నా భార్యపై ట్రోలింగ్ ఆపండి.. బిగ్‌బాస్ నటుడు ఆవేదన

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు విశ్వ (Vishwa) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలు, సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ నటుడు, బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 లో పాల్గొన్న తర్వాత మరింత పాపులారిటీ సంపాదించారు. ఒకానొక సమయంలో వరుస అవకాశాలతో బిజీగా ఉన్న విశ్వ, తర్వాత అనూహ్యంగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో ఎదుర్కొన్న కష్టాలు, కుటుంబ పోరాటం, భార్యపై వచ్చిన ట్రోలింగ్‌ వంటి ఎన్నో విషయాలను ఎమోషనల్‌గా పంచుకున్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నటుడు విశ్వ మాట్లాడుతూ.. తాను ఇండస్ట్రీలో అడుగుపెట్టి 24 ఏళ్లు పూర్తయ్యాయని తెలిపారు. పదో తరగతి పూర్తయ్యాకే నటనపై ఆసక్తితో సినీ పరిశ్రమలోకి వచ్చానన్నారు. ప్రారంభంలో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశానని, తర్వాత సీరియల్స్ వైపు మళ్లానని చెప్పారు. అతను నటించిన ప్రారంభ చిత్రాల్లో పెళ్లికోసం, విద్యార్థి వంటి సినిమాలు ఉన్నాయని తెలిపారు. ఆ తర్వాత టెలివిజన్ రంగంలో అవకాశాలు రావడంతో సీరియల్స్‌లో కొనసాగానన్నారు. కుటుంబ ప్రేక్షకులకు దగ్గరైన పాత్రలతో మంచి గుర్తింపు వచ్చిందని చెప్పారు.

Bigg Boss fame Actor Vishwa Slams Trolls on Wife Reveals Health Struggles and Emotional Journey

అయితే ఒక దశలో తన కెరీర్‌కు గట్టి దెబ్బ తగిలిందని విశ్వ వెల్లడించారు. ఇండస్ట్రీలో తనకు అవకాశాలు రాకుండా కొందరు అడ్డుకున్నారని, ఉద్దేశపూర్వకంగా తొక్కేశారని అన్నారు. చేతిలో పని లేకుండా పోయిందని, ఒక్కసారిగా ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయని చెప్పారు. ఆ సమయంలో కుటుంబాన్ని నడపడం కూడా కష్టమైందని, తన తమ్ముడి సంపాదనపైనే బతికిన రోజులు ఉన్నాయని ఎమోషనల్ అయ్యారు. దాదాపు ఆరు నెలలపాటు తమ్ముడే ఇంటి ఖర్చులు చూసుకున్నాడని తెలిపారు.

జీవితంలో వచ్చిన కష్టాలకు లొంగిపోకుండా కొత్త దారి ఎంచుకున్న విశ్వ, ఫిట్‌నెస్ రంగంలో అడుగుపెట్టారు. కొంతకాలం క్రితం విశ్వ ఫిట్ నెస్ క్లబ్ (Vishwa Fitness Club) ప్రారంభించి జిమ్ ట్రైనర్‌గా మారారు. సొంత కష్టార్జితంతో నిలబెట్టిన ఈ ఫిట్‌నెస్ క్లబ్ విలువ కోట్లలో ఉంటుందని టాక్ వినిపిస్తోంది. నటుడిగా మాత్రమే కాదు, వ్యాపారవేత్తగా కూడా విశ్వ కొత్త గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ 'పెద్ది' సినిమాలో అవకాశం రావడంతో విశ్వ మళ్లీ చర్చల్లోకి వచ్చారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చి బాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నటిస్తున్నట్లు తెలిపారు. దీంతో ఆయన మళ్లీ సినిమాల్లో బిజీ అవుతారా అన్న ఆసక్తి అభిమానుల్లో కనిపిస్తోంది.

తన భార్య శ్రద్ధతో ప్రేమకథ గురించి కూడా విశ్వ ఓపెన్‌గా మాట్లాడారు. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ సమయంలో శ్రద్ధ తనను చూసి ఇష్టపడిందని చెప్పారు. ఆ సమయంలో తాను బ్రేకప్ బాధలో ఉన్నానని, నిజమైన ప్రేమ అనే భావననే నమ్మలేని స్థితిలో ఉన్నానన్నారు. అలాంటి సమయంలో శ్రద్ధ నుంచి మెసేజ్ రావడంతో మొదట టైంపాస్‌గా మాట్లాడానని, కానీ తర్వాత ఆమెతో బలమైన అనుబంధం ఏర్పడిందని తెలిపారు. వారం రోజులకే శ్రద్ధ ఇంట్లో ప్రేమ విషయం చెప్పేసిందని అన్నారు. మొదట ఆమె కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదని, తర్వాత తన గురించి తెలుసుకుని పెళ్లికి అంగీకరించారని వెల్లడించారు. శ్రద్ధను దేవుడు తన కోసం పంపిన ఏంజెల్‌గా భావిస్తానని విశ్వ ప్రేమగా చెప్పారు.

భార్యపై ట్రోలింగ్.. విశ్వ ఆవేదన
ఇంటర్వ్యూలో అత్యంత చర్చనీయాంశమైన అంశం భార్యపై ట్రోలింగ్ గురించి విశ్వ చెప్పిన మాటలే. ప్రస్తుతం ఫిట్‌నెస్ క్లబ్‌లో శ్రద్ధ డైట్ ప్లాన్, ఫుడ్ ప్రిపరేషన్ చూసుకుంటుందని, తాను ట్రైనింగ్ ఇస్తానని తెలిపారు. కానీ ఇద్దరూ కలిసి సోషల్ మీడియాలో వీడియో పెడితే, "ముందు నీ భార్యను సన్నగా చేయ్", "ఇంట్లో సరిగా చూసుకో" అంటూ ట్రోల్స్ చేస్తున్నారని బాధపడ్డారు.
వాళ్లు చెప్పినదాంట్లో తప్పు లేదనుకోండి.. కానీ అసలు నిజం తెలియకుండా కామెంట్లు చేయడం చాలా బాధించిందని అన్నారు. శ్రద్ధ బరువు పెరగడం వెనుక అసలు కారణాన్ని కూడా విశ్వ బయటపెట్టారు. రెండోసారి కుమారుడు పుట్టిన తర్వాత హార్మోన్ల ఇన్ బ్యాలెన్స్ వల్ల ఆమె ఒక్కసారిగా బరువు పెరిగిపోయిందని తెలిపారు.

కొన్ని నెలల తర్వాత ఎక్సర్‌సైజ్ ప్రారంభించామని, కానీ అప్పుడే ఆమెకు కార్పెల్ టన్నెల్ అనే అరుదైన సమస్య వచ్చిందన్నారు. ఆ వ్యాధి కారణంగా చేతులు బలహీనపడి, పిల్లాడికి షర్ట్ బటన్ కూడా పెట్టలేని స్థితి వచ్చిందని చెప్పి భావోద్వేగానికి గురయ్యారు. తన పనులు తానే చేసుకోలేని పరిస్థితి వచ్చిందని, అందుకే వ్యాయామం ఆపేయాల్సి వచ్చిందన్నారు. ఇప్పుడు మళ్లీ కోలుకుని తిరిగి ఎక్సర్‌సైజ్ ప్రారంభించిందని తెలిపారు.బయటకు కనిపించే రూపం చూసి చాలామంది విమర్శిస్తారని, కానీ దాని వెనుక ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి, కుటుంబ పరిస్థితులు ఉంటాయని చెప్పకనే చెప్పారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ సరదాగా అనిపించినా, అది ఒక కుటుంబాన్ని ఎంతగా బాధపెడుతుందో విశ్వ మాటల్లో అర్థవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X