»   » గర్ల్‌ఫ్రెండ్ తలను నేలకుకొట్టి.. దారుణంగా హింస.. బిగ్‌బాస్ సెలబ్రిటీ నిర్వాకం!

గర్ల్‌ఫ్రెండ్ తలను నేలకుకొట్టి.. దారుణంగా హింస.. బిగ్‌బాస్ సెలబ్రిటీ నిర్వాకం!

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Big Boss Fame Arman Kohli Humiliated His Girlfriend

  బిగ్‌బాస్7‌లో వివాదాస్పద సెలబ్రిటీగా పేరు తెచ్చుకొన్న అర్మాన్ కోహ్లీపై క్రిమినల్ కేసు నమోదైంది. తన గర్ల్‌ఫ్రెండ్‌ నీరూ తలను నేలకు బలంగా కొట్టడంతో ఆమె హాస్పిటల్ పాలైంది. ఆమె ప్రస్తుతం చికిత్సనందిస్తున్నారు. ఈ కేసులో అర్మాన్‌పై పోలీసులు దాడి కేసు రిజిస్టర్ చేశారు. దాడికి కారణాలను నీరూ మీడియాకు వెల్లడించారు. ఈ వ్యవహారంలో అసలు ఏమైందంటే..

  గోవాలోని విల్లాపై వివాదం

  గోవాలోని విల్లాపై వివాదం

  గోవాలో అర్మాన్‌కు ఓ విల్లా ఉంది. దాని అద్దె వ్యవహారాలను నేను చూసుకొంటాను. విల్లాను ఓ క్లయింట్‌కు ఇచ్చిన అద్దె విషయంపై మా మధ్య వాగ్వాదం జరిగింది. అద్దెకు తీసుకొన్న క్లయింట్ ఆ మొత్తాన్ని మా సిబ్బందికి అందజేశారు. ఆ డబ్బు గురించి అర్మాన్ ఆరా తీయగా, సిబ్బంది ట్రాన్స్‌ఫర్ చేయలేదు. డబ్బు ట్రాన్స్‌ఫర్ కాగానే ఇస్తాను అని చెప్పాను.

  గాయమైనా పట్టించుకోలేదు

  గాయమైనా పట్టించుకోలేదు

  అద్దె విషయంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ నన్ను దుర్భాషలాడారు. అ కారణంగా నా జుట్టు పట్టుకొని నేలకు కొట్టారు. దాంతో తలకు తీవ్ర గాయమైంది. రక్తం కారుతుండటంతో నన్ను హాస్పిటల్‌లో చేర్పించమని ప్రాధేయపడ్డాను. పోలీసులకు ఫిర్యాదు చేయనని చెప్పాను. అయినా నన్ను పట్టించుకోలేదు. ఎలాగోలా ఆస్పత్రిలో చేరాను.

  తల బలమైన గాయం.. సర్జరీ

  తల బలమైన గాయం.. సర్జరీ

  తలకు బలమైన గాయం కావడంతో సర్జరీ చేశారు. దెబ్బ బలంగా తాకడంతో చర్మం బాగా చిట్లిపోయింది. గాయం మానిన తర్వాత కూడా తలపై మరక ఉంటుందని డాక్లర్లు చెప్పారు. ఇంతా జరిగిన తర్వాత ఇంటికి రా. వెంటనే పెళ్లి చేసుకొందామని ఎస్సెమ్మెస్ పంపుతున్నారు. అర్మన్‌తో జరిగింది చాలూ.. ఇక ఆ రిలేషన్‌కు పుల్‌స్టాప్ పెట్టాలనుకొంటున్నాను అని నీరూ వెల్లడించింది.

  జీవితంలో పెద్ద తప్పు

  జీవితంలో పెద్ద తప్పు

  అర్మాన్ నా జీవితాన్ని నాశనం చేశాడు. గత ఫిబ్రవరిలో కూడా దారుణంగా కొట్టాడు. ముక్కు కూడా పగిలిపోయింది. అతనితో అఫైర్ పెట్టుకోవడం జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు. అతడు నీకు సరికాడు అని ఫ్యామిలీ, స్నేహితులు చెప్పినా నేను పట్టించుకోలేదు. గత సెప్టెంబర్‌లో ఆయనతో తెగతెంపులు చేసుకొని దుబాయ్ వెళ్లాను. మంచిగా జాబ్ చేసుకొంటూ నా బతుకేదో బతుకుతుంటే మళ్లీ వెనక్కి తీసుకొచ్చాడు అని నీరూ చెప్పారు.

  English summary
  Bigg Boss fame Armaan Kohli, best known for his controversial stint in Bigg Boss 7, has been booked for brutally assaulting his girlfriend Neeru. As per reports, Neeru said, “The argument started on a frivolous matter on Goa villa which owned Armaan. he started verbally abusing me. Before I realised what was happening, he caught me by my hair and banged my head against the floor. I begged him to allow me to go to the hospital, promising that I wouldn’t approach the police.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more