బిగ్ బాస్ బ్యూటి అరియానా ఓవర్ షో.. కిచెన్‌లో అలాంటి డ్రెస్సుతో ఉందేంటి!
సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ ద్వారా సోషల్ మీడియాలో మంచి క్రేజ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మల్లో క్యూట్ బ్యూటి అరియానా గ్లోరి ఒకరు. ఆర్జీవీ ప్రశంసలతో ఒక్కసారిగా సెన్సేషన్ గా మారిన ఈ బ్యూటి ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ ద్వారా మరింత క్రేజ్ తెచ్చుకుంది. ఫలితంగా తర్వాతి బిగ్ బాస్ సీజన్ లో పార్టిస్ పేట్ చేయడమే కాకుండా.. బీబీకి సంబంధించిన టీవీ షోలలో పాల్గొంటూ ఆకట్టుకుంటోంది. అలాగే సోషల్ మీడియాలో అదిరిపోయే అందాలతో నెటిజన్లకు ఐ ట్రీట్ ఇచ్చే ఈ చిన్నది వంటింట్లో ఊహించని విధంగా గ్లామర్ షో చేసింది.
అలాంటి ఆన్సర్స్:హైదరాబాద్‌లో మొదట చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఆ తర్వాత యూట్యూబ్ యాంకర్ గా మారింది అందాల భరిణ ఆరియానా గ్లోరి. యాంకర్ గా కెరీర్ లో ఎదుగుతున్న సమయంలోనే అరియానాకు ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఆర్జీవికి తగిన విధంగా బోల్డ్ ఆన్సర్స్ ఇచ్చి ప్రేక్షకులను అట్రాక్ట్ చేసింది ఈ బ్యూటి.

అంతా ఆసక్తి చూపి:ఆర్జీవీ ఇంటర్వ్యూ తర్వాత అరియానా గ్లోరి పేరు ఒక్కసారిగా మారుమోగిపోయింది. తనలాంటి బోల్డ్ వుమెన్ ని చూడలేదని, బోల్డ్ ఆన్సర్స్ కి తడబడకుండా ఇంటర్వ్యూ చేసినట్లుగా రామ్ గోపాల్ వర్మ వంటి దర్శకుడు మాట్లాడటంతో అంతా ఆసక్తి చూపారు. దీంతో ఈ అరియానా గ్లోరి ఎవరా అని నెటిజన్లు వెతకడం మొదలుపెట్టారు. అలా తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయిపోయింది ఈ క్యూటీ.
ఫినాలేలోకి ఎంట్రీ:అరియానా గ్లోరికి వచ్చిన పాపులారిటీతో బిగ్ బాస్ హౌజ్ మెట్లు ఎక్కే అవకాశాన్ని అందుకుంది. బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్‌లో అడుగు పెట్టిన ఈ బ్యూటి బోల్డ్‌నెస్‌తో పాటు అద్భుతమైన ఆటతీరుతో అలరించింది. ముక్కుసూటిగా ఉంటూ ప్రేక్షకుల మన్ననలు పొందింది. అంతేకాకుండా ఫినాలేలోకి ఎంట్రీ ఇచ్చి నాలుగో స్థానంతో సత్తా చాటింది క్యూట్ భామ అరియానా గ్లోరి.

ఫుల్ బిజీగా:బిగ్ బాస్ హౌజ్ లో అందాలతోపాటు బోల్డ్ మాటలతో అట్రాక్ట్ చేసిన అరియానా గ్లోరికి మరింత పాపులారిటీ వచ్చేసింది. ఈ క్రేజ్ ను వాడుకుంటూ తనదైన స్టైల్ లో దూసుకుపోతోంది క్యూట్ బ్యూటి. ఇందులో భాగంగానే ఈ అమ్మడు వరుసగా ఆఫర్లను కూడా అందుకుంది. చాలా కాలం పాటు పలు షోలు, ఈవెంట్లు, ప్రారంభోత్సవాలతో ఫుల్ బిజీగా గడిపింది అరియానా గ్లోరి.

సత్తా చాటుతున్న బ్యూటి:ఈ క్రమంలోనే పలు సినిమాలు కూడా చేసింది ముద్దుగుమ్మ అరియానా గ్లోరి. రాజ్ తరుణ్, కల్యాణ్ దేవ్ నటించిన సినిమాల్లో యాక్ట్ చేసింది ఈ బోల్డ్ బ్యూటి. అయితే మరోసారి అదే బిగ్ బాస్ లో అవకాశం సాధించుకున్న ఈ వయ్యారి ఓటీటీ సీజన్ లో మరోసారి అదరగొట్టింది. అలాగే బీబీ కేఫ్ కి హోస్ట్ గా చేయడం, బీబీ జోడీలో కంటెస్టెంట్ గా అలరించి సత్తా చాటింది.
బోర్ కొట్టేసిందా?:ఇలా షోలతోపాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటోన్న అరియానా గ్లోరి ఓవర్ డోస్ గ్లామర్ ఫొటోలతో పిచ్చెక్కిస్తోంది. తాజాగా పింక్ కలర్ టీ షర్ట్ వేసుకున్న అరియానా గ్లోరి కిచెన్ లో కూర్చుని పోజు ఇచ్చింది. ఇందులో ఆమె లెగ్స్ అందాలు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్ నెట్టింట్లో వైరల్ కాగా.. 'వంటింట్లో ఇలా కూడా ఉంటారా', 'ప్యాంట్ మర్చిపోయినట్లుంది', 'శారీ అప్పుడే బోర్ కొట్టేసిందా?', 'ఆఫర్ల కోసమే కదా ఇదంతా' అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











