Ashu Reddy Marriage: అతడితోనే నా పెళ్లి.. బిగ్‌బాస్ షో తర్వాత లవ్ అఫైర్.. అషురెడ్డి
టెలివిజన్ ఇండస్ట్రీలో టాప్ యాంకర్, యాక్టర్, టెలివిజన్ ప్రజెంటర్ అషురెడ్డి గ్లామర్‌తోనే కాకుండా యాక్టింగ్‌తో ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. టెలివిజన్ షోలు, బిగ్ బాస్, సినిమాలతో బిజీగా ఉంటూనే ఉంటారు. విదేశీ టూర్లు, వెకేషన్ ఫోటోలతో సోషల్ మీడియాలో అల్లాడించేస్తుంటారు. అయితే తాజాగా ఓ టెలివిజన్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిగ్‌బాస్ తెలుగు షో విశేషాలు, ఆ షోలో కలిసిన వ్యక్తితో కలిసి త్వరలోనే పెళ్లి చేసుకోబొతున్నారనే వార్తను వెల్లడించారు. ఈ సందర్భంగా బిగ్ టీవీలో జబర్దస్త్ వర్షతో కలిసి అషురెడ్డి చెప్పిన వివరాల్లోకి వెళితే..
నేను అమెరికాలో ఎంబీఏ పూర్తి చేశాను. ఆ తర్వాత జాబ్ చేస్తున్నాను. ఆ సమయంలో చల్ మోహనరంగ సినిమాలో అవకాశం వచ్చింది. నితిన్ హీరో పవన్ కల్యాణ్ ప్రొడ్యూసర్‌గా సినిమా చేస్తున్నారనే తెలిసిన వెంటనే మరోమారు ఆలోచించకుండా ఒప్పుకొన్నాను. నా క్యారెక్టర్ ఎన్ని నిమిషాలు, ఎంత నిడివి ఉంటుంది? ఎలాంటి క్యారెక్టర్ అనే విషయం ఆలోచించకుండా ఆ సినిమాలో నటించాను అని చెప్పారు.

చల్ మోహనరంగ సినిమా తర్వాత జాబ్ చేయాలా? లేదా ఇండస్ట్రీలోనే ఉండిపోవాలా? అనే ఆలోచనలో ఉన్నాను. ఒక వైపు నా ఫ్యామిలీ నా ఇంట్రెస్టులను ఒప్పుకోలేదు. సినీ పరిశ్రమలో కొనసాగడం వారికి ఇష్టం లేదు. కానీ వారి మనసు మార్చడంలో నా సిస్టర్ దివ్య సక్సెస్ అయింది. ఆ తర్వాత నన్ను ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో కొనసాగేలా చేశారు అని అషురెడ్డి చెప్పారు.
అయితే జాబ్ చేయాలా?, ఇండస్ట్రీలో ఉండాలా? అనే సందిగ్ధంలో ఉన్న సమయంలో బిగ్‌బాస్ తెలుగు షోలో ఆఫర్ ఇచ్చారు. అయితే బిగ్‌బాస్ తెలుగులోకి వెళ్లిన తర్వాత నాకు రాహుల్‌తో రిలేషన్‌షిప్ ఏర్పడింది. రాహుల్ బయటకు కనిపించే విధంగా ఉండరు. చాలా సిగ్గు, బిడియంతో ఉంటాడు. బాగా పాటలు పాడుతాడు. కానీ నా కోసం ఎప్పుడూ పాటలు పాడలేదు. నేను పాటలు పాడుతానని చెప్పిన అవకాశం ఇవ్వడు అని అషురెడ్డి చెప్పారు.
రాహుల్‌తో చాలా సార్లు హ్యాంగవుట్ అవుతుంటాను. ఒక్కసారి మాత్రం నేను, ఆయన కలిసి దుబాయ్‌లో హ్యాంగవుట్ అయ్యాం. అయితే నేను వేరుగా వెళ్లాను. ఆయన వేరే పని మీద వచ్చారు. సోషల్ మీడియాలో పోస్టు చేసి.. నీవు ఇక్కడే ఉన్నావా? అంటే అవునని ఓ సాయంత్రం కలిశాను. రాహుల్‌తో నా రిలేషన్ అలా సాగింది అని అషురెడ్డి చెప్పారు.
అయితే రాహుల్ కుటుంబం నాకు ఫ్యామిలీ లాంటింది. మా కుటుంబంతో కూడా వారు చాలా బాగా ఉంటారు. రాహుల్, నేను వేరు కాదనే విధంగా మా మధ్య బాండింగ్ ఉంటుంది. మా బంధం విషయంలో రాహుల్ ఫ్యామిలీ ఓ ప్రకటన అధికారికంగా చేస్తారు. దానిని నేను రీ పోస్టు చేస్తాను. అంతకంటే ఇప్పుడు ఎక్కువగా ఏ విషయాలను వెల్లడించలేను అని అషురెడ్డి చెప్పారు. దాంతో అషురెడ్డి, రాహుల్ సిప్లిగంజ్ వివాహం త్వరలోనే జరుగుతుందనే విషయాన్ని హింటుగా తన అభిమానులకు ఆమె అందించారు.


Click it and Unblock the Notifications











