అషురెడ్డి వివాదంలో ట్విస్ట్.. సంచలన విషయాలు బయటపెట్టిన నటి తండ్రి
పెళ్లి పేరుతో ఎన్ఆర్ఐ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ని దాదాపు 9.5 కోట్ల రూపాయల మేర మోసం చేసిన కేసులో బిగ్‌బాస్ ఫేమ్ అషురెడ్డిపై ఆరోపణలు రావడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే అషురెడ్డి స్పందించారు. సోషల్ మీడియాలో వచ్చిన కథనాలు పూర్తిగా అవాస్తవాలనీ.. తన అనుమతి లేకుండా ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో అషురెడ్డి తండ్రి వెంకట కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు.
మాకు 2021లో ఓ ఫోన్ కాల్ వచ్చింది. కాకినాడ నుంచి సత్యనారాయణ మూర్తి అని పాప సంబంధం గురించి మాట్లాడుతున్నామని పరిచయం చేసుకున్నాడు. మా పాప మీకెలా తెలుసని అడగ్గా.. పాప, బాబు అబ్రాడ్‌లో సహోద్యోగులు.. వాళ్లద్దరికీ నచ్చిందని చెప్పారు. దాంతో ఫోన్‌లో ఎందుకు పర్సనల్‌గా మాట్లాడుకుందామని చెప్పాం. దాంతో అతను, తోడల్లుడు కలిసొచ్చారు బాగానే మాట్లాడారు. వాళ్లకు ఒక ఫైనాన్స్ కంపెనీ ఉందని చెప్పడంతో మా నాన్నగారు తర్వాత కబురు చేస్తామని చెప్పారు. రెండు మూడు నెలల తర్వాత కాకినాడలో మాకు బాగా తెలిసినవారు ఉండటంతో ఆరా తీశామని వెంకట కృష్ణారెడ్డి అన్నారు

వాళ్లు డైలీ ఫైనాన్స్ బిజినెస్ చేస్తారు.. వాళ్ల మీద కాల్ మనీ కేసులు కూడా ఉన్నాయని చెప్పారు. అబ్బాయి గురించి అడిగితే అబ్బాయి మీద అప్పటికే డైవర్స్ కేస్ నడుస్తున్నట్లు తెలిసింది. యానాంకు చెందిన అమ్మాయిని బాగా టార్చర్ పెట్టి వదిలేశాడని చెప్పారు. ఇవన్నీ తెలిశాక కాకినాడ వెళ్లాలనే ఆలోచననే వదిలేశాం.. వాళ్లను దూరం పెట్టడానికి ట్రై చేశాం. కానీ వారు మాత్రం కంటిన్యూగా మమ్మల్ని ఏదో రకంగా కలుపుకోవడాదనికి ప్రయత్నించారని అషురెడ్డి తండ్రి చెప్పారు.
ఆరోపణలు ఎవరైనా చేయొచ్చు.. ఆధారాలుంటే ప్రూవ్ చేయాలి. అయితే అషురెడ్డి తల్లి మాత్రం ఈ సంబంధం గురించి ఆలోచించమని చెప్పారు. కానీ జరిగినదంతా ఆమెకు చెప్పా. కానీ ఆ కుర్రాడు మాత్రం నా భార్యతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉన్నట్లు తెలిసింది. అషురెడ్డి సోదరి దివ్యరెడ్డికి కూడా 50 లక్షల రూపాయలు ఇచ్చినట్లుగా చెబుతున్నారు. కానీ దివ్యరెడ్డి అమెరికాలో మంచి పొజిషన్‌లో ఉన్నారు. మాపై చేసిన అన్ని ఆరోపణలకు కాలమే సమాధానం చెబుతుంది. అషురెడ్డి నాతో ఉండదు.. హైదరాబాద్‌లో వాళ్ల అమ్మతో కలిసుంటుంది. నేను హైదరాబాద్ వెళ్లి చాలాకాలమే అవుతోంది. హైదరాబాద్‌కి వెళ్లినా నేను హోటల్‌లోనే ఉంటాను.. నాకు ఆ సినిమా వాతావరణం నచ్చదు. అషురెడ్డి చాలా టాలెంటెడ్.. మంచి కంపెనీలో పనిచేసింది. కేవలం తల్లి ప్రోత్సాహం వల్లే సినిమాలలోకి వెళ్లింది. తల్లితో ఉంటే క్షేమంగా ఉంటుందని అనుకున్నాం.. కానీ వెనుక ఇంత జరుగుతుందని మాకు తెలియదు. కూతురిది తప్పయితే తల్లిదే బాధ్యత అని వెంకట కృష్ణారెడ్డి చెప్పారు.
అషురెడ్డికి ఏం తెలియవు, అమాయకురాలు. ఇంత జరుగుతున్నా అషురెడ్డి నాకు ఏం చెప్పలేదు. నా భార్యను కూడా వాళ్లు బాగా నమ్మించారు. అషురెడ్డికి సంబంధించిన ఆర్ధిక వ్యవహారాల్లో నేను జోక్యం చేసుకోను. ఈ విషయం తెలియగానే వెంటనే తనకి ఫోన్ చేసి అడగ్గా.. నేను హైదరాబాద్‌లో లేను, వచ్చిన వెంటనే ప్రెస్‌మీట్ పెడతానని చెప్పింది. కాకినాడ సంబంధం వాళ్లు తలనొప్పి వ్యవహారమని అప్పుడే హెచ్చరించా.. అషురెడ్డి ఎప్పుడైతే సినీ పరిశ్రమలోకి వెళ్లిందో అప్పటి నుంచి నేను నా భార్యతో మాట్లాడటం మానేశా. అమెరికాలో మంచి జాబ్ వదిలేసి వచ్చింది.. అషురెడ్డికి సినిమా అంటే ప్యాషన్, నాకు మాత్రం అస్సలు నచ్చదు. తన జాతకంలో పెద్ద యాక్టర్ అయిపోతుందని నా భార్యే ఈ పిచ్చి ఎక్కించింది. నేను నిర్దోషినని నాకు తెలుసు.. అన్ని వాస్తవాలు త్వరలోనే తెలుస్తాయని వెంకట కృష్ణారెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారాయి.


Click it and Unblock the Notifications