థాయ్‌లో హద్దులు దాటేసిన స్టార్ యాంకర్.. అలాంటి బట్టల్లో గ్లామర్ షో!
తెలుగులో ఇప్పుడిప్పుడే టాప్ యాంకర్‌గా దూసుకొస్తున్నారు స్రవంతి చొక్కారపు. గతంలో ఏ ఆడియో ఫంక్షన్, ప్రీ రిలీజ్, సక్సెస్‌మీట్ ఇలా ఏది చూసినా సుమ కనకాల కనిపించేవారు. ఇప్పుడు సుమకు గట్టి పోటీ ఇస్తున్నారు స్రవంతి చొక్కారపు. సినిమాలో హీరో హీరోయిన్లు పోషించిన గెటప్స్ వేసుకుని మూవీ ఈవెంట్స్‌లో ఈ ముద్దుగుమ్మ సందడి చేస్తున్నారు. తన అందం, చలాకీతనంతో అభిమానులను సంపాదించుకుంటున్నారు స్రవంతి.
ప్రేమికుడి కోసం ఒంటరిగా హైదరాబాద్‌కి
ఆంధ్రప్రదేశ్‌లోని కదిరిలో పుట్టి పెరిగిన ఈమె 2009లో చదువు పూర్తి చేసి యాంకరింగ్‌లోకి అడుగుపెట్టడానికి వెనుక కన్నీటి కథ ఉంది. ప్రశాంత్ అనే వ్యక్తిని ప్రేమించిన స్రవంతి అతని కోసం ఒంటరిగా కదిరి నుంచి హైదరాబాద్‌కు వచ్చేసింది. కొన్నాళ్లు హాస్టల్‌లో ఉన్న స్రవంతి పిల్లలకు పాఠాలు చెబుతూ జీవితాన్ని నెట్టుకొచ్చింది. వీరిద్దరి ప్రేమ విషయం ఇరు కుటుంబాల్లో తెలియగా ఇందుకు అంగీకరించలేదు. అయితే స్రవంతి - ప్రశాంత్‌లు పెద్దల అభిష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నారు.

బిగ్‌బాస్‌లో ఛాన్స్ దక్కించుకున్న స్రవంతి
స్రవంతి గర్భం దాల్చిన సమయంలో వీరిద్దరూ ఎన్నో కష్టాలు పడ్డారు. బాబు పుట్టిన తర్వాత తిరిగి పెద్దల చెంతకు చేరుకుంది ఈ జంట. ఆ తర్వాత ఓ యూట్యూబ్ ఛానెల్‌లో యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన స్రవంతి పలు టీవీ ఛానెల్స్‌లో హోస్ట్‌గా, ఇంటర్వ్యూలు చేసింది. ఈటీవీలో ప్రసారమయ్యే పాపులర్ కామెడీ షో జబర్దస్త్‌లో అవకాశం దక్కించుకుని.. ఈ క్రేజ్‌తోనే బిగ్‌బాస్ తెలుగులో ఛాన్స్ పట్టేసింది. అయితే స్రవంతి తీరుతో విసిగిపోయిన ఆడియన్స్.. ఎలిమినేట్ చేసేయండి మహాప్రభో అంటూ విరుచుకుపడ్డారు.
పుష్ప ఇంటర్వ్యూతో పాపులర్
బిగ్‌బాస్‌తో మంచి పాపులారిటీ సంపాదించిన తిరిగి యాంకరింగ్‌లో బిజీ అయ్యారు స్రవంతి. ఈ దశలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మతోనూ, పుష్ప రిలీజ్ సమయంలో అల్లు అర్జున్, సుకుమార్‌లతోనూ చేసిన ఇంటర్వ్యూ జనాల్లోకి బాగా వెళ్లింది. ఆ వెంటనే సినీజనాల కళ్లలో పడటంతో సినిమా ఈవెంట్లు, షోలకు హోస్టింగ్ చేసే అవకాశాలు క్యూ కట్టాయి. కెరీర్ పరంగా పీక్స్‌లో ఉన్న దశలో ఓ రోజున ఆసుపత్రిపాలై అభిమానులను షాకిచ్చింది. ఆడవాళ్లు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని స్రవంతి పలు సూచనలు చేశారు. అనారోగ్యం నుంచి కోలుకున్నాక తిరిగి తన రోజువారి జీవితంలో బిజీ అయ్యారు స్రవంతి.
థాయ్‌లాండ్ వెకేషన్‌కు స్రవంతి
చీరకట్టులో పద్ధతిగా కనిపించడంతో పాటు మోడ్రన్ డ్రెస్‌లో గిలిగింతలు పెడుతూ కుర్రాళ్లకు గిలిగింతలు పెడుతున్నారు స్రవంతి. ఈ ముద్దుగుమ్మకు దైవభక్తి కూడా ఎక్కువే. పండుగలు, ప్రత్యేక పర్వదినాల్లో ఇంట్లో పూజలు చేసి వాటికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో ఎండలు మండిపడటంతో జనం అల్లాడిపోతున్నారు. కొందరు ఫారిన్ ట్రిప్ వేస్తూ ఎండల నుంచి సేద తీరుతున్నారు. తాజాగా స్రవంతి కూడా తన పనులకు బ్రేక్ చెప్పి థాయ్‌లాండ్ ట్రిప్‌కి వెళ్లింది. అక్కడ పొట్టి బట్టలు, మోడ్రన్ వేర్‌లో అందాల విందు చేస్తోంది స్రవంతి. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. మరి ఇంకేందుకు ఆలస్యం స్రవంతి అందాలపై మీరూ ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications











