హాట్ షో చేస్తూ అమ్మవారికి పూజ.. తెలుగు నటిపై అసభ్యకరంగా!
తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది అమ్మాయిలు ఇప్పుడు సినిమా రంగంలో సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో కొందరు మాత్రమే బోల్డుగా ఉంటూ సెన్సేషన్‌గా మారుతున్నారు. అందులో హాట్ లేడీ అషు రెడ్డి ఒకరు. చాలా కాలం క్రితమే గ్లామర్ ఫీల్డులోకి వచ్చిన ఈ పిల్ల.. వరుసగా షోలు, సినిమాలు చేస్తూ సత్తా చాటుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో హాట్ షోతో హైలైట్ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా అషు రెడ్డి కొన్ని ఘాటు ఫొటోలను షేర్ చేసింది. దీంతో నెటిజన్లు ఆమెపై ట్రోల్స్ చేస్తున్నారు. అసలేం జరిగిందో మీర చూసేయండి మరి!
జూనియర్ సమంతలా
డబ్‌స్మాష్ వీడియోలతో సెన్సేషన్ అయిన అషు రెడ్డి.. జూనియర్ సమంత అనే పేరును తెచ్చుకుంది. అదే సమయంలో ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకుని అప్పట్లోనే యమా హైలైట్ అయింది. దీంతో అషు రెడ్డి సినీ ప్రముఖుల దృష్టిని ఆకర్షించింది. ఇలా ఈ భామ 'ఛల్ మోహనరంగ' అనే సినిమాతో నటిగా ఎంటరైంది. కానీ, తర్వాత కెరీర్‌కు బ్రేక్ ఇచ్చేసింది.

బిగ్ బాస్‌తో నిరాశగానే
అషు రెడ్డికి బిగ్ బాస్ మూడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే ఛాన్స్ వచ్చింది. అయితే, ఈ షోలో అంతగా ప్రభావాన్ని చూపకపోయినా ఈ భామ తన క్రేజ్‌ను భారీ స్థాయిలో పెంచుకుంది. ఇక, నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో కంటెస్టెంట్‌గా మళ్లీ ఆఫర్ అందుకుంది. ఇందులో రాణించినా కూడా అషు ఫినాలేకు చేరకుండానే ఎలిమినేట్ అయింది. అయినా ఆమె రేంజ్ బాగా పెరిగింది.
బోల్డ్ బిహేవియర్‌తోనే
గతంలో అషు రెడ్డి బుల్లితెరపై పలు రకాల షోలు చేసింది. అదే సమయంలో కొన్ని సినిమాల్లోనూ నటించింది. కానీ, బిగ్ బాస్ నాన్ స్టాప్ షో తర్వాత మాత్రం ఈ అమ్మడు స్పీడు తగ్గించేసింది. ఈ ఖాళీ సమయంలో మాత్రం ఆమె బోల్డుగా వ్యవహరిస్తూ సెన్సేషన్ అయిపోయింది. ముఖ్యంగా హాట్ ట్రీట్లు, రాంగోపాల్ వర్మతో ఇంటర్వ్యూలతో ఈ బ్యూటీ సెన్సేషన్‌గా మారిపోయింది.
అందులో కూడా బిజీ
సోషల్ మీడియా వల్లే అషు రెడ్డి ఫేమస్ అయిన విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీని ద్వారానే ఈ అమ్మడు తన ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లో ఉంటోంది. అలాగే, అప్పుడప్పుడు ఫొటోలు, వీడియోలను వదులుతూ ఉంటోంది. అంతేకాదు, ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. మరీ ముఖ్యంగా అషు రెడ్డి ఈ మధ్య కాలంలో మరింతగా సందడి చేస్తూ సాగిపోతోంది.

హాట్ డ్రెస్‌తో పూజలు
అషు రెడ్డి సోషల్ మీడియాలో చాలా కాలంగా తన అందాలను ఒలకబోస్తూ దిగిన ఫొటోలు, వీడియోలనే షేర్ చేస్తోంది. ఇక, ఈ మధ్య కాలంలో ఈ సుందరాంగి డోస్ పెంచేసి మరీ క్లీవేజ్ భాగాలు చూపిస్తూ కాక రేపుతోంది. ఇందులో భాగంగానే తాజాగా అషు రెడ్డి హాట్ షో చేసే డ్రెస్ వేసుకుని మరీ వరలక్ష్మి వ్రతం చేసిన ఫొటోలను వదిలింది. దీంతో ఇవన్నీ వైరల్‌గా మారిపోయాయి.
యమా తిట్లు తిడుతూ
అషు రెడ్డి తాజాగా షేర్ చేసిన ఫొటోలకు నెటిజన్ల నుంచి ఊహించని విధంగా కామెంట్లు వస్తున్నాయి. ముఖ్యంగా కొందరు 'దేవుడి దగ్గర పూజ దగ్గర అవేం బట్టలు తల్లి', 'ఆ డ్రెస్ ఏంటి నువ్వు చేస్తున్న పూజ ఏంటి', 'పూజ చేయడానికి ఎవరైనా ఇలాంటి బట్టలు వేసుకుంటారా' అంటూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. దీంతో ఈ బ్యూటీ తీరు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.


Click it and Unblock the Notifications











