'అర్జెంట్‌గా పెళ్లి చేసుకోవాలనిపిస్తోంది'.. సుడిగాలి సుధీర్‌కి స్టార్ యాంకర్ ప్రపోజల్‌!

బుల్లితెర నుంచి వెండితెర వరకు తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన నటుడు, కమెడియన్ సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer). మెజీషియన్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ఆయనకు, జబర్దస్త్ షో జీవితాన్నే మార్చేసింది. ఆ షో ద్వారా 'సుడిగాలి' అనే బ్రాండ్ క్రియేట్ అయింది. ఈ క్రమంలో ఎక్స్‌ట్రా జబర్దస్త్, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి పలు షోల ద్వారా ఆయన మరింత పాపులర్ అయ్యాడు. ఈ షోలలో సింగర్, డాన్సర్, యాంకర్, కమెడియన్ లాగా తన టాలెంట్‌ను నిరూపించుకుంటూ ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. సుధీర్ బుల్లితెరపై స్టార్ కమెడియన్‌గా కొనసాగుతూనే, వెండితెరపై హీరోగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. అలాంటి సుడిగాలి సుధీర్ కు ఓ స్టార్ యాంకర్, బిగ్ బాస్ బ్యూటీ ప్రపోజల్‌ చేసింది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరు?

సుడిగాలి సుధీర్ బుల్లితెర పైనా రాణిస్తూనే అటు వెండితెర పైన హీరోగా తన ప్రయత్నాలు చేస్తున్నారు. సుధీర్ ప్రస్తుతం సర్కార్ షోను హోస్ట్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు.ఈ షో ఇప్పటికే ఆరో సీజన్‌లో కొనసాగుతోంది. బుల్లితెర సెలబ్రిటీలు, సినిమా ఆర్టిస్టులు పాల్గొంటూ షోకు మరింత ఎంటర్టైన్‌మెంట్ జోడిస్తున్నారు. ముఖ్యంగా సుధీర్ చేసే కామెడీ, అతని టైమింగ్, అతని హోస్టింగ్ స్టైల్ ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతున్నాయి. ఇలా బుల్లితెరపై తన క్రేజ్‌ను నిలబెట్టుకుంటూనే, సరైన అవకాశాల కోసం ప్రస్తుతం సుధీర్ మళ్లీ హీరోగా స్ట్రాంగ్ కంబ్యాక్‌ని అందించడానికి అభిమానులు ఆశిస్తున్నారు.

Bigg Boss fame Anchor Vishnu Priya Proposes to Sudigali Sudheer on Sarkar Show Promo Goes Viral

బుల్లితెరపై ఎప్పుడూ హాట్ టాపిక్‌గా ఉండే జోడీల్లో సుడిగాలి సుధీర్- రష్మి గౌతమ్ జంటకు ప్రత్యేక స్థానం ఉంది. వీరిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా జబర్థస్త్ వేదికగా వీరిద్దరి మధ్య జరిగిన సరదా సంభాషణలు, పులిహోర సన్నివేశాలు షోకు భారీ టీఆర్‌పీ తీసుకువచ్చాయి. అదే సమయంలో ఈ జంట నిజంగానే రిలేషన్‌లో ఉన్నారనే ప్రచారం కూడా జోరుగా సాగింది. అయితే, సుధీర్ జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ జోడీ మధ్య దూరం పెరిగింది. అయినప్పటికీ, ఎప్పుడైనా రష్మి పేరు వస్తే సుధీర్ సిగ్గుపడటం, అలాగే రష్మి రియాక్షన్స్ ఇవ్వడం చూసి ఇంకా వీరి మధ్య ఏదో ఉందనే అభిప్రాయం అభిమానుల్లో కనిపిస్తూనే ఉంది.

ఇక ప్రస్తుతం సర్కార్ (Sarkar)షోలో హోస్ట్‌గా రాణిస్తున్న సుధీర్‌కు తాజాగా మరో ఆసక్తికర సంఘటన ఎదురైంది. ఈ షోలో రఘు మాస్టర్-ప్రణవి, యష్ మాస్టర్-వర్ష లు పాల్గొన్నారు. వారికి ఈ కెమిస్ట్రీని చూసిన సుధీర్ కో- యాంకర్ విష్ణు ప్రియ (Vishnu Priya) ఒక్కసారిగా ఓపెన్ కామెంట్ చేసింది. 'వాళ్లని చూస్తుంటే నాకు అర్జెంట్‌గా పెళ్లి చేసుకోవాలనిపిస్తోంది... సుధీర్, నువ్వేమంటావ్?" అంటూ స్టేజ్‌పైనే ప్రశ్నించడంతో సుధీర్ షాక్ అయ్యాడు. ఆ పరిస్థితిని తన కామెడీ టైమింగ్‌తో హ్యాండిల్ చేస్తూ 'ప్యాకప్' అంటూ చెప్పడంతో షోలో నవ్వులు పూశాయి.

అక్కడితో ఆగకుండా విష్ణు ప్రియ మరోసారి సుధీర్‌ను ఇరుకున పెట్టింది. రఘు మాస్టర్ కోసం ప్రణవి పాట పాడిన తర్వాత, "నువ్వు కూడా నాకు ఒక పాట డెడికేట్ చేయాలి" అని అడిగింది. దీనికి సుధీర్ తనదైన స్టైల్లో "రాత్రి అయినా నాకు ఓకే" అంటూ సరదాగా పాట పాడటంతో అందరూ నవ్వుల్లో మునిగిపోయారు. విష్ణు ప్రియ కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ నవ్వేసింది. ఈ ఎపిసోడ్‌లో మరో హైలైట్ ఏమిటంటే, రఘు మాస్టర్, యష్ మాస్టర్ తమ పెళ్లి జీవితంలోని అనుభవాలను షేర్ చేయడం. ఇంట్లో భార్యలతో ఎదురయ్యే పరిస్థితులను చెప్పడంతో, సుధీర్ దాన్ని "హర్రర్ సినిమా చూస్తున్నట్టుంది" అంటూ కామెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది. అంతేకాదు, "నాకు ఈ మ్యారేజ్ లైఫ్ అవసరం లేదు" అంటూ షాకింగ్ స్టేట్ మెంట్ ఇచ్చేశారు.

ప్రస్తుతం విడుదలైన సర్కార్ సీజన్ 6 లేటెస్ట్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఈ ఎపిసోడ్‌లో సుధీర్ - విష్ణు ప్రియ మధ్య జరిగిన ఫన్, కామెడీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆశ్చర్యకరంగా, ఒకప్పుడు టాప్‌లో ఉన్న సుధీర్ - రష్మి జోడీకి బదులుగా ఇప్పుడు సుధీర్ -విష్ణు ప్రియ జోడీపై ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్టు కనిపిస్తోంది. ఇదిలా ఉంటే.. ఇటీవల విష్ణు ప్రియ పేరు వార్తలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ అమ్మడు తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వేదిక అసభ్యకర ఫోటోలు షేర్ డబ్బులు వసూళ్లు చేస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X