలం సబ్‌స్క్రిప్షన్ కారణంగా నేను నగ్నంగా కనిపించాలని ఇక్కడ ఎవరైనా ఆశిస్తుంటే, మీరు నిస్సందేహంగా నా పేజీని అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. నేను ఎలాంటి పోస్ట్‌లు చేయాలో చెప్పడానికి నేను ఇక్కడ లేను. నేను నా సృజనాత్మకతను షేర్ చేసుకోవడానికి మాత్రమే ఇక్కడ ఉన్నాను. ఇది అశ్లీల సైట్ కాదు అంటూ వార్నింగ్ ఇచ్చారు అభిరామి వెంకటాచలం. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X