ప్రతీ ఒక్కరిని తృప్తి పరచడం కష్టం.. అది లోపం కాదు.. ప్రియ ఎమోషనల్ కామెంట్

తెలుగు బుల్లితెర,వెండితెర ప్రేక్షకులకు ప్రియ (Priya)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీరియల్స్, సినిమాలు, రియాలిటీ షోల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 45 ఏండ్ల వయసులో కూడా ఏ మాత్రం వన్నె తగ్గకుండా తన అందంతో యంగ్ హీరోయిన్స్ తో పోటీపడుతున్నారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారి తెలుగులో మోస్ట్ వాంటేడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీగా మారారు. ఈ అమ్మడు సీరియల్స్, సినమాల్లోనే కాదు.. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టీవ్‌గా ఉంటారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

ప్రియ గురించి మాట్లాడితే.. ఆమె అసలు పేరు మామిళ్ల శైలజ ప్రియ. ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లకు చెందిన ఆమె కుటుంబం తర్వాత హైదరాబాద్‌లో స్థిరపడింది. డిగ్రీ పూర్తయ్యాక నటనపై ఆసక్తితో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మాస్టర్' సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియ.. ఆ తర్వాత వరుసగా సినిమాలు, సీరియల్స్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలు, సహాయ పాత్రలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా దాదాపు 200 మందికి పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. పవన్ కళ్యాణ్, వెంకటేష్ దగ్గుబాటి, నాగార్జున, అమితాబ్ బచ్చన్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.

Bigg Boss fame actress Priya Shares Deep Emotional Quote on Relationships Post Goes Viral

సినిమాలతో పాటు 'లేడీ డిటెక్టివ్', 'సంఘర్షణ', 'చిన్న కోడలు', 'కృష్ణ ముకుందా మురారి', 'నెంబర్ 1 కోడలు' వంటి సీరియల్స్ ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్‌కు మరింత దగ్గరయ్యారు. ఇక 2002లో మాచిరాజు వెంకట కిశోర్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి నిశ్చయ్ అనే కుమారుడు ఉన్నాడు. పెళ్లి తర్వాత దాదాపు పదేళ్ల పాటు కుటుంబం కోసం సినీ రంగానికి దూరమయ్యారు. తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి మళ్లీ బిజీ ఆర్టిస్ట్‌గా మారారు. బిగ్‌బాస్ తెలుగు షోలో పాల్గొనడం ఆమెకు మరో మలుపు తిరిగింది. షోలో ఆమె చూపించిన స్ట్రెయిట్ ఫార్వర్డ్ నేచర్, ఎమోషనల్ స్టోరీ ప్రేక్షకులను బాగా కనెక్ట్ అయ్యేలా చేసింది.

ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ప్రియ.. తరుచూ తన సినిమాలు, సీరియల్స్, షూటింగ్స్ ఇతర వ్యక్తిగత వివరాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అలాగే సమాజంలో జరుగుతున్న అంశాలపై తన అభిప్రాయాలను తెలియజేస్తుంటారు. అంతేకాకుండా ఫోటోషూట్‌లతోనూ మైండ్ బ్లాంక్ చేస్తుంటారు. ఇక ఈ మధ్యకాలంలో ఆమె ఎమోషనల్ కోట్స్‌ను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అలా తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక చిన్న కోట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈసారి "బ్లాక్ కాఫీ" కోట్ ద్వారా మనోగతాన్ని అభిమానులతో పంచుకుంది. ప్రతి ఒక్కరినీ తృప్తిపరచడం సాధ్యం కాదని, అందరికీ మన వ్యక్తిత్వం నచ్చాల్సిన అవసరం లేదని ఈ పోస్ట్ ద్వారా ప్రియ చెప్పింది. "అది లోపం కాదు.. మనల్ని నిజంగా అర్థం చేసుకునే వాళ్లను గుర్తించే ఫిల్టర్ మాత్రమే" అనే అర్థంతో ఆమె ఓ ఎమోషనల్ కోట్ పోస్టు చేసింది. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు ఇది ఆమె వ్యక్తిగత జీవిత అనుభవాల ప్రతిబింబమేమో అంటూ చర్చించుకుంటున్నారు. మరికొందరు మాత్రం 'జీవిత సత్యం' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే.. అసలు ఆ కోట్ లో దాగిన నిగూఢ అర్థమేంటో ఆమెకే తెలియాలి.

Read more about: priya bigg boss telugu tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X