తొలిసారి బికినీలో ఆరియానా ట్రీట్.. శృతిమించిన ఫోజులతో అరాచకం
తెలుగు రాష్ట్రాల నుంచి ఈ మధ్య కాలంలో ఎంతో మంది అమ్మాయిలు సినీ రంగంలోనో, బుల్లితెరపైనో అవకాశాలను సొంతం చేసుకుంటున్నారు. అలాంటి వారిలో బోల్డు లేడీ ఆరియానా గ్లోరీ ఒకరు. బిగ్ బాస్ షో ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ అమ్మడు.. చాలా తక్కువ సమయంలోనే సెన్సేషన్ అయిపోయింది. ఫలితంగా వరుసగా అవకాశాలను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆరియానా ఓ రేంజ్‌లో రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ బ్యూటీ కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరే చూడండి!
వర్మ వల్ల సంచలనంగా:యూట్యూబ్‌లో యాంకర్‌గా ఆరియానా గ్లోరీ కెరీర్‌ను ప్రారంభించింది. ఇందులో ఎంతో మంది ప్రముఖులను ఇంటర్వ్యూ చేసిన ఆమె.. ఓ సందర్భంలో రాంగోపాల్ వర్మతో చిట్ చాట్ చేసింది. అప్పుడు ఆమె మాటలను వర్మ హైలైట్ చేశాడు. దీంతో ఆరియానా ఒక్కసారిగా వెలుగులోకి రావడంతో పాటు సంచలనం అయింది. దీంతో ఆమె తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఫేమస్‌గా మారింది.

బిగ్ బాస్‌తో ఫుల్లు క్రేజ్:యాంకర్‌గా హైలైట్ అయిన ఆరియానాకు బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశం దక్కింది. అందులోకి ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చిన ఈ భామ.. దూకుడుగానే గేమ్ ఆడి ఆకట్టుకుంది. ముఖ్యంగా టాస్కుల్లో ఇరగదీసేసిన ఆరియానా గ్లోరీ.. ఏకంగా గ్రాండ్ ఫినాలేలోకి సైతం వెళ్లింది. కానీ, అందులో ఓడిపోయింది. కానీ, క్రేజ్‌ను మాత్రం భారీగా పెంచుకుంది.
ఎన్నో అవకాశాలిచ్చేసి:బిగ్ బాస్ షో ద్వారా ఆరియానా గ్లోరీకి ఫుల్ నేమ్ వచ్చింది. ఫలితంగా పలు చిత్రాల్లోనూ ఆమెకు మంచి రోల్స్ వచ్చాయి. ఆ తర్వాత బిగ్ బాస్ బజ్ హోస్టుగానూ ఈ చిన్నది వర్క్ చేసింది. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితమే 'బీబీ జోడీ' షోలో అవినాష్‌తో కలిసి డ్యాన్స్ చేసింది. ఇందులో మెప్పించిన ఈ జోడీ ఫస్ట్ సీజన్‌లో రన్నరప్ అయింది. ఫలితంగా మరింత హైలైట్ అయింది.

అందులో యమ బిజీ:ఆరియానా గ్లోరీ సోషల్ మీడియా ద్వారానే వెలుగులోకి వచ్చింది. అందుకే ఇందులో ఈ అమ్మడు ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటోంది. అంతేకాదు, దీని ద్వారా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఆరియానా గ్లోరీ ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను షేర్ చేసుకుంటోంది. దీంతో ఆమె ఫాలోయింగ్ మరింతగా పెరిగిపోతూనే ఉంది.
బొద్దుగుమ్మగా హాట్ షో:సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా ఓ రేంజ్‌లో రెచ్చిపోతోన్న బోల్డు లేడీ ఆరియానా.. అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ సెన్సేషన్ అవుతోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తరచూ తన హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. ఈ మధ్య కాస్త బొద్దుగా మారినా కూడా ఆరియానా గ్లోరీ.. తరచూ క్లీవేజ్, నాభి, థైస్‌లను చూపిస్తూ తెలుగు కుర్రాళ్లను ఓ రేంజ్‌లో కవ్విస్తోంది.

తొలిసారి బికినీ ట్రీట్:తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆరియానా గ్లోరీ కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె తొలిసారిగా టూ పీస్ బికినీ ధరించి రెచ్చిపోయింది. వీటిలో ఈ అమ్మడు విపరీతంగా క్లీవేజ్, నాభి, థైస్ అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది. దీంతో ఈ హాట్ పిక్స్‌కు నెటిజన్ల నుంచి భారీ స్పందన వస్తోంది. తద్వారా ఆరియానా గ్లోరీ షేర్ చేసిన ఫొటోలు తెగ వైరల్‌గా మారాయి.

నెటిజన్లు విమర్శలు:ఆరియానా గ్లోరీ తాజాగా షేర్ చేసిన బోల్డు ఫొటోలపై నెటిజన్లు దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. 'నిన్ను బిగ్ బాస్‌లో ఉన్నప్పుడు ఎంకరేజ్ చేసినందుకు మా చెప్పుతో మేము కొట్టుకోవాలి', 'నీ వల్ల ఎవరికి ఉపయోగం లేదు', 'నువ్వు ఇలా అవుతావని అస్సలు అనుకోలేదు. ఛీ ఈ ఫొటోలను డిలీట్ చెయ్' అని కొందరు కామెంట్లు చేశారు. మరికొందరు బూతులు తిడుతున్నారు.


Click it and Unblock the Notifications











