విష్ణుప్రియ ఇన్ని కష్టాలు పడిందా? వైరల్ అవుతోన్న వీడియో

జీవితం ఎవరికీ పూల పాన్పు కాదు.. ఎవడి సరదా వాడికి తీర్చేస్తుందని డైరెక్టర్ పూరీ జగన్నాథ్ అంటూ ఉంటారు. ఎవరి దాకా వస్తేనే కానీ అదేంటో తెలియదు. సినీ తారలు, సెలబ్రెటీల జీవితాలు బాగున్నాయని, లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారని అందరూ అనుకుంటారు. కానీ దీని వెనుక ఎంతో కష్టం, ఎన్నో నిద్రలేని రాత్రులు, అవమానాలు, కన్నీళ్లు, పస్తులు ఉంటాయి. వాటన్నింటినీ తట్టుకుని నిలబడి జీవితాన్ని వాళ్లంతా సాధించారు. మెగాస్టార్ చిరంజీవి, రవితేజ, నాని సహా ఇలా మన ముందు కనిపించే తారల వెనుక ఎన్నో గాథలున్నాయి. ఈ కోవలోకే వస్తారు స్టార్ యాంకర్ విష్ణుప్రియ.

ముఖంపై చెరగని చిరునవ్వు, అందం, చలాకీతనంతో ఉండే విష్ణుప్రియ జీవితం మొత్తం కష్టాల మయమే. 1986 ఫిబ్రవరి 22న ప్రకాశం జిల్లాలో జన్మించారు విష్ణుప్రియ. ఆమెకు చెల్లెలు పావని ఉన్నారు. చిన్నతనం నుంచి చదువులో, ఆటపాటల్లో చురుగ్గా ఉండే విష్ణుప్రియ.. స్కూల్‌లో కూడా కల్చరల్ ఈవెంట్స్‌లో పాల్గొని బహుమతులు గెలుచుకున్నారు. ఈమెకు మూడేళ్ల వయసున్నప్పుడే తల్లిదండ్రులు విడిపోయారు. దీంతో తల్లి దగ్గరే ఆమె పెరిగారు.

Bigg Boss Fame anchor Vishnupriyaa bhimeneni struggles in her personal life

నాగేంద్ర అనే అసోసియేట్ డైరెక్టర్‌తో పరిచయం కారణంగా తమిళంలో శివప్పతి గారమ్ అనే మూవీలో ఛాన్స్ ఇప్పించాడు. ఈ దశలో ఎస్ఎస్ రాజమౌళి- ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన యమదొంగలో ఛాన్స్ దక్కినా పెద్దగా గుర్తింపు రాలేదు. గూలీ అనే కన్నడ సినిమాలోనూ విష్ణుప్రియ నటించారు. అయినా అవకాశాల కోసం ఎంతో శ్రమించారు. ఈ క్రమంలో యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్స్ చేసింది. పెళ్లిచూపులు, మెన్ విల్ బి మెన్, వైఫ్ ఆఫ్ కరుణ, యెల్లో, సోడాబుడ్డీ, ఇండియన్స్ ఏజ్ 25 వంటి షార్ట్ ఫిల్మ్స్‌లో నటించింది. అయినా నిరాశే ఎదురైంది. ఈ దశలో 2017లో ఈటీవీ ప్లస్ ఛానెల్ కోసం మల్లెమాల పోవే పోరా అనే కొత్త ప్రోగ్రామ్ కోసం జరిగిన ఆడిషన్స్‌లో ముగ్గురు అమ్మాయిలను దాటుకుని విష్ణుప్రియనే అదృష్టం వరించింది.

2017లో ఈటీవీలో టెలికాస్ట్ అయిన పోవే పోరాను విష్ణుప్రియ అద్భుతంగా హోస్ట్ చేశారు. ఈ షో ద్వారా విష్ణుప్రియ తెలుగు జనాలకు బాగా దగ్గరయ్యారు. కానీ మరే షోకు విష్ణుప్రియ యాంకర్‌గా ఎంపిక కాకపోవడం ఆశ్చర్యపరిచింది. కొద్దిరోజుల క్రితం ఆమె తల్లి కన్నుమూయడంతో విష్ణుప్రియ డిప్రెషన్‌లోకి వెళ్లారు. అవకాశాలు దొరక్కపోవడంతో బిగ్‌బాస్ ఫేం మానస్ నాగులపల్లితో కలిసి జరీ జరీ పంచె కట్టు అనే ప్రైవేట్ సాంగ్ చేసింది. మా టీవీలో ప్రసారమైన కిరాక్ బాయ్స్- ఖిలాడీ గర్ల్స్‌లో మంచి మార్కులు కొట్టేసిన విష్ణుప్రియ .. ఆ ఫేమ్‌తోనే బిగ్‌బాస్ తెలుగు 8లోనూ అవకాశం దక్కించుకుంది. అలాగే తండ్రి ప్రేమను కూడా తిరిగి పొందింది.

Bigg Boss Fame anchor Vishnupriyaa bhimeneni struggles in her personal life

ఒకానొక దశలో చేతిలో డబ్బు లేకపోవడంతో తిండి తినని రోజులు కూడా ఉన్నాయని విష్ణుప్రియ పలుమార్లు చెప్పారు. కొన్ని షోల సమయంలో బాగా సన్నగా కనిపించడానికి కారణం తిండి తినకపోవడమేనట. బ్రాహ్మణ కుటుంబం నుంచి రావడంతో భారతీయ సంస్కృతి , సాంప్రదాయాలు, సనాతన ధర్మం, వేదాలు, పురాణాలపై విష్ణుప్రియకు చిన్నప్పటి నుంచి పట్టుంది. తాతగారు ఆమెకు భగవద్గీత శ్లోకాలు నేర్పించేవారు.

ఈ కారణంగానే డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే పిల్లలకు భగవద్గీత శ్లోకాలు నేర్పిస్తూ పాకెట్ మనీ సంపాదించుకునేవారట. దీనికి సంబంధించిన పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో తాను భగవద్గీతను బోధిస్తానని.. తనను సంప్రదించాలని అనుకుంటే లింక్ క్లిక్ చేయాలని స్వయంగా తనను తాను ప్రమోట్ చేసుకున్నారు విష్ణుప్రియ. దీంతో నెటిజన్లు ఆమె కష్టాలు చూసి మీరు గ్రేట్ మేడం అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X