Shiva Jyothi: 33వ బర్త్‌డేకి స్పెషల్ సర్‌ప్రైజ్... ఇద్దరం ముగ్గురవుతున్నామంటూ..
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు తీన్మార్ సావిత్రిగా బాగా పరిచయమైన యాంకర్ శివ జ్యోతి (Shiva Jyothi) తాజాగా తన అభిమానులకు జీవితంలోనే మరిచిపోలేని గుడ్ న్యూస్ చెప్పారు. తెలంగాణ యాస, సహజమైన ప్రెజెంటేషన్, సంప్రదాయ కట్టుబొట్టుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శివ జ్యోతి. ముఖ్యంగా వీ6 న్యూస్ ఛానల్ లో తీన్మార్ కథలతో మొదటి పరిచయం తరువాత మంచి క్రేజ్ సంపాదించి, ఆ తర్వాత బిగ్ బాస్ షో ద్వారా మరింత గుర్తింపు తెచ్చుకుంది. ఈ యాంకరమ్మ తన అభిమానులకు ఒక సర్‌ప్రైజ్ శుభవార్త చెప్పింది. ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఎంటీ?
నిజామాబాద్ జిల్లా నాగంపేట గ్రామానికి చెందిన శివ జ్యోతి, తొలుత వీ6 న్యూస్ లో 'తీన్మార్' స్టైల్ కథనాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. అక్కడి నుంచే ఆమె కెరీర్ మలుపు తిరిగింది. ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగులో పాల్గొని మరింత పాపులారిటీ సంపాదించారు. రియాలిటీ షోలో ఆమె నిజాయితీగా మాట్లాడే తీరు, ఎమోషనల్ మోమెంట్స్ ఆడియన్స్‌ను బాగా కనెక్ట్ చేశాయి. ప్రస్తుతం టీవీ ప్రోగ్రామ్స్‌తో పాటు యూట్యూబ్ కంటెంట్‌తో కూడా యాక్టివ్‌గా కొనసాగుతున్నారు.

పదేళ్ల కల నెరవేరింది
పదేళ్ల క్రితం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గంగూలీతో ప్రేమ వివాహం చేసుకున్న శివ జ్యోతి. కానీ, పిల్లలు లేరు. ఇందుకోసం ట్రీట్మెంట్స్ తీసుకుంది. ఎన్నో పూజలు, వత్రాలు చేసింది. ఇలా దాదాపు పదేళ్ల తరువాత ఫిబ్రవరి 12న పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ ద్వారా వెల్లడించారు.
'హ్యాపీ బర్త్‌డే చిన్నీ.. నా 33వ పుట్టినరోజుకు జీవితంలోనే బెస్ట్ గిఫ్ట్ వచ్చింది. ఫిబ్రవరి 12న మా బిడ్డ పుట్టింది. రెండు హృదయాల నుంచి ఇప్పుడు మేము ముగ్గురమయ్యాం" అంటూ భావోద్వేగంగా పంచుకున్నారు. అయితే ఇప్పటివరకు బేబీ అబ్బాయా? అమ్మాయా? అనే విషయాన్ని వెల్లడించలేదు. త్వరలోనే జెండర్ రివీల్ చేస్తామని కూడా స్పష్టం చేశారు. ఈ పోస్ట్ వైరల్ కావడంతో సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ మొదలైంది. అభిమానులు, స్నేహితులు, టీవీ ఇండస్ట్రీ ప్రముఖులు అందరూ "కంగ్రాట్స్" అంటూ కామెంట్లు పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











