‘హీరోయిన్లు అణిగిమణిగి ఉండాల్సిందే.. ఇండస్ట్రీలో అలా తొక్కేస్తారు’
బిగ్‌బాస్ రియాలిటీ షో ద్వారా స్టార్‌డమ్ అందుకున్న వారిలో అషురెడ్డి కూడా ఒకరు. అచ్చుగుద్దినట్లుగా హీరోయిన్ సమంతలా ఉండటంతో ఆమెను అందరూ జూనియర్ సమంత అని పిలుచుకుంటూ ఉంటారు. తొలుత అమెరికాలో స్థిరపడిన అషురెడ్డి డబ్‌స్మాష్, రీల్స్, టిక్ టాక్ వీడియోలతో సోషల్ మీడియాను పాపులర్ అయ్యింది. ఈ క్రేజ్‌తోనే బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో కంటెస్టెంట్‌గా ఛాన్స్ కొట్టేశారు. ఆ తర్వాత పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టీవీ కార్యక్రమాలలో సందడి చేసిన అషురెడ్డి ప్రస్తుతం సైలెంట్ అయ్యారు. తాజాగా ఆమె కీలకపాత్ర పోషిస్తున్న మూవీ విక్రమ్ ఆన్ డ్యూటీ. ఈ చిత్ర యూనిట్ ఆదివారం ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా అషురెడ్డి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
బిగ్‌బాస్ తెలుగు 8 విన్నర్ నిఖిల్ మలియాక్కల్ హీరోగా నటించిన చిత్రం విక్రమ్ ఆన్ డ్యూటీ. ఇందులో ఆయన పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. గాయత్రి చాగంటి, సమీర్, అషురెడ్డి తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ వెబ్ సిరీస్‌కు హర్షశ్రీ దర్శకత్వం వహించారు. జియో హాట్ స్టార్ వేదికగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మార్చి 6 నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‌లోకి రానుంది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన వివరాలు పంచుకున్నారు.

ఈ సందర్భంగా అంతకుమందు చాలాసార్లు మీరు సినిమాలలో హీరోయిన్‌గా వస్తారని అనుకున్నాం. చాలామంది కూడా మిమ్మల్ని రిజెక్ట్ చేసినట్లుగా ఉన్నారు? కానీ మీరు ఈ ప్రాజెక్ట్‌లోనే చేయడానికి రీజన్ ఏంటీ? అని రిపోర్టర్ ప్రశ్నించగా.. దానికి అషురెడ్డి స్పందించారు. సినిమాల్ని రిజెక్ట్ చేసేంతగా అయితే సినిమాలు నాకు రాలేదు. కొన్ని వచ్చాయి కానీ... అయితే అంత నోటెడ్ అవ్వదని అనిపించింది. ఏదైనా స్టోరీ విన్నప్పుడు.. క్యారెక్టర్ గురించి చెప్పినా మనకు అనిపిస్తుంది కదా. ఒకవేళ చేసినా చేయకపోయినా ఒకేలా ఉంటుందేమో, అంత రీచ్ రాకపోవచ్చేమో అనిపించింది అని అషురెడ్డి పేర్కొన్నారు.
అయితే ఈ ప్రాజెక్ట్ గురించి విన్నప్పటి నుంచి ఆడిషన్స్ మామూలుగానే జరిగాయి. నేను వీళ్లతో బ్యాకెండ్ టీమ్‌లాగా అనిపించింది. వీళ్లకెంటీ ఒక క్యారెక్టర్ దొరకలేదా? ఎందుకింత హడావుడి అనుకునే దానిని. అయితే అంత ఈజీగా ఈ ప్రాజెక్ట్ రాలేదు. ఇంట్లో ఉన్నవాళ్లకి కూడా చెప్పలేదు. నేను ఆడిషన్స్‌కి వెళ్లాను, నందిని గారు నన్ను పిండేశారు. ఈ ఎమోషన్ ఇలా చేయ్.. అలా చేయ్ అనేవారు. ఈ క్యారెక్టర్‌కి మరీ ఇంతలాగా అనిపించింది. అంత కష్టపడితేనే ఈ క్యారెక్టర్ వచ్చింది. మళ్లీ మళ్లీ తిరిగి నా దగ్గరికే వచ్చింది. ఈ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ అవ్వకముందే నాకు పర్సనల్‌గా చాలా సంతోషంగా అనిపించింది అని బిగ్‌బాస్ బ్యూటీ చెప్పారు.
హీరోయిన్ అనే ఒక ట్యాగ్ రావడం ఎంతో గౌరవంగా ఉంటుంది. ప్రొడక్షన్ హౌస్ ఓనర్స్, ప్రొడ్యూసర్స్... ఆర్టిస్టులు చిన్న ఓవరాక్షన్ చేస్తే తీసేయడంలో వెనుకాడరు. ఏదైనా కొంచెం అణిగిమణిగి ఉండాలి.. సెట్‌లో అయినా, ఇంట్లో అయినా అని అషురెడ్డి వ్యాఖ్యానించింది. దాంతో పక్కనే ఉన్న నిర్మాత ప్రవీణ కడియాల మైక్ లాక్కొని .. అణిగిమణిగి అక్కర్లేదు. ఎవరి డ్యూటీ వాళ్లు చేసుకుంటూ వెళితే అసలు ఎవరికీ ఏ ఇబ్బందులు రావు. ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ బాగా చూసుకుంటారు. లోకేషన్‌కి వచ్చి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఫీలైతే మిమ్మల్ని టచ్ కూడా చేయలేరని కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











