ఆరియానా గ్లోరీ ఆత్మహత్యాయత్నం.. ఆ ప్రాబ్లమ్స్ వల్లే అంటూ రాసి మరీ!

తెలుగు అమ్మాయిలు అంటే సైలెంట్‌గా, పద్దతిగా ఉంటారు అనే టాక్ ఉండేది. కానీ, కొందరు భామలు మాత్రం బోల్డు యాటిట్యూడ్‌తో హైలైట్ అవుతున్నారు. అలాంటి వారిలో ఆరియానా గ్లోరీ ఒకరు. యూట్యూబ్ యాంకర్‌గా కెరీర్‌ను మొదలు పెట్టిన ఈ చిన్నది.. చాలా తక్కువ సమయంలోనే సెన్సేషన్ అయింది.

బిగ్ బాస్ షో ద్వారా బిగ్ సెలెబ్రిటీ అయింది. అప్పటి నుంచి వరుసగా ఆఫర్లను అందుకుంటోంది. ఇక, సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉండే ఆరియానా గ్లోరీ.. తాజాగా ఓ షాకింగ్ వీడియోను షేర్ చేసింది. దానిపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి!

Bigg Boss Fame Ariyana Glory Latest Instagram Reel Gone Hot Topic

వర్మ చేసిన రచ్చతోనే
యూట్యూబ్ యాంకర్‌గా కెరీర్‌ను మొదలు పెట్టిన ఆరియానా గ్లోరీ.. ఓ సందర్భంలో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసింది. ఆ సమయంలో ఇద్దరూ కలిసి పెద్ద రచ్చ చేశారు. ఈ వీడియోను వర్మ షేర్ చేయడంతో ఆరియానా సెన్సేషన్ అయింది. దీంతో ఈ బ్యూటీ పేరు మారుమ్రోగిపోయింది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిపోయింది.

బిగ్ బాస్‌ షోతో స్టార్‌గా

ఒక్క వీడియోతో యమ హైలైట్ అయిన బోల్డు బ్యూటీ ఆరియానా గ్లోరీకి బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో ఆఫర్ దక్కింది. అందులోకి ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చిన ఈ భామ.. డేరింగ్ అండ్ డాషింగ్ గేమ్‌తో ఆకట్టుకుంది. ఆ తర్వాత కూడా ఈ అమ్మడు పలుమార్లు బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్‌గా, హోస్టుగా చేసింది. దీంతో ఆరియానా గ్లోరీ ఫుల్ పాపులర్‌ అయిపోయింది.

Bigg Boss Fame Ariyana Glory Latest Instagram Reel Gone Hot Topic

ఇప్పుడు తగ్గిన ఆఫర్లు
బిగ్ బాస్ షోలలో వచ్చిన అవకాశాల వల్ల ఆరియానా గ్లోరీ క్రేజ్ రెట్టింపు అయింది. దీంతో ఆమె వరుసగా ఎన్నో షోలు, సినిమాలు చేసింది. అంతేకాదు, కొద్ది రోజుల క్రితమే 'బీబీ జోడీ' షోలో అవినాష్‌తో కలిసి డ్యాన్స్ చేసింది. ఇందులో అదరగొట్టేసిన ఈ జోడీ ఫస్ట్ సీజన్‌లో రన్నరప్‌‌ అయింది. దీని తర్వాత నుంచి ఆమె పెద్దగా అవకాశాలను అందుకుంటున్నట్లు కనిపించట్లేదు.

అందులో ఫుల్ బిజీగా

నిజానికి ఆరియానా గ్లోరీ సోషల్ మీడియా వల్లనే సుపరిచితురాలు అయింది. అందుకే ఇందులో ఈ అమ్మడు ఎప్పటికప్పుడు మరింత హడావిడి చేస్తోంది. ఈ క్రమంలోనే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను వదులుతూ తన ఫాలోవర్లను అలరిస్తూ ముందుకు సాగిపోతోంది.

Bigg Boss Fame Ariyana Glory Latest Instagram Reel Gone Hot Topic

సూసైడ్ చేసుకునేలా
సోషల్ మీడియాలో ఎన్నో ఏళ్లుగా రచ్చ చేస్తోన్న బోల్డు లేడీ ఆరియానా గ్లోరీ.. అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్ ఇస్తూ రెచ్చగొడుతోంది. అదే సమయంలో డిఫరెంట్ వీడియోలను కూడా షేర్ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్నట్లుగా క్రియేట్ చేసిన ఓ రీల్‌ను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇది ఇప్పుడు సంచలనంగా మారిపోయింది.

ట్విస్ట్ ఇచ్చిన బ్యూటీ

తాజాగా షేర్ చేసిన వీడియోలో ఆరియానా గ్లోరీ ఫ్యాన్స్‌కు క్లాత్ కట్టి ఉరి వేసుకుంటున్నట్లు కనిపించింది. అప్పుడే తన ఫ్రెండ్ వస్తుంది. ఆ తర్వాత ఆమె హ్యాండ్ బ్యాగ్‌లో నుంచి నెయిల్ పాలీష్ తీసి చూపిస్తుంది. అప్పుడు సూసైడ్ చేసుకునే ఆరియానా.. కిందకు వచ్చేసి నెయిల్ పాలీష్ వేసుకుంటుంది. ఇందులో 'మా ప్రాబ్లమ్స్ మీకేం తెలుసు' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది.

తిట్టిపోస్తున్న ఫ్యాన్స్
ఆరియానా గ్లోరీ తాజాగా షేర్ చేసిన సూసైడ్ రీల్‌ క్షణాల్లోనే వైరల్‌గా మారిపోయింది. ఇక, దీనిపై నెటిజన్లు భారీగానే స్పందిస్తున్నారు. ముఖ్యంగా కొందరైతే ఆమె చేసిన పనికి తిట్టిపోస్తున్నారు. ఇలాంటి వీడియోలు ఎందుకు చేస్తున్నావంటూ విమర్శలు చేస్తున్నారు. మొత్తానికి ఆరియానా గ్లోరీ ఫన్నీగా చేసిన ఈ వీడియో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X