వేణుస్వామితో బిగ్‌బాస్ బ్యూటీ ప్రత్యేక పూజలు.. వెంట ఆ ప్రొడ్యూసర్ కూడా!

జీవితంలో గడ్డు పరిస్ధితులు ఎదురైనప్పుడు, సమస్యలు చుట్టుముట్టినప్పుడు దేవుడు, జ్యోతిష్యం అన్నవి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి గుర్తొస్తాయి. సామాన్యులే కాదు సెలబ్రెటీలు కూడా ఇందుకు అతీతం కాదు. ఎవరి స్థాయిని బట్టి వారు పూజలు, హోమాలు ఇతర పరిహారాలు చేసి కెరీర్‌లో తిరిగి పుంజుకోవాలని ఆశపడేవారు. అయితే తెలుగునాట సెలబ్రెటీలకు పూజలు, పరిహారాలు అంటే భారీ పర్సనాలిటీతో, పెద్ద బొట్టుతో ఒకాయన గుర్తొస్తాడు. ఆయనే వేణుస్వామి. జాతకాలు, జ్యోతిష్యాలతో ఫేమస్ అయి ఆ తర్వాత తాంత్రిక పూజలతో హాట్ టాపిక్‌గా మారాడు.

వేణుస్వామి జోస్యాలకు గిరాకీ

తరచుగా ప్రముఖ రాజకీయ నాయకులు, సెలబ్రెటీలపై జోస్యం చెబుతూ వార్తల్లో నిలుస్తుంటాడు వేణుస్వామి. తొలుత ఈయన సాదాసీదా జ్యోతిష్యుడిగానే ఉండేవాడు. ఎప్పుడైతే సమంత - నాగచైతన్య విడాకులు తీసుకుంటారని చెప్పాడో నాటి నుంచి వేణుస్వామికి డిమాండ్ పెరిగిపోయింది. పలు అంశాలలో ఆయన చెప్పిన జ్యోస్యాలు ఫలించడంతో సామాన్యులతో పాటు సెలబ్రెటీలు కూడా ఆయన ఇంటికి క్యూకట్టారు. ఒకదశలో వేణుస్వామి అపాయింట్‌మెంట్ దొరకడం కూడా కష్టమైంది.

Bigg Boss Fame Ashu Reddy Performed Special Rituals With Astrologer Venu Swamy

తాంత్రిక పూజలతో వేణుస్వామి ఫేమస్

అయితే కేవలం జ్యోతిష్యం, వాస్తు ఇలాంటివే కాకుండా ఓ స్పెషాలిటీ కూడా బయటికి తీశారు వేణుస్వామి. అవే తాంత్రిక పూజలు. ప్రముఖ శక్తిపీఠం అస్సోంలోని కామాఖ్య అమ్మవారి ఆలయంలో వేణుస్వామితో పూజలు చేయించుకున్న పలువురు హీరోయిన్లు స్టార్ స్టేటస్ అందుకోవడంతో కష్టాల్లో ఉన్న సెలబ్రెటీలంతా ఆయనను ఆశ్రయించడం మొదలైంది. వేణుస్వామితో పూజలు చేయించుకున్న డింపుల్ హయాతి, నిధి అగర్వాల్, రష్మిక మందన్న, ఇనయా సుల్తానా వంటి వారు కెరీర్‌లో నిలదొక్కుకోవడంతో సినీ జనాలకు ఆయనపై బాగా గురి కుదిరింది.

దెబ్బకొడుతున్న వేణుస్వామి జోస్యాలు

సినీతారలే కాకుండా బుల్లితెర నటీనటులు కూడా వేణుస్వామి వద్దకు పరుగులు తీస్తున్నారు. అయితే గతేడాది నుంచి వేణుస్వామి జోస్యాలు పూర్తిగా దెబ్బకొడుతున్నాయి. తెలంగాణ, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, ఐపీఎల్ , ప్రభాస్ ఆరోగ్యంతో పాటు ఇటీవలి భారత్- పాకిస్తాన్ యుద్ధం గురించి ఆయన చెప్పిన జోస్యాలకు విరుద్ధంగా జరిగాయి. దీనికి తోడు జర్నలిస్ట్ టీవీ 5 మూర్తితో వివాదం.. నాగచైతన్య- శోభిత పెళ్లిపై చెప్పిన జోస్యంతో ఏకంగా మహిళా కమీషన్ చేత మొట్టికాయలు తినాల్సి వచ్చింది. దాంతో తాను రాజకీయ, సెలబ్రెటీ జాతకాలపై ఎలాంటి విశ్లేషణలు చేయనని లెంపలు వేసుకున్నాడు వేణుస్వామి. సెలబ్రెటీలు కూడా గతంలో మాదిరిగా ఆయన వద్దకు వెళ్లడం లేదని ఆ మధ్య ప్రచారం జరిగింది. అయితే వీటిని పటాపంచలు చేస్తూ తన డిమాండ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్నారు వేణుస్వామి.

అషురెడ్డితో వేణుస్వామి పూజలు

సినీనటి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ అషురెడ్డితో వేణుస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమెను కామాఖ్య ఆలయానికి తీసుకెళ్లి పూజలు చేయించి ఆశీర్వచనం ఇప్పించారు. అషురెడ్డి వెంట సినీనటి, బుల్లితెరపై పలు షోలను నిర్మించే ప్రవీణ కడియాల కూడా ఉన్నారు. ప్రస్తుతం అషురెడ్డి కెరీర్ అంతంత మాత్రంగా ఉండటంతో వేణుస్వామితో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలను అషురెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అయితే గతంలోనూ అషురెడ్డితో ప్రత్యేక పూజలు చేయించారు వేణుస్వామి. అప్పట్లో సినిమాల్లో ఆఫర్ల కోసం ఆమెతో రాజశ్యామలాదేవి, బగళాముఖీ దేవీలకు పూజలు చేయించినట్లు టాక్.

More from Filmibeat

Read more about: ashu reddy venu swamy movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X