నువ్వులేని లోటు ఎప్పటికీ తీరదు... అషురెడ్డి ఎమోషనల్ పోస్ట్, ఏం జరిగిందంటే?

గత కొద్దిరోజులుగా వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు బుల్లితెర నటి, బిగ్‌బాస్ ఫేమ్ అషురెడ్డి. పెళ్లి పేరుతో తనను ఆమె మోసం చేసిందంటే ఓ ఎన్ఆర్ఐ ఇంజనీర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. దీనిపై వ్యవహారం కోర్టుల వరకు వెళ్లింది. దాంతో అషురెడ్డి ఏం చేసినా, ఏం మాట్లాడినా కలకలం రేగుతోంది. తాజాగా ఆమె పెట్టిన ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళ్తోంది.

తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకోవడమే అషురెడ్డి పోస్ట్‌కు కారణం. వర్ధమాన హీరో భరత్ కాంత్, యంగ్ సినిమాటోగ్రాఫర్ త్రిలోక్‌లు ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనతో యావత్ చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. నెల్లూరుకు చెందిన భరత్ కాంత్, త్రిలోక్‌లు వీకెండ్‌లో తమ సొంతూరికి వెళ్లారు. అక్కడ కుటుంబంతో గడిపి తిరిగి వీరిద్దరూ కారులో హైదరాబాద్‌కు బయల్దేరారు.

Bigg Boss Fame Ashu Reddy Emotional Post Goes Viral After Bharath Kanth s Tragic Death

ఈ క్రమంలో తెల్లవారుజామున 3 గంటల సమయంలో వీరు అంబర్‌పేట్ నుంచి ఓఆర్ఆర్‌లోకి ప్రవేశించి శంషాబాద్ వైపు వెళ్తుండగా బొంగుళూరు ఎగ్జిట్ 12 సమీపంలో వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి.. ముందు వెళ్తున్న కంటైనర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జు కాగా.. తీవ్రంగా గాయపడిన భరత్, త్రిలోక్ ఇద్దూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కారులో ఇరుక్కుపోయిన భరత్ కాంత్, త్రిలోక్‌ల మృతదేహాలను బయటకు తీసి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రతిభావంతులైనా ఇద్దరు కుర్రాళ్ల హఠాన్మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది.

భరత్ కాంత్ టెనెంట్ అనే మూవీలో హీరోగా నటించి మంచి మార్కులు పొందాడు. ఆ తర్వాత పలు వెబ్ సిరీస్‌లలోనూ కీలకపాత్రలు పోషించారు. అటు త్రిలోక్ కూడా సినిమాటోగ్రాఫర్‌గా ఎదుగుతున్నాడు. పలు సినిమాలతో పాటు వాణిజ్య ప్రకటనలకు కూడా డీవోపీగా పనిచేశాడు. ప్రస్తుతం టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరీ హీరోగా నటిస్తోన్న తల్వార్ మూవీకి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. కానీ ఇంతలోనే ఈ ఘోరం జరిగింది. ఎంతో భవిష్యత్తు ఉన్న త్రిలోక్, భరత్ కాంత్‌లు చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు తరలిపోవడంతో సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే భరత్ కాంత్ మరణంపై నటి అషురెడ్డి షాకైంది. అతని మరణం వ్యక్తిగతంగా నాకు తీరని లోటు, నా ప్రాణ స్నేహితుడు, నా ఎమర్జెన్సీ కాంటాక్ట్ పర్సన్, నా ఫ్యామిలీ, నా మనిషి ఇప్పుడు శివయ్యను చేరుకున్నాడు. నీకు చేరుకోలేని ఒక సందేశాన్ని నేను పోస్ట్ చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. నిన్ను మళ్లీ కలిసే వరకు .. నీ చిరునవ్వు, నీ ముఖం ఎప్పటికీ గుర్తుండిపోతాయి. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్.. బరువైన హృదయంతో గుడ్ బై భరత్ అని అషురెడ్డి ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. అలాగే భరత్ కాంత్‌తో కలిసున్న ఫోటోలను ఆమె పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా భరత్ కాంత్‌కు నెటిజన్లు సంతాపం తెలియజేస్తున్నారు.

Read more about: bigg boss ashu reddy bharath
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X