ఈ క్షణమైనా చనిపోవడానికి సిద్దమే.. అందుకే పేరు మార్చుకున్న అంటున్న బిగ్ బాస్ బ్యూటీ
బిగ్‌బాస్ బ్యూటీ, తెలుగు హాట్ యాంకరమ్మ అరియానా గ్లోరీ (Ariyana Glory) మరోసారి వార్తల్లో నిలిచింది. టిక్‌టాక్ వీడియోలు, రీల్స్‌తో మొదట గుర్తింపు తెచ్చుకున్న అరియానా... బిగ్‌బాస్ షోలో పాల్గొనడం ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. బిగ్‌బాస్ తర్వాత సోషల్ మీడియాలో హాట్ ఫొటోషూట్స్‌తో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ యాంకర్, ప్రస్తుతం పలు టీవీ షోలు, వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీగా కొనసాగుతోంది. తాజాగా అరియానా గ్లోరీ 'కిసిక్ టాక్' అనే షోలో పాల్గొని తన వ్యక్తిగత జీవితం, కెరీర్ ప్రయాణం, ఎదుర్కొన్న కష్టాలు గురించి ఎమోషనల్‌గా మాట్లాడింది. యాంకర్ వర్షా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షోలో అరియానా మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
షో ప్రారంభంలోనే అరియానాకు ఇచ్చిన ఎలివేషన్ కాస్త అతిగా ఉందంటూ ఆమె సరదాగా రియాక్ట్ కావడం అందరినీ ఆకట్టుకుంది. ఆ ఎలివేషన్‌ను ఇమిటేట్ చేస్తూ 'నేను తట్టుకోలేకపోతున్నా' అంటూ అరియానా చేసిన కామెంట్స్ షోలో హైలైట్‌గా నిలిచాయి. అనంతరం వర్షా అడిగిన 'నీ రియల్ నేమ్ అరియానా నైనా?' అనే ప్రశ్నకు... 'కాదు, నా అసలు పేరు అర్చన'అంటూ అరియానా అసలు నిజాన్ని బయటపెట్టింది. పేరు చాలా బాగుందన్న వర్షా వ్యాఖ్యకు స్పందిస్తూ... 'పేరు బాగుంది కానీ, కష్టాలు కూడా అలాగే ఎక్కువగా ఉన్నాయి. అందుకే పేరు మార్చుకున్నాను'అంటూ తన జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను ఎమోషనల్‌గా వెల్లడించింది.

యాంకరింగ్ ఫీల్డ్‌లోకి ఎలా వచ్చావని అడిగిన ప్రశ్నకు అరియానా ఆసక్తికరంగా స్పందించింది. 'లైఫ్‌లో జరగాల్సింది ముందే రాసి పెట్టి ఉంటుంది. అలా ఒక రోజు నేను, నా చెల్లి కలిసి టీవీ చూస్తుంటే యాంకర్స్ కావాలన్న ప్రకటన వచ్చింది. వెంటనే ఆడిషన్స్‌కు ట్రై చేశాను. అక్కడి నుంచి చిన్న చిన్న అవకాశాలతో ఈ స్థాయికి వచ్చాను'అంటూ తన కెరీర్ తొలి రోజుల్లో ఎదుర్కొన్న కష్టాలను గుర్తు చేసుకుంది.
ఇక అరియానా అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఆర్జీవి ఇంటర్వ్యూయేనని వర్షా వ్యాఖ్యానించగా... 'ఆర్‌జీవీ గారిని ఇంటర్వ్యూ చేయడం దేవుడు ఇచ్చిన వరంగా భావిస్తాను. అప్పటివరకు నేను లైఫ్‌లో ఏం సాధిస్తానో కూడా తెలియదు. అలాంటి సమయంలో ఆ ఇంటర్వ్యూ నాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది'అంటూ భావోద్వేగంగా చెప్పింది. ఈ గుర్తింపు నీకు సంతోషం ఇచ్చిందా అని వర్షా అడగగా... 'ఏంటి అలా మాట్లాడుతున్నావ్? ఒకానొక సమయంలో నేను కేవలం 1800 రూపాయల జీతానికి పనిచేశాను. అలాంటిది ఇప్పుడు బెటర్ పొజిషన్‌లో ఉన్నాను' అంటూ తన జీవిత మార్పును వివరించింది.
ఇటీవల మహిళల డ్రెస్సింగ్‌పై జరుగుతున్న చర్చలపై కూడా అరియానా స్పందించింది. హీరో శివాజీ చేసిన వ్యాఖ్యల గురించి ప్రశ్నించగా... 'శివాజీ గారు చెప్పింది కరెక్టే. ఆయన వాడిన పదాలు తప్పు కావచ్చు కానీ ఆయన అభిప్రాయం మాత్రం కరెక్టే' అంటూ శివాజీకి మద్దతుగా మాట్లాడింది. ఈ కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
తాను ఏ దేవుణ్ణి నమ్ముతావన్న ప్రశ్నకు అరియానా ఆసక్తికర సమాధానం ఇచ్చింది. 'నేను క్రిస్టియన్‌లా పెరిగాను. కానీ ఈ మధ్య ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తున్నాను' అంటూ తన ఆధ్యాత్మిక విశ్వాసాల గురించి చెప్పింది. 'నీకు ఇష్టమైన సుబ్రహ్మణ్య స్వామి ప్రత్యక్షమై వరం కోరుకోమంటే ఏం అడుగుతావు?'అన్న ప్రశ్నకు... 'దేవుడు ప్రత్యక్షమైతే... నన్ను వెంటనే తన దగ్గరకు తీసుకెళ్లమని అడుగుతాను' అంటూ షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. వర్షా ఆశ్చర్యంతో స్పందించగా... 'నేను సీరియస్‌గా చెబుతున్నా. దేవుడే వచ్చి అడిగితే ఇంకేం కావాలి? నేను ఈ క్షణమైనా చనిపోవడానికి సిద్ధమే' అంటూ అరియానా చెప్పిన మాటలు అక్కడున్నవారిని ఎమోషనల్ చేశాయి.
ఈ మాటలతో యాంకర్ వర్షా కూడా భావోద్వేగానికి లోనయ్యింది. ప్రస్తుతం ఈ షోకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అరియానా చేసిన ఈ షాకింగ్ కామెంట్స్ ఆమె అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా ఆలోచింపజేస్తున్నాయి. ఆమె మాటల్లో దాగి ఉన్న భావోద్వేగాలు, జీవిత అనుభవాలు ఇప్పుడు నెట్టింట పెద్ద చర్చకే దారి తీస్తున్నాయి.


Click it and Unblock the Notifications











