‘నన్ను అనుభవించాలని పనివాడు అలా ట్రాప్... బిల్డింగ్‌పై నుంచి దూకేశా’

మహిళలకు ప్రస్తుత కాలంలో రక్షణ లేకుండా పోతుంది. అర్ధరాత్రి కాదు కదా.. పట్టపగలు కూడా నిర్భయంగా నడవలేని పరిస్థితులు ఉన్నాయి. గుడి, బడి, కార్యాలయమే కాదు చివరికి ఇంట్లోనూ కాటువేసే కాలనాగులు కాచుకుని కూర్చొంటున్నాయి. ఎవరు ఎప్పుడు ఎటు వైపు నుంచి అఘాయిత్యానికి పాల్పడతారోనని మహిళలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. సామాన్యులే కాదు.. సెలబ్రిటీల పరిస్ధితి కూడా ఇలాగే ఉంది. పలువురు ప్రముఖులు ఈ విషయాన్ని చెబుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఓ నటి తనకు జరిగిన దారుణాన్ని బయటపెట్టింది.

బిగ్‌బాస్ హిందీ 13లో అలరించారు నటి ఆర్తి సింగ్. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆర్తి సింగ్ 2007లో మాయికా అనే సీరియల్‌ ద్వారా హిందీ బుల్లితెరపై అడుగుపెట్టారు. ఆ తర్వాత గృహస్తి, పరిచయ్, ఉత్తరాన్, ఎన్‌కౌంటర్, వారిస్, విక్రమ్ బేతాళ్‌కి రహస్య గాథ, ఉదాన్, శ్రావణి సీరియల్స్‌తో హిందీ టెలివిజన్ రంగంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. అలాడిన్, గుద్గుండి, హల్దీ సినిమాలలోనూ నటించింది. ఈమెకు ఇండస్ట్రీలో బలమైన బ్యాక్‌గ్రౌండ్ ఉంది. బాలీవుడ్ సూపర్‌స్టార్ గోవిందకు ఈమె మేనకోడలు. అలాగే ప్రముఖ కమెడియన్ కృష్ణ అభిషేక్‌కు చెల్లెలు.

Bigg Boss Fame Arti Singh Reveals Shocking Childhood Incident

ఈ క్రమంలో హిందీ బిగ్‌బాస్ 13లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది ఆర్తి సింగ్. బిగ్‌బాస్ షో ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. టాస్క్‌లు, గేమ్స్, డిస్కషన్స్ ఇలా ప్రతిదానిలో సత్తా చాటుతూ ఫైనల్‌ వరకు వెళ్లింది. బిగ్‌బాస్ విజేతగా నిలుస్తుందని అంతా అనుకున్నారు. అయితే బిగ్‌బాస్ 13 విజేతగా సిద్ధార్ధ్ విజయం సాధించగా.. ఆర్తి ఫోర్త్ రన్నరప్‌తో సరిపెట్టుకున్నారు. బిగ్‌బాస్‌లోకి వెళ్లడంతో ఆర్తికి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. దీపక్ చౌహాన్ అనే వ్యాపారవేత్తని 2024లో పెళ్లి చేసుకున్నారు ఆర్తి. ప్రస్తుతం సీరియల్స్, సినిమాలు, ఇతర షోలతో బిజీగా గడుపుతున్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఆర్తి సింగ్ ఎప్పటికప్పుడు తన సీరియల్స్, షూటింగ్స్‌ ఇతర విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్తి సింగ్ మాట్లాడుతూ.. చిన్నతనంలోనే తాను లైంగిక వేధింపులకు గురైనట్లు బయటపెట్టింది. నాకు 13 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మా ఇంట్లో పనిచేసే వ్యక్తే నాపై అఘాయిత్యం చేసేందుకు ప్రయత్నించాడు. ఒకరోజు నా గదిలో నిద్రపోతున్నా.. అప్పుడు అతను నా బెడ్‌రూంలోకి రావడంతో ఉలిక్కిపడి లేచాను. ఈ గదిలోకి ఎందుకు వచ్చావని అడుగుతున్నా పట్టించుకోకుండా నా మీదకి వస్తున్నాడు. నువ్వు నాకు అన్నయ్య లాంటి వాడివి, నన్ను వదిలేయమని చేతులు జోడించి బతిమలాడినా వినిపించుకోలేదు.

ఆ సమయంలో అమ్మ పొలానికి వెళ్లగా.. ఇంట్లో నేను ఒక్కదానినే ఉన్నాను. ఇంట్లో అన్ని వైపులా తలుపులకు తాళాలు వేసి వున్నాయి. తప్పించుకునే పరిస్ధితి కనిపించలేదు. దాంతో వెంటనే తాను గదిలోంచి బయటికి పరిగెత్తి రెండో అంతస్తకు చేరుకున్నా. అతని నుంచి తప్పించుకోవడానికి అంత ఎత్తు నుంచి కిందకి దూకేశా. అలా కొద్దిలో నన్ను నేను కాపాడుకోగలిగాను అని ఆర్తి సింగ్ తెలిపారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు హిందీ చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశం అయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X