ఆ ప్రేమ చచ్చిపోయింది.. ప్రాణంగా ప్రేమిస్తే అలాంటి గతి... బిగ్‌బాస్ స్టార్ ఎమోషనల్
బిగ్‌బాస్ ద్వారా పాపులర్ అయిన వారిలో అర్జున్ కళ్యాణ్ ఒకరు. ప్రస్తుతం సీరియల్స్, టీవీ షోల, వెబ్ సిరీస్‌లతో దూసుకెళ్తున్నారు. అందరు సెలబ్రిటీల మాదిరిగానే అర్జున్ కళ్యాణ్ జీవితంపైనా పలు రూమర్స్ వచ్చాయి. పలువురు హీరోయిన్లతో ఆయన రిలేషన్‌లో ఉన్నారని.. పెళ్లి వరకు వెళ్లారని గాసిప్స్ వైరల్ అయ్యాయి. తాజాగా ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్, ప్రేమ జీవితం, రూమర్స్‌పై అర్జున్ కళ్యాణ్ వివరణ ఇచ్చారు. ఈ వివరాల్లోకి వెళితే..
మా అమ్మది రాజమండ్రి, నాన్నది ఖమ్మం... మా నాన్న బ్యాంక్‌లో జాబ్ చేయడం వల్ల మూడేళ్లకో ఊరు మారే వాళ్లం. అలా గుంటూరు, వైజాగ్, ఒంగోలు, నెల్లూరుతో పాటు నార్త్ ఇండియా కూడా తిరిగేశాం. గుంటూరు, వైజాగ్‌లలో చదువుకున్నా. యూఎస్‌లో మాస్టర్స్ చదివి అక్కడే కొంతకాలం జాబ్ చేశా, యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉండటంతో అక్కడే ఇక ఇన్‌స్టిట్యూట్‌లో నేర్చుకున్నా. యాక్టింగ్ కోసమే ఇండియాకు తిరిగొచ్చేశా.. ఇక్కడికి వచ్చాక చాలా హ్యాపీగా ఉంటున్నా. హైదరాబాద్ లైఫ్‌ని ప్రపంచంలో ఏది బీట్ చేయలేదు. మనకి కావాల్సిన ఫుడ్ దొరకుతుంది.. ట్రాఫిక్ ఒక్కటే ఇబ్బంది తప్పించి హైదరాబాద్‌లో అన్ని దొరుకుతాయని అర్జున్ కళ్యాణ్ అన్నారు.

నేను ఏదో ఒక స్థాయికి వెళ్తానని చిన్నప్పటి నుంచి అనుకునేవాడిని. మా ఇంట్లో వాళ్లు యాక్టింగ్ వైపు వద్దు అన్నారు. ఇంట్లో వాళ్లు చెప్పినట్లే సినిమాలలో అవకాశాలు చాలా తక్కువగా వచ్చేవి. బయటి కుర్రాడిని కాబట్టి చాలా కష్టపడి ఛాన్స్ తెచ్చుకునే సమయంలో రికమండేషన్స్‌తో వచ్చిన వాళ్లు లాక్కునేవాళ్లు. బయటి నుంచి వచ్చిన వాళ్లు ఎంత బాగున్నా.. యాక్టింగ్ ఇరగదీసినప్పటికీ వీడికి మార్కెట్ ఎంత? అనేది ఆలోచిస్తారు. ఇండస్ట్రీ కిడ్స్‌కి ఇలాంటివి ఉండవు.. రికమండేషన్స్‌తో నడుస్తుంది. ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఓకే అయిపోయి రెండ్రోజుల్లో షూటింగ్ అనగా ఇంకొకరికి ఛాన్స్ ఇస్తే.. దానిని టార్గెట్ చేసి తొక్కడం అనరు, నీకు రావాల్సింది వేరే వాళ్లకి వెళ్లిపోయిందని అర్జున్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మీరు వేరే అమ్మాయిలతో రిలేషన్‌లో ఉన్నారని రూమర్స్ వచ్చాయి.. దీని మీద మీ అభిప్రాయం ఏంటీ? అని యాంకర్ అడగ్గా.. నా మీద చాలా వచ్చాయి? నిజంగా నేను ఒక అమ్మాయితో లవ్‌లో ఉంటే చాలా ధైర్యంగా చెబుతా.. అంతా తలరాత. నా మీద వచ్చే లవ్ ప్రోమోలన్నీ ఛానెల్స్ వాళ్లు వేసుకునేవి. ఇప్పటి వరకు చాలామందికి ప్రపోజ్ చేశా. బీభత్సంగా ఇష్టపడితే కానీ ప్రపోజ్ చేయను.. ఊరికే ఐ లవ్ యూ అన్న పదం వాడతా. ఓ అమ్మాయికి ప్రపోజ్ చేశాను.. కానీ ఆ అమ్మాయి ఒప్పుకోలేదు, అది జరిగి చాలా కాలం అయిపోయింది. ఇప్పుడు ఆ ప్రేమ చచ్చిపోయింది.. కానీ ఆ అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నానని అర్జున్ తెలిపారు.
ఆ అమ్మాయి మనసు కరిగేది అయితే ఎప్పుడో కరిగేది. ఇష్టం అలాగే ఉంది.. కానీ ఇప్పుడు కొంచెం డిస్ట్రబెన్స్ వచ్చింది. వన్ సైడ్ లవర్స్‌కి నేనే బ్రాండ్ అంబాసిడర్‌ని. అమ్మాయిలంతా బాగానే ఉంటారు.. మేము వన్ సైడే లవ్ చేసి చచ్చిపోయేది. నేనొచ్చిన అమ్మాయి వచ్చి ఐ లవ్ యూ చెబితే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. ఈ అమ్మాయి వర్కవుట్ కాదని తెలిసినప్పుడు పక్కకి వచ్చేయాలి. కొత్త మెమొరీస్ వస్తేనే.. పాత మెమొరీస్ వస్తాయి. నీ పనిలో నువ్వు బిజీగా ఉంటే మూడ్ డైవర్ట్ అవుతుంది. అందరూ అలా పక్కకి వెళ్లలేరు కదా. నాకు మొత్తం ఐదు బ్రేకప్స్ జరిగాయి. మిస్టేక్స్ ఇద్దరి వైపు ఉంటాయి. అయినా ఈ రోజుల్లో సిన్సియర్ లవ్ వర్కవుట్ కాదు.. సిన్సియర్‌గా, మంచిగా ఉండే అబ్బాయిలని సిల్లీగా చూస్తారని అర్జున్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications


