ఆ రోజు చేసిన తప్పు వల్లే ఈ స్టేజ్ లో ఉన్నా.. బిగ్ బాస్ నటుడు షాకింగ్

సినిమాల ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన, తర్వాత సీరియల్స్‌తో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు అర్జున్ కళ్యాణ్. రియాలిటీ షో 'బిగ్ బాస్ సీజన్ 6'లో పాల్గొన్న తర్వాత మరింత పాపులారిటీ దక్కించుకున్నాడు. ప్రస్తుతం టెలివిజన్ షోలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా మారారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, కెరీర్ ప్రయాణం గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సమయంలో ఆ తప్పు చేశాను కాబట్టే ఈ స్థాయిలో ఉన్నానని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ ఆ తప్పేంటీ?

ఇటీవల కిస్సిక్ టాక్స్ లో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా "జీవితంలో ఎప్పుడైనా తప్పు చేశారా?" అని అడిగిన ప్రశ్నకు అర్జున్ ఎలాంటి మొహమాటం లేకుండా "తప్పు చేశాను" అని ఒప్పుకోవడం అందరినీ ఆకట్టుకుంది. అయితే వెంటనే ఆయన తన ఆలోచనలను వివరించారు. "నేను పెద్ద తప్పులు ఏవీ చేయలేదు. కానీ నాకు తెలిసి చేసిన ప్రతి తప్పును సరిచేసేందుకు 100% ప్రయత్నించాను. అయినా అది సెట్ కాలేదంటే అది కేవలం నా తప్పు మాత్రమే కాదు. జీవితంలో చేసిన తప్పులే మనకు అనుభవాన్ని ఇస్తాయి. ఆ అనుభవాలే భవిష్యత్తులో తీసుకునే నిర్ణయాలకు బేస్ అవుతాయి. నిజంగా చెప్పాలంటే... నేను చేసిన ఆ తప్పుల వల్లనే ఈరోజు ఈ స్థాయిలో మీ ముందున్నాను. ఆ తప్పులు లేకపోతే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు" అంటూ తన లైఫ్ ఫిలాసఫీని వెల్లడించారు.

Bigg Boss Fame Arjun Kalyan Shocking Confession Mistakes Made Me Who I Am Today

కెరీర్ గురించి మాట్లాడుతూ ఇండస్ట్రీలో ఎదుర్కొన్న కష్టాలను కూడా ఆయన ఓపెన్‌గా షేర్ చేసుకున్నారు. చిన్నప్పటి నుంచే ఏదో ఒక స్థాయికి చేరాలని కలలు కనేవాడినని, కానీ ఇంట్లో వాళ్లు యాక్టింగ్ ఫీల్డ్‌కి రావొద్దని చెప్పారని తెలిపారు. అయినప్పటికీ తన కలను వదలకుండా ప్రయత్నించానని చెప్పారు. "బయటివాళ్లం కాబట్టి ఒక్క ఛాన్స్ కోసం చాలా కష్టపడాలి. మనం బాగా చేసినా కూడా 'మార్కెట్ ఎంత?' అని చూసి అవకాశాలు ఇవ్వరు. కానీ ఇండస్ట్రీ కిడ్స్‌కి అలాంటి సమస్యలు ఉండవు. చాలా సార్లు నాకు రావాల్సిన అవకాశాలు చివరి నిమిషంలో రికమండేషన్స్‌తో వేరేవాళ్లకు వెళ్లిపోయాయి" అంటూ ఇండస్ట్రీలోని వాస్తవాలను బయటపెట్టారు.

ఇక ప్రేమ, రిలేషన్‌షిప్స్‌పై కూడా అర్జున్ చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. తనపై వచ్చిన లవ్ రూమర్స్ గురించి స్పందిస్తూ, "నిజంగా ప్రేమలో ఉంటే నేనే ముందుగా చెబుతా. నా మీద వచ్చిన లవ్ ప్రోమోలు ఎక్కువగా ఛానెల్స్ క్రియేట్ చేసినవే" అని క్లారిటీ ఇచ్చారు. అలాగే తన వ్యక్తిగత జీవితంలో ప్రేమ గురించి మాట్లాడుతూ, "ఇప్పటివరకు చాలా మందికి ప్రపోజ్ చేశాను. నిజంగా ఇష్టమైతేనే ప్రపోజ్ చేస్తా. ఒక అమ్మాయిని చాలా ఇష్టపడ్డాను... కానీ ఆమె ఒప్పుకోలేదు. ఆ విషయం చాలా కాలం క్రితమే ముగిసిపోయింది. ఇప్పటికీ ఆ ఫీలింగ్ పూర్తిగా పోయింది కాదు కానీ... వెయిట్ చేస్తున్నాననే చెప్పాలి" అన్నారు.

ఇంకా తన అనుభవాలను చెబుతూ, 'నాకు మొత్తం ఐదు బ్రేకప్స్ అయ్యాయి. ప్రతి రిలేషన్‌లో తప్పులు ఇద్దరివి ఉంటాయి. కానీ ఈ రోజుల్లో సిన్సియర్ లవ్ అంతగా వర్కవుట్ కావడం లేదు. మంచిగా, నిజాయితీగా ఉండే వాళ్లను చాలాసార్లు సిల్లీగా చూస్తారు' అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు. "వన్ సైడ్ లవర్స్‌కి నేనే బ్రాండ్ అంబాసిడర్" అని చెప్పడం ఆయన మాటల్లోని బాధను స్పష్టంగా చూపించింది. మొత్తానికి అర్జున్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు యువతలో మంచి చర్చకు దారి తీస్తున్నాయి. జీవితంలో తప్పులు చేయడం సహజమే కానీ, వాటి నుంచి నేర్చుకోవడం ముఖ్యమని ఆయన చెప్పిన సందేశం చాలా మందిని ఆకట్టుకుంటోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X