తెల్లచీరలో చేతిలో మందు బాటిల్ .. రొమాంటిక్ ఫోజుల్లో బిగ్‌బాస్ బ్యూటీ అరాచకం
బిగ్‌బాస్ రియాలిటీ షోతో పాపులరైన వారిలో ఎంతో మంది సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని సెలబ్రెటీలుగా మారుతున్నారు. ఈ లిస్ట్‌లోకే వస్తారు అరియానా గ్లోరీ కూడా. ఓ సాధారణ యాంకర్‌గా ఉన్న ఆమెను సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్టార్‌ను చేసేశారు. ఆయనతో చేసిన ఇంటర్వ్యూ అరియానా లైఫ్‌నే మార్చేసింది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే అరియానా తాజాగా పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..
ఆర్జీవీ ఇంటర్వ్యూతో స్టార్‌డమ్
హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన అరియానా గ్లోరీ గ్రాడ్యుయేషన్ తర్వాత ఓ తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్‌లో యాంకర్‌గా కెరీర్ ప్రారంభించారు. ఈ క్రమంలో ఆర్జీవీతో ఇంటర్వ్యూ చేసి ఆయన అభిమానాన్ని పొందారు. తనకు అరియానా అంటే చాలా ఇష్టమని వర్మ ట్వీట్ చేయడంతో తెలుగునాట ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది. పలు ఛానెళ్లలో హోస్ట్‌గా పనిచేసిన అరియానా.. యూట్యూబ్‌లో పలువురు సెలబ్రెటీలు, టిక్‌టాక్ స్టార్లను ఇంటర్వ్యూ చేసింది. అందంతో పాటు సమయస్పూర్తి మెండుగా ఉండటంతో అరియానా యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యింది.

బిగ్‌బాస్‌లో సంచలనం
ఈ పాపులారిటీతో బిగ్‌బాస్ 4 తెలుగులో అవకాశం దక్కించుకుంది అరియానా గ్లోరీ. సయ్యద్ సోహైల్‌తో కలిసి సీక్రెట్ రూమ్‌లోకి వెళ్లి కలకలం రేపింది ఈ ముద్దుగుమ్మ. బోల్డ్ కామెంట్స్‌తో పాటు డిస్కషన్స్‌లో బలంగా తన వాదన వినిపించడం, దూకుడైన ఆటతీరుతో ఆకట్టుకుంది. టాస్క్‌లలో ఆమె పోరాటం బాగున్నప్పటికీ పలు వివాదాల్లో దూరి కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా నిలిచింది అరియానా. ఒక దశలో బిగ్‌బాస్‌లో ఆమె ఏం చేసినా సెన్సేషన్ అయ్యింది. ముక్కు అవినాష్‌తో క్లోజ్‌గా ఉండటంతో వీరిద్దరి మధ్య ప్రేమాయాణం సాగిందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.
ఫినాలే వరకు జైత్రయాత్ర
పలుమార్లు ఎలిమినేషన్లు తప్పించుకుని, టాప్ కంటెస్టెంట్స్ అన్నవాళ్లను పక్కకినెట్టి ఏకంగా గ్రాండ్ ఫినాలే వరకు చేరుకుంది. అయితే నాలుగో స్థానంతో సరిపెట్టుకుని మొత్తంగా 105 రోజుల పాటు బిగ్‌బాస్‌లో కొనసాగింది. ఇందుకు గాను రోజుకు రూ.20 వేలు చొప్పున రూ.21 లక్షలను ఇంటికి పట్టికెళ్లింది. ఒకప్పుడు రూ.500 కోసం కూడా ఎంతో కష్టపడ్డ ఈ అమ్మడు .. బిగ్‌బాస్‌తో తన ఆర్ధిక సమస్యలను అధిగమించడంతో పాటు ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది.
చేతిలో మందు బాటిల్‌తో
ఆ తర్వాత కొత్త కారు కొని అభిమానులకు ఆ ఫోటోలను షేర్ చేసింది. తన ఫ్రెండ్స్ సోహైల్, అమర్‌దీప్‌లతో కలిసి ఫస్ట్ రైడ్‌కి వెళ్లింది. బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాక కొన్నాళ్లు బిగ్‌బాస్ బజ్‌కు హోస్ట్‌గా పలువురు కంటెస్టెంట్స్‌ని ఇంటర్వ్యూలు చేసింది. తీరిక వేళల్లో బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్స్ తన స్నేహితులైన రాహుల్ సిప్లిగంజ్, అషురెడ్డిలతో కలిసి వెకేషన్‌లకు వెళ్లేది. పెద్దలు కుదిర్చిన పెళ్లి కంటే ప్రేమ వివాహామే ఇష్టమని మొన్నామధ్య బాంబు పేల్చింది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే అరియానా గ్లోరీ.. ఎప్పటికప్పుడు తన ఫోటోలు, వీడియోలతో పాటు ఇతర సంగతులను పంచుకుంటూ ఉంటారు. తాజాగా తెల్ల చీర కట్టుకుని చేతిలో మందు బాటిల్ పెట్టుకుని రొమాంటిక్ ఫోజుల్లో పిచ్చెక్కించింది అరియానా. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. మరి ఇంకేందుకు ఆలస్యం.. అరియానా అందాలపై ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications











