కొత్త వ్యాపారంలోకి స్టార్ యాంకర్.. గౌను నిండా నిమ్మపండ్లతో గ్లామర్ షో!
తెలుగు చిత్ర సీమలో ఒకప్పుడు ఏ సినిమా ఫంక్షన్ చూసినా సుమ కనకాల కనిపించేవారు. తన టైమింగ్, వాక్చాతుర్యం, సమయస్పూర్తితో ఈవెంట్స్‌ను నడిపించేవారు సుమ. సినిమా వాళ్లు కూడా ఆమెకే పిలిచిమరీ హోస్టింగ్ బాధ్యతలు కట్టబెట్టేవారు. ఇప్పుడు ఆ స్థానాన్ని యంగ్ యాంకర్ స్రవంతి చొక్కారపు నెమ్మదిగా ఆక్రమిస్తున్నారు. ఆమె మాటలతో పాటు సినిమాలో నటీనటుల క్యారెక్టర్‌కు తగినట్లుగా గెటప్స్ వేస్తూ ఆకట్టుకుంటోంది స్రవంతి. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే స్రవంతి తాజాగా పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.
స్రవంతి జీవితాన్ని మలుపు తిప్పిన పుష్ప
ఓ లోకల్ ఛానెల్‌లో యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేశారు స్రవంతి చొక్కారపు. తన ప్రేమ వివాహాన్ని ఇరు కుటుంబాల్లోనూ అంగీకరించకపోవడంతో ఎన్నో కష్టాలు పడింది. ఆ సమయంలో భర్త అండగా నిలవడంతో నిలదొక్కుకుంది. బాబు పుట్టాక అత్తగారి కుటుంబం దగ్గరవ్వడంతో స్రవంతి కెరీర్‌పై ఫోకస్ చేసింది. కుటుంబాన్ని చూసుకుంటూనే పలు ఆఫర్లు అందుకుంటోంది. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో ఇంటర్వ్యూతో పాటు పుష్ప రిలీజ్ సమయంలో అల్లు అర్జున్, సుకుమార్‌లతో చేసిన ఇంటర్వ్యూ స్రవంతి కెరీర్‌కి బ్రేక్ ఇచ్చింది.
జవాన్ మురళీ నాయక్ ఫ్యామిలీకి సాయం
ఈ పాపులారిటీతో పలు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్స్‌లో అవకాశాలు దక్కాయి. అలాగే బిగ్‌బాస్ తెలుగులో అవకాశం దక్కించుకుని ప్రేక్షకులకు దగ్గరయ్యారు స్రవంతి. ప్రస్తుతం సినిమా ఈవెంట్స్, ఇంటర్వ్యూలు, పలు ఛానెల్స్‌లో షోలతో బిజీగా ఉన్నారు. స్రవంతిలో మంచి మనసు కూడా ఉంది. గతేడాది విజయవాడ నగరాన్ని వరదలు ముంచెత్తినప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్‌కు లక్ష రూపాయాలు విరాళంగా అందించారు. ఇటీవల ఆపరేషన్ సిందూర్ సమయంలో అమరుడైన తెలుగు జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి వేదిక మీదే లక్ష రూపాయలు ప్రకటించి తన పెద్ద మనసు చాటుకున్నారు.

అల్లు అర్జున్ కామెంట్స్
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గద్ధర్ అవార్డ్స్ వంటి భారీ ఈవెంట్‌కు హోస్ట్ చేసి మంచి పేరు తెచ్చుకున్నారు స్రవంతి. ఆ సమయంలో తన చీరకట్టుతో ఆకట్టుకున్నారు స్రవంతి.. ఏకంగా ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ ఆమెకు కాంప్లిమెంట్ ఇచ్చారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుని మురిసిపోయింది ఈ యాంకరమ్మ. మనం ఎంతో అభిమానించే హీరో.. మన చీర బాగుందని అంటే ఈ భూమ్మీద ఆగగలమా? అని రాసుకొచ్చింది స్రవంతి. అప్పట్లో ఈ వీడియోను బన్నీ అభిమానులు తెగ షేర్ చేశారు.
నిమ్మకాయలు అమ్ముకుంటోన్న స్రవంతి
స్రవంతిలో దైవభక్తి కూడా చాలా ఎక్కువే. ప్రతి పండుగని, ఇతర పర్వదినాలను జరపడంతో పాటు నోములు, వ్రతాలను కూడా చేస్తుంటారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది స్రవంతి. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఓ బుట్ట నిండా నిమ్మపండ్లను పెట్టుకుని నిమ్మకాయలు చూపిస్తూ అందాలు ఆరబోసింది స్రవంతి. నిమ్మకాయలు ప్రింట్ చేసి ఉన్న గౌనులో పిచ్చెక్కిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇంకేందుకు ఆలస్యం స్రవంతి అందాలపై మీరూ ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications











