ఆపని చేసినందుకే RGV నెంబర్‌ను బ్లాక్ చేసాను.. హాట్ యాంకర్ షాకింగ్ కామెంట్స్.. !
RGV: ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఒకప్పుడు బ్లాక్ బస్టర్ మూవీస్ ను అందించిన ఆర్జీవి. ఇటీవల కాలంలో కాంట్రవర్సీలకు కేరాఫ్ గా మారుతున్నారు. వరుసగా వివాదాలతో స్నేహం చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఆర్జీవీ ఏం చేసినా.. ఏం మాట్లాడినా.. అది సెన్సేషనల్ అవుతోంది. అయితే.. ఓ యాంకర్ ఆర్జీవి వల్లనే ఫేమ్ తెచ్చుకుంది. కానీ, ఆయన నెంబర్ నే బ్లాక్ చేసిందట. ఇంతకీ ఆ నటి ఎవరు? ఓ లూక్కేయండి.
ఒకప్పడు ఆర్జీవీ అంటే ఓ బ్రాండ్. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ ఎదిగిన వారందరూ ఆయన దగ్గర పని చేసిన వారే. నాగార్జునతో శివ సినిమా తెరకెక్కించి, అప్పట్లో ఇండస్ట్రీలోని పలు రికార్డ్స్ బ్రేక్ చేశారు. ఆ తర్వాత బాలీవుడ్ లోనూ బిగ్ బీ అలాంటి పెద్ద యాక్టర్ తో సంచలన సినిమాలు తీశాడు. ఒకప్పుడు సూపర్ హిట్ మూవీస్ అందించిన వర్మ.. ఆ తరువాత ప్రేక్షకుల మనసు నచ్చేలా సినిమాలు తెరకెక్కించడంలో ఫెయిల్ అవుతున్నాడు. దీంతో వర్మ గ్రాఫ్ పడిపోయింది.

ఇటీవల సీనియర్ హీరోలు, రాజకీయ నాయకుల బయోపిక్ లను తనకు నచ్చినట్టు తెరకెక్కిస్తూ తరుచు వివాదాల్లో ఇర్కుంటున్నారు. ఆయన సినిమాలకు క్రేజ్ తగ్గినా పలు సెన్సేషనల్ వ్యాఖ్యలు చేస్తూ.. తన క్రేజ్ ను అలాగే కాపాడుకుంటూ వస్తున్నారు. తాను పాల్గొన ఇంటర్వ్యూలో ఏదోక సంచలన వ్యాఖ్యలు చేస్తూ హాట్ టాపిక్ గా మారుతారు. ఆ అలాంటి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ను ఓ మూడేళ్ల క్రితం బిగ్ బాస్ ఫేమ్, హాట్ బ్యూటీ యాంకర్ అరియనాను ఇంటర్వ్యూ చేసిన విషయం తెలిసిందే.
ఇంటర్వ్యూ ఇప్పటికి నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఈ ఇంటర్య్వూలో ఆరియానా జిమ్ చేస్తూ.. అందాలు ఆరబోస్తుండగా.. వాటిని ఆర్జీవి ఆస్వాదిస్తూ.. ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ పెద్ద సంచలనమే అని చెప్పాలి. ఎందుకంటే ఆర్జీవీని ఆ రేంజ్‌లో ఇంటర్య్వూ చేసింది ఒక అరియానా మాత్రమే. ఈ ఇంటర్వ్యూలో ప్రశ్నలు అడగటం కంటే.. ఆరియానా పలుకరింతా.. ఆర్జీవి పులకరింతా అనేలా సాగింది. మొత్తానికి ఇంటర్వ్యూలోనే ఓ సంచలనంగా చెప్పవచ్చు.
ఇదెలా ఉంటే.. యాంకర్ అరియానా ప్రస్తుతం దావత్ అనే టాక్ షో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోలో అరియానా కొత్తగా రిలీజ్ అయిన సినిమాలను ప్రమోట్ చేస్తూనే.. అందులోని హీరో, హీరోయిన్స్ , డైరెక్టర్స్ ను ఇంటర్వ్యూ చేస్తుంది. అలాగే టైర్ 2 హీరో హీరోయిన్స్ ను తన షో కు పిలిచి.. తన ఘాటైన ప్రశ్నలతో తిక్కమగపేడుతుంది. ఈ దవాత్ షోలో ఆరియానా డ్రెస్సింగ్ గాని, డబుల్ మినింగ్ మాటలు గాని షోకు హైలెట్ గా నిలుస్తున్నాయి.

తాజాగా ఆరియానా 'దావత్' కార్యక్రమానికి జబర్దస్త్ రాకేష్ తన భార్య సుజాతతో కలిసి హాజరయ్యారు.తమ 'కెసిఆర్' మూవీని ప్రమోట్ చేస్తూ ఇంటర్వ్యూ కొనసాగించారు. ఇంటర్వ్యూలో 'కెసిఆర్' మూవీ గురించి రాకేష్ మాట్లాడుతూ.. తమ సినిమాకు ముందుగా 'దావత్' అనే టైటిల్ పెడదామని అనుకున్నానని చెప్పాడు. దీంతో అరియానా నిజమా అన్నట్లుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. ఐస్ క్రీమ్ సినిమా గుర్తుందా? మీ గురువు (ఆర్జీవి) గారిది అంటూ రాకేష్ ఏదో చెప్పబోతుంటే.. 'అందరూ గురువుగారు.. గురువుగారు అని అంటూ..' ఏదో డైలాగ్ కొట్టింది ఆరియనా.
ఆ తరువాత ఆర్జీవికి తనకు చిన్న డిస్టబెన్స్ వచ్చిందని, అప్పటినుండి ఆర్జీవీ నెంబర్ ను తాను బ్లాక్ చేశానని తెలిపారు హరియానా. దీంతో రాకేష్ అదిరిపోయే కౌంటర్ వేశారు. 'ఆర్జీవి గారు ప్రపంచాన్ని బ్లాక్ చేస్తాడే.. మీరు ఆయన నెంబర్ బ్లాక్ చేశారా' అంటూ సెటైరికల్ పంచ్ వేశాడు. అయితే.. ఆర్జీవి తనకు ఏ విషయంలో గొడవ జరిగిందో..అనే విషయం మాత్రం ఆరియానా చెప్పలేదు. ప్రస్తుతం ఈ అమ్మడు కామెంట్స్ నెటింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











