Adi Reddy: బిగ్ బాస్ ఆది రెడ్డి సంపాదన ఎంతో తెలుసా? ఒక్క నెలకే అన్ని లక్షలు.. లెక్కలతో సహా లీక్

తెలుగు బుల్లితెరపై సక్సెస్ అయిన షోలలో బిగ్ బాస్ ఒకటి. అంతలా ఇది ప్రభావాన్ని చూపిస్తూ సీజన్ల మీద సీజన్లను కంప్లీట్ చేసుకుంటూ వెళ్తోంది. ఇలా ఇప్పటికే ఆరు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్లను ఇది కంప్లీట్ చేసుకుంది. ఇక, ఈ షో వల్ల ఎంతో మంది బిగ్ సెలెబ్రిటీలుగా మారిపోయారు. అందులో ప్రముఖ యూట్యూబర్ కమ్ బిగ్ బాస్ రివ్యూవర్ ఆది రెడ్డి ఒకడు. ఆరో సీజన్‌లో సత్తా చాటిన అతడు.. తర్వాత తన రివ్యూలతో ఆకట్టుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా తన సంపాదన గురించి తొలిసారి ఓపెన్ అయ్యాడు. దానికి సంబంధించిన పూర్తి వివరాలివే!

బిగ్ బాస్‌తో యమ హైలైట్
ఆది రెడ్డి యూట్యూబర్‌గా కెరీర్‌ను ప్రారంభించి.. ఆ తర్వాత బిగ్ బాస్ రివ్యూవర్‌గా గుర్తింపు తెచ్చుకుని.. చాలా తక్కువ సమయంలోనే పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఆరో సీజన్‌లో అతడు కామన్ మ్యాన్ కోటాలో కంటెస్టెంట్‌గా వచ్చాడు. ఆరంభంలోనే అతడు ప్రత్యేకమైన శైలితో బాగా హైలైట్ అయ్యాడు. తద్వారా మొదట్లోనే ఫాలోయింగ్ పెంచుకున్నాడు.

Bigg Boss Fame Adi Reddy Reveals about His Youtube Earnings

ఆటతో.. మాట తీరులోనూ
బిగ్ బాస్ ఆరో సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచే ప్రత్యేకంగా నిలిచిన ఆది రెడ్డి.. క్రమంగా తన సత్తాను నిరూపించుకునే ప్రయత్నం చేశాడు. ఇందులో భాగంగానే చక్కని ఆటతీరుతో ఆకట్టుకున్న అతడు.. మాటతీరు, అందరితో వ్యవహరించే తీరుతోనూ మంచి పేరును కూడా అందుకున్నాడు. తద్వారా ఎన్నోసార్లు ఎలిమినేషన్స్ కూడా తప్పించుకుని ఫినాలేలోకి వెళ్లాడు.

బిగ్ బాస్‌తో లాభం కూడా
సాదాసీదాగానే బిగ్ బాస్‌లోకి వచ్చిన ఆది రెడ్డి.. ఎవరూ ఊహించని రీతిలో ఆకట్టుకుని ఫినాలేకు చేరుకున్నాడు. అయితే, అతడు చివరికి నాలుగో స్థానంతోనే సరిపెట్టుకున్నాడు. అయితేనేం.. రెమ్యూనరేషన్ పరంగా అతడు చాలా మొత్తాన్నే ఖాతాలో వేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. దీనికితోడు ఈ షో తర్వాత ఆది రెడ్డిని ఫాలో అయ్యే వారు కూడా బాగానే పెరిగిపోయారు.

Bigg Boss Fame Adi Reddy Reveals about His Youtube Earnings

బిగ్ బాస్ రివ్యూలు చెప్తూ
ఆరంభం నుంచీ బిగ్ బాస్ షోకు రివ్యూలు చెప్తోన్న ఆది రెడ్డి.. ఆరో సీజన్ తర్వాత యూట్యూబ్‌కు గ్యాప్ ఇస్తాడని అంతా అనుకున్నారు. కానీ, అతడు మాత్రం రివ్యూలు కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా ఏడో సీజన్‌పై కూడా తనదైన రీతిలో విశ్లేషనలు చెప్తున్నాడు. ఇలా ఎన్నో వీడియోలను చేస్తున్నాడు. ఫలితంగా అతడి రేంజ్ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది.

ఒక్క నెలకే 39 లక్షలట
గతంలో కంటే ఇప్పుడు యూట్యూబర్లకు ఆదాయం భారీగా వస్తోంది. ముఖ్యంగా తెలుగులోని ఎంతో మంది దీని ద్వారా బాగా సంపాదిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆది రెడ్డి యూట్యూబ్ ద్వారా తనకు వచ్చే ఆదాయాన్ని బయట పెట్టాడు. దీని ప్రకారం.. అతడు గత నెలలో ఏకంగా రూ. 39 లక్షలు సంపాదించాడట. దీనికి సంబంధించిన లెక్కలను కూడా ఆది రెడ్డి బయటపెట్టాడు.

Bigg Boss Fame Adi Reddy Reveals about His Youtube Earnings

మీకు రుణపడి ఉంటా
తాజాగా ఆది రెడ్డి ఓ వీడియోను షేర్ చేశాడు. అందులో 'నేనైతే పెయిడ్ రివ్యూవర్‌ను. నాకు యూట్యూబ్ మాత్రమే పే చేస్తుంది. నా ఛానల్‌ చూసేవాళ్లు పే చేస్తున్నారు. అంతేకానీ ఎవడో ఉడాల్ నాయాల వచ్చి పొగడమంటే పోరా బచ్చాగా అంటా. ఇది నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే. రెండు లక్షలు వచ్చినప్పుడు మీకు చెప్పి సంతోషించాను' అని చెప్పుకొచ్చాడు.

గత నెలలో వచ్చిందిదే
అదే వీడియోలో ఆది రెడ్డి 'అసలు నాకు ఎవడో డబ్బులు ఇవ్వడం ఏంటి? నాకు గత నెల యూట్యూబ్ ద్వారా ఆదాయం రూ. 39 లక్షలు వచ్చింది. నా జీవితం మొత్తం రుణపడి ఉంటాను. ఈ డబ్బు ఈజీగా రాలేదు. షోను దాదాపు 17-18 గంటలు చూస్తున్నా. హౌస్‌‌లో వాళ్లు నిద్రపోతేనే నేను నిద్రపోతున్నాను. కనీసం నా భార్య, పిల్లలతో మాట్లాడట్లేదు' అని వివరించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X