అషురెడ్డికి ఉంగరం తొడిగిన వ్యక్తి ఇతనే... ఎంగేజ్‌మెంట్‌పై బిగ్‌బాస్ బ్యూటీ ఫస్ట్ రియాక్షన్

గత కొద్దిరోజులుగా వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు బిగ్‌బాస్ ఫేమ్ అషురెడ్డి. పెళ్లి పేరుతో తనను 9.5 కోట్ల రూపాయల మేర మోసం చేసిందంటూ ఓ ఎన్ఆర్ఐ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలుగు సినీవర్గాల్లో కలకలం రేపింది. ఈ వివాదం అటు తిరిగి ఇటు తిరిగి చివరికి కోర్టుకు కూడా చేరింది. న్యాయస్థానంలో అషురెడ్డికి చుక్కెదురు కాగా.. అంతలోనే ఆమె ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు వార్తలు రావడం మరింత వివాదానికి దారి తీసింది.

విశాఖపట్నానికి చెందిన అషురెడ్డి చదువులో టాపర్. అమెరికాలో చదువుకుని అక్కడే మంచి ఉద్యోగంలో స్థిరపడ్డారు. అయితే సినిమాలపై ఆసక్తితో డబ్‌స్మాష్ వీడియోలు, టిక్ టాక్ రీల్స్ చేస్తూ పాపులర్ అయ్యారు. ఈ దశలో పూర్తి స్థాయిలో సినిమాలపై ఫోకస్ పెట్టాలనే ఉద్దేశంతో ఉద్యోగాన్ని వదులుకుని ఇండియాకు వచ్చేసింది. సోషల్ మీడియాలో సెన్షేషన్ అయిన అషురెడ్డిని అభిమానులు జూనియర్ సమంతగా పిలుచుకుంటారు. ఈ క్రేజ్‌ను ఎంజాయ్ చేస్తున్న దశలోనే బిగ్‌బాస్‌లో ఆఫర్ రావడం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది.

Bigg Boss Fame Ashu Reddy Clarifies Engagement Rumours Amid 9 5 Crore Fraud Controversy

బిగ్‌బాస్‌లో ఆఫర్ తర్వాత సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో ఇంటర్వ్యూలో విమర్శలతో పాటు మీడియాలోనూ క్రేజ్ తీసుకొచ్చింది. చిన్నాచితకా సినిమాలు చేస్తూ పెద్ద ఆఫర్ కోసం తన ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు అషురెడ్డి. సినిమాలే కాకుండా బుల్లితెరపై కొన్ని కార్యక్రమాలలోనూ నటిస్తోంది అషురెడ్డి. ఇలా బిజీగా ఉన్న దశలో ఆమె జీవితం ఊహించని మలుపు తీసుకుంది. లండన్‌కు చెందిన ధర్మేంద్ర అనే ఎన్ఆర్ఐ.. అషురెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. అషురెడ్డి, ఆమె తల్లి దాదాపు 9.5 కోట్ల రూపాయలు తీసుకున్నారని పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది.

ఈ ఆరోపణలు అషురెడ్డి, ఆమె తండ్రి ఖండించారు. తన గురించి నిరాధారమైన కథనాలను ప్రసారం చేస్తూ చట్టపరంగా చర్యలు తీసుకుంటానని అషురెడ్డి హెచ్చరించారు. అలాగే తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టేయాలని, పోలీసుల దర్యాప్తుపై స్టే విధించాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే న్యాయస్థానం మాత్రం అషురెడ్డికి కేసులో స్టే విధించేందుకు నిరాకరించింది. ఈ వివాదం ఇలా కొనసాగుతూ ఉండగానే.. అషురెడ్డి సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. వేలికి ఉంగరంతో ఓ అబ్బాయి చేతిని పట్టుకుని ఉన్న ఫోటోలను స్వయంగా అషురెడ్డి రిలీజ్ చేశారు. దాంతో ఆమె త్వరలో పెళ్లి చేసుకోబోతోందని జనాలు ఫిక్స్ అయ్యారు. అయితే ఆ కుర్రాడు ఎవరు? అనేది మాత్రం అషురెడ్డి వెల్లడించలేదు. తాజాగా ఈ సస్పెన్స్‌కు తెరదించారు అషురెడ్డి.

వాస్తవానికి అషురెడ్డికి ఎలాంటి ఎంగేజ్‌మెంట్ జరగలేదట. ఆమె నటిస్తున్న విక్రమ్ ఆన్ డ్యూటీ అనే వెబ్‌సిరీస్ షూటింగ్‌లో భాగంగా తీసిన ఫోటోలను ఆమె షేర్ చేశారు. ఇక అషురెడ్డి వేలికి ఉంగరం తొడిగింది ఎవరో కాదు.. బిగ్‌బాస్ తెలుగు 8 విన్నర్, బుల్లితెర నటుడు నిఖిల్ మలియక్కల్. తాజాగా షూటింగ్‌కు సంబంధించిన పూర్తి ఫోటోలను షేర్ చేసిన అషురెడ్డి .. కంటికి కనిపించేవన్నీ నిజం కావు.. గుడ్డిగా నమ్మొద్దంటూ రాసుకొచ్చింది. ప్రజల్లో అటెన్షన్ కోసమే ఇలా చేశానని తనని అర్ధం చేసుకోవాలంటూ పేర్కొంది అషురెడ్డి. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతుండగా.. నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.

Read more about: bigg boss ashu reddy
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X