అందాలను చేతులతో దాస్తూ .. గ్లామర్ షోతో రెచ్చిపోతోన్న స్టార్ యాంకర్

హేమాహేమీలు ఉన్న తెలుగు యాంకరింగ్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు స్రవంతి చొక్కారపు. అందంతో పాటు చలాకీతనంతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈవెంట్స్, ఇంటర్వ్యూలతో పాటు సోషల్ మీడియాలోనూ హల్ చల్ చేస్తూ దూసుకెళ్తున్నారు ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పెట్టిన పోస్ట్‌ వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

రాయలసీమలోని అనంతపురం జిల్లా కదిరిలో పుట్టి పెరిగిన ఈమె 2009లో చదువు పూర్తి చేసి మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది స్రవంతి. ప్రశాంత్ అనే వ్యక్తిని ప్రేమించి.. అతని కోసమే హైదరాబాద్ వచ్చేసింది. కొన్నాళ్లు హాస్టల్‌లో ఉంటూ పిల్లలకు పాఠాలు చెబుతూ జీవితం నెట్టుకొచ్చింది. ఇంట్లో వాళ్లకు చెప్పకుండా పెళ్లి చేసుకోవడంతో ఇరు కుటుంబాలు వీరి వివాహానికి అంగీకారం తెలపలేదు. అయినప్పటికీ ఎన్నో కష్టాలు పడి తిరిగి పెద్దల చెంతకు చేరుకుంది ఈ జంట.

bigg boss fame Anchor sravanthi chokarapu stunnig look in red saree her photos goes viral

ఓ యూట్యూబ్ ఛానెల్‌లో యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన స్రవంతి చొక్కారపు.. ఓ రోజున సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూలో చేసి క్రేజ్ సంపాదించారు. ఆ తర్వాత పుష్ప విడుదల సమయంలో ఆ చిత్ర యూనిట్‌ను చిత్తూరు యాసలో ఇంటర్వ్యూ చేయడం స్రవంతి కెరీర్‌ను మలుపు తిప్పింది. అంతేకాదు.. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలు తీస్తే ఖచ్చితంగా నీ రిఫరెన్స్ తీసుకుంటామని సుకుమార్ చెప్పడంతో ఆమె పేరు మారుమోగింది.

ఆ తర్వాత పలు ఛానెల్స్‌లో యాంకర్‌ హోస్ట్‌గా అవకాశాలు తలుపు తట్టడంతో బిజీ అయ్యింది. ఈ దశలో ఈటీవీలో ప్రసారమయ్యే పాపులర్ కామెడీ షో జబర్దస్త్‌లో అవకాశం దక్కించుకున్న స్రవంతి .. ఈ క్రేజ్‌తోనే బిగ్‌బాస్ తెలుగు‌లో ఛాన్స్ పట్టేసింది. అయితే హౌస్‌లో అఖిల్, అజయ్‌ల చుట్టూ తిరుగుతూ నెగిటివిటీ మూట కట్టుకుని త్వరగానే ఎలిమినేట్ అయ్యింది. కానీ బిగ్‌బాస్‌లో వచ్చిన క్రేజ్‌తో సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న స్రవంతికి మంచి ఆఫర్లు వచ్చాయి.

ఓ రోజున ఆసుపత్రి బెడ్‌పై దీనంగా ఉన్న ఫోటోలనున షేర్ చేసి అభిమానులకు షాకిచ్చింది. ఆడవాళ్లు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని స్రవంతి పలు సూచనలు చేశారు. ఇక ఆరోగ్యం కుదటపడటంతో స్రవంతి చొక్కారపు డిశ్చార్జ్ అయ్యారు. ఖాళీ సమయాల్లో విహారయాత్రలు చేయడాన్ని ఇష్టపడే స్రవంతి.. గతేడాది చివరిలో మలేషియా, దుబాయ్ తదితర ప్రాంతాలను చుట్టేసింది. దైవభక్తి ఎక్కువ కావడంతో ఇంట్లో పూజలు, నోములు, వ్రతాలు చేస్తూ తీర్ధయాత్రలకు కూడా వెళ్లొస్తుంది.

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే స్రవంతి చొక్కారపు హాట్ హాట్ ఫోటో షూట్‌లతో వాటిని ఇన్‌స్టాలో షేర్ చేస్తుంటారు. తాజాగా ఎరుపు రంగు చీర కట్టుకుని ఎద అందాలను చూపిస్తూ గ్లామర్ షో చేసింది స్రవంతి. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నాయి. మరి ఇంకేందుకు ఆలస్యం స్రవంతి అందాలపై మీరూ ఓ లుక్కేయండి.

More from Filmibeat

Read more about: sravanthi chokarapu movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X