అరియానా వల్లే ఏడాదిగా కష్టాలు.. నానా అవస్థలు.. అషురెడ్డి షాకింగ్!
కింగ్, అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నబిగ్ బాస్ రియాలిటీ షోతో ఎంతో మందికి మంచి లైఫ్ దొరికింది. ప్రేక్షకులకు గుర్తింపు దక్కడంతో పాటు వారి వారి నైపుణ్యాలను బట్టి బుల్లితెరపై సందడిచేసే అవకాశం లభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షోతో యాంకర్ అరియానా గ్లోరీ, యంగ్ బ్యూటీ.. టిక్ టాక్ వీడియోలతో ఫేమ్ సంపాదించిన అషురెడ్డికి కూడా మంచి గుర్తింపు వచ్చింది. దాంతో బుల్లితెరపై పలు టీవీ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ యాంకర్లు ఇద్దరూ ఆడియెన్స్ కు కావాల్సినంత ఎంటర్ టైన్ మెంట్ ను అందిస్తున్నారు. తమ టాలెంట్ తో ఎప్పటికప్పుడు అలరించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఆడియెన్స్ ను ఫుల్ ఖుషి చేస్తున్నారు. తమకంటూ మరింతగా క్రేజ్ దక్కించుకుంటున్నారు. ఆన్ స్క్రీన్ మీదనే కాకుండా.. ఆఫ్ స్క్రీన్ మీద కూడా అరియానా గ్లోరీ, అషురెడ్డి ఎంతో స్నేహపూర్వకంగా ఉంటారు. ఒకరికొకరు సహకరించుకుంటూ కనిపిస్తుంటారు. అయితే వీరద్దరి మధ్య ఏడాదిగా పడటం లేదని తాజాగా బయటపడింది.

సుడిగాలి సుధీర్, కావ్య శ్రీ యాంకర్లుగా వ్యవహరిస్తున్న ప్రజెంట్ ట్రెండింగ్ టీవీ షో 'ఫ్యామిలీ స్టార్స్' టీవీ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. సెలబ్రెటీలతో ఈ షోల మంచి కంటెంట్ ను అదిస్తోంది. ఫ్యామిలీతో కలిసి చూసేలా స్కిట్లు చేస్తూ అలరిస్తున్నారు ఆర్టిస్టులు. ఈ టెలివిజన్ షో లేటెస్ట్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదలైంది. కృష్ణ భగవాన్, అన్నపూర్ణ హోస్ట్ లుగా వ్యవహరిస్తుండగా.. సుడిగాలి సుధీర్ తన కామెడీ టైమింగ్ తో అదరగొడుతున్నారు. యంగ్ బ్యూటీలు, సెలబ్రెటీ ఆర్టిస్టులు హాజరైన షోలో సందడి చేస్తున్నారు.
చివరిగా యంగ్ హీరో విశ్వక్ సేన్ షోకు వచ్చి సందడి చేశారు. ఆయన్ని సుడిగాలి సుధీర్ చిక్కులు పశ్నలు అడిగి ఇరకాటంలో పెట్టారు. ఇక తాజాగా అషురెడ్డి, అరియానా గ్లోరీకి వేసిన ప్రశ్నలతో కొద్ది నెలలుగా సాగుతున్న కోల్డ్ వార్ కు తెర దించారు. మరోవైపు అరియానా గ్లోరీ కంటతడి పెట్టుకోవడం లేటెస్ట్ ఎపిసోడ్ పై ఆసక్తిని పెంచింది. అయితే.... తమ పర్సనల్ లైఫ్ లో ఎవరికోసమైనా ఎదురుచూశారా? అని అడిగిన ప్రశ్నకు అషురెడ్డి భావోద్వేగంగా సమాధానం ఇచ్చింది. గతేడాది తను హెల్త్ ప్రాబ్లంతో నానా అవస్థలు పడుతున్నప్పుడు తనకు ఎంతో ఇష్టమైన స్నేహితురాలు అరియానా గ్లోరీ కనీసం వచ్చి పలకరించలేదని షోలో బయటపెట్టింది.
ఏడాదిగా తను కష్టాలు పడుతున్నా అరియానా మాత్రం పట్టించుకోలేదని, తను బాధల్లో ఉన్నప్పుడు ఇవ్వాల్సిన సపోర్ట్ ఇవ్వలేదని చెప్పుకొచ్చింది. సర్జరీ అయ్యి ఎంతో బాధపడినా కనీసం ఫోన్ కూడా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. పక్కనే ఉన్న అరియానా గ్లోరీ ఇంత మనస్సులో పెట్టుకొని ఇన్నాళ్లు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించింది. అషురెడ్డికి హెల్త్ బాలేనప్పుడు మాట్లాడేందుకు ఎంతో ప్రయత్నించానని చెప్పుకొచ్చింది. కానీ అషురెడ్డి ఒప్పుకోలేదు. వీరి మధ్య వైరంతో ఫ్యామిలీ స్టార్స్ లేటెస్ట్ ఎపిసోడ్ పై ఆసక్తి నెలకొంది. మార్చి 2న ఈటీవీ విన్ లో ఫుల్ ఎపిసోడ్ ప్రసారం కానుంది. మిగితా ఆర్టిస్టులు కూడ తమ పంచులు, ప్రసాలు, స్పెషల్ స్కిట్స్, టాస్క్ లతో అలరించారు.


Click it and Unblock the Notifications











