ఆ సర్జరీతో నా కెరీర్ క్లోజ్ అనుకొన్నా.. ఫ్యూచర్‌లో ఇబ్బంది రాకుండా.. అషురెడ్డి
మనసులోని భావాలను పంచుకోవడానికి, స్నేహితులను సంపాదించుకోవడానికి అందుబాటులోకి వచ్చిన సోషల్ మీడియా ఇప్పుడు ఎంతో మందికి ఉపాధిని అందిస్తోంది. సామాజిక మాధ్యమాలను వేదికగా మార్చుకుని తమ ప్రతిభను చాటుకుంటూ స్టార్స్‌గా నిలుస్తున్నారు . ఇలాంటి వారిలో అషు రెడ్డి కూడా ఒకరు. లుక్స్, పర్సనాలిటీ, ఫిగర్ పరంగా అచ్చుగుద్దినట్లు స్టార్ హీరోయిన్ సమంతలా కనిపించే అషు రెడ్డి డబ్‌స్మాష్ వీడియోలతో యువతలో క్రేజ్ సంపాదించుకున్నారు. దీంతో ఆమెను అంతా జూనియర్ సమంత అంటూ స్టార్‌ను చేసేశారు. ఈ ఫేమ్‌తో బుల్లితెరపై పలు రకాల షోలతో పాటు కొన్ని సినిమాల్లోనూ అవకాశాలు అందుకున్నారు అషు రెడ్డి.
ఇలాంటి దశలో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మతో ఇంటర్వ్యూ చేసి రాత్రికి రాత్రి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది ఈ ముద్దుగుమ్మ. వర్మ నేలపై కూర్చొని అషురెడ్డి పాదాలకు ముద్దుపెట్టిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3లోనూ అవకాశం దక్కించుకుంది. తన మైండ్ గేమ్‌తో పాటు అందాల ప్రదర్శనతో బిగ్‌బాస్ హౌస్‌కి గ్లామర్ సొగసులు అద్దింది అషు.

బిగ్‌బాస్ టైటిల్ విన్నర్ అవుతుందని అంతా అనుకున్న దశలో అషురెడ్డి.. ఐదు వారాల పాటు కొనసాగి ఎలిమినేట్ అయ్యింది. అనంతరం బిగ్‌బాస్ ఓటీటీలోనూ ఛాన్స్ దక్కించుకుని ఏకంగా పది వారాల పాటు కొనసాగింది. సినిమాలను కూడా ఓ చూపు చూసిన అషు రెడ్డి.. తొలుత 'ఛల్ మోహనరంగ' అనే సినిమాతో నటిగా టాలీవుడ్‌లో ఎంటరైంది. కానీ, తర్వాత ఎందుకో గ్యాప్ తీసుకుంది. తర్వాత బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ అనే సినిమాలో కనిపించింది. ప్రస్తుతం ఏ మాస్టర్ పీస్ అనే మూవీలో నటిస్తోంది. ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదలై మంచి స్పందన లభించింది.
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అంటే పడిచచ్చిపోయే అషురెడ్డి.. ఎప్పటికప్పుడు ఆయనపై అభిమానాన్ని చాటుకుంటూ పోస్టులు పెడుతుంది. దీంతో పవన్ అభిమానులు కూడా ఆమెపై అభిమానం చాటుకుంటూ ఉంటారు. కొద్దిరోజుల క్రితం అషురెడ్డి తన ముఖానికి సర్జరీ చేసుకుందంటూ ట్రోలింగ్ బారినపడింది. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో తాను ఎలాంటి సర్జరీ చేసుకోలేదని , ఇదంతా అబద్ధమని తేల్చేసింది అషు రెడ్డి.
తాజాగా బుల్లితెరపై ఫ్యామిలీ స్టార్స్ అనే కార్యక్రమంలో పాల్గొంటున్న అషురెడ్డి తాజాగా గతంలో తన తలకి జరిగిన సర్జరీ గురించి చెప్పి ఎమోషనల్ అయ్యారు. బ్రెయిన్‌కి ఆపరేషన్ జరగాల్సి ఉన్నందున నా తలపై జుట్టును తీసేయాలని చెప్పారని .. గుండు చేసినా పర్లేదు కానీ, అరగుండు చేయడంతో చూడలేమని అషురెడ్డి చెప్పింది. నాలుగు రోజుల తర్వాత తన ఫేస్‌లో ముఖం చూసుకుంటే నా కెరీర్ అయిపోయిందని అనుకున్నానని కంటతడి పెట్టింది.
అయినప్పటికీ నెల రోజుల తర్వాత లేచి నిలబడి ఏదో ఒకలా జుట్టు సెట్ చేసుకున్నానని చెప్పింది. అవన్నీ దాటుకుని తిరిగి బిజీ అయ్యానంటే అదంతా జ్ఞాపిక ఎంటర్‌టైన్మెంట్స్ వల్లేనని .. తనకు ఫ్యూచర్‌లో ఏ ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతో నాతో ఓ ఇల్లు కొనేలా చేశారని అషురెడ్డి తెలిపింది. ఇది నా జీవితంలోనే పెద్ద స్టెప్ అని వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు మీడియాలో వైరల్ అవుతుండగా నువ్వు ఫైటర్‌వి అంటూ నెటిజన్లు అషురెడ్డిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


Click it and Unblock the Notifications











